హాట్ బ్యూటీతో జబర్ధస్త్ వినోద్‌కు బంపర్ ఆఫర్.. ఏం జరుగుతున్నదంటే
'జబర్ధస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కళాకారులు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒకవైపు వినోదాన్ని పంచుతూనే.. మరోవైపు, ఎంతో మంది ఆర్టిస్టులను అందిస్తోందీ షో. అందుకే 'జబర్ధస్త్'కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ షో ద్వారా ఫేమస్ అయి, సినిమా అవకాశాలను దక్కించుకున్న వారిలో వినోద్ అలియాస్ వినోదిని ఒకడు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న అతడు.. బుల్లితెరపై సత్తా చాటుతున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

ఆడవేషాలతో బాగా ఫేమస్
వినోద్.. జబర్ధస్త్ షో ద్వారా బుల్లి తెరకు పరిచయం అయ్యాడు. ఎప్పుడూ ఆడ వేషాలతోనే కనిపించే వినోద్.. వినోదిని అనే పేరుతో ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా చమ్మక్ చంద్ర స్కిట్లలో వినోద్ చేసే పర్‌ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. జబర్ధస్త్ షోలోనే కాకుండా బయట జరిగే ఈవెంట్లకు కూడా ఆడవేషాలతోనే వెళ్తుంటాడు. దీంతో అతడికి ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఎక్కడికి వెళ్లినా చాలా మంది తనను సెల్ఫీలు అడుగుతుంటారని వినోద్ గతంలో చెప్పాడు.

వివాదాలతో సతమతం
జబర్ధస్త్ కమెడియన్ వినోద్ తీరు మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఒకసారి వినోద్‌కు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నింగా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత అతడు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం అయింది. ఇక, తాజాగా జరిగిన దాడి ఘటనతో అతడు మరోసారి వార్తల్లోకి వచ్చాడు. దీని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

మేమున్నామని అండగా నిలిచారు
ఇటీవల వినోద్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అంతేకాదు, ఇది పెద్ద దుమారమే రేపింది. దాని తర్వాత జబర్ధస్త్ వాళ్లు అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చాడు వినోద్. ‘ఈ మధ్య నాకు జరిగిన ఇష్యూలో జబర్ధస్త్ ఫ్యామిలీ నాకు తోడుగా నిలిచింది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్' అని వినోద్ చెప్పాడు.

సినిమా అవకాశాలపై స్పందిస్తూ...
జబర్దస్త్ షోతో పాటు తనకు వచ్చే అవకాశాలపై స్పందిస్తూ.. ‘నేను మొదట రామప్ప అనే సినిమాలో చేశాను. ఆ తర్వాత రెండు మూడు టీవీ షోలలో పాల్గొన్నాను. వీటి తర్వాతే జబర్ధస్త్‌లో అవకాశం వచ్చింది. అయితే, ఎక్కడా రాని పేరు ఈ షోలో వచ్చింది. అందరికీ వినోదినిగా బాగా గుర్తుండిపోయేలా ఫేమస్ అయ్యానంటే దానికి కారణం జబర్ధస్తే' అని వినోద్ వివరించాడు.

బాలీవుడ్ మూవీ చేస్తున్నా
వినోద్ మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించాడు. ‘నేను బాలీవుడ్‌లోకి ఎంటర్ అవుతున్నా. పూనమ్ పాండే లీడ్ రోల్ చేస్తున్న ఓ మూవీలో నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్‌లో మూడు రోజులు పాల్గొన్నా. ఆ తర్వాత నాపై దాడి జరగడంతో నా డేట్స్‌లో కొన్ని మార్పులు చేశారు. త్వరలోనే మరోసారి షూటింగ్‌లో జాయిన్ అవుతా' అని వినోద్ వెల్లడించాడు.


Click it and Unblock the Notifications











