twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాని కోసమే పెంచుతూ వస్తున్నా.. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు.. క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ వినోద్

    |

    జబర్దస్త్ వినోద్.. ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్ అవుతోంది. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా వినోదినిగా గుర్తింపు తెచ్చుకున్నాడు వినోద్. ఆడ గెటప్పులు వేస్తూ బుల్లితెర ఆడియన్స్‌కి వినోదాల విందు ఇస్తున్నాడు. అయితే ఇటీవలే ఆయనపై దాడి జరగడం, ఆ తర్వాత వార్తల్లో నిలవడంతో వినోద్ టాపిక్ జనాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో పలు యూ ట్యూబ్ ఛానెల్స్ వినోద్‌ని ఇంటర్వ్యూ చేశాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు వినోద్. వివరాల్లోకి పోతే..

    లేడీ గెటప్.. అందరి భావన అదే

    లేడీ గెటప్.. అందరి భావన అదే

    జబర్దస్త్‌ ప్రోగ్రామ్ లో ఎప్పుడూ లేడీ గెటప్ ద్వారానే అలరిస్తుంటాడు వినోద్. కొందరైతే అతను అమ్మాయి కాదు అని గుర్తు కూడా పట్టారు. ఇక మరికొందరేమో అతన్ని చూసి ట్రాన్స్‌జెండర్ అనుకుంటారు. అయితే అలాంటి వారికి క్లారిటీ ఇస్తూ తాజాగా ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాడు వినోద్.

    జబర్ధస్త్‌లోకి వరుణ్ తేజ్.. ఒక్కడే కాదు ఆయనతో కలిసి.. ఎందుకో తెలుసా?జబర్ధస్త్‌లోకి వరుణ్ తేజ్.. ఒక్కడే కాదు ఆయనతో కలిసి.. ఎందుకో తెలుసా?

    దయచేసి అలా అనుకోవద్దు

    దయచేసి అలా అనుకోవద్దు

    తాను ట్రాన్స్‌జెండర్ కాదని, తన ఒరిజినల్ ఐడెంటిటీ వినోద్ అని చెప్పిన ఆయన.. జీవితమంతా వినోద్ గానే కొనసాగుతాను తప్ప.. ట్రాన్స్‌జెండర్‌గా మారే ఆలోచనే లేదని తెలిపాడు. వినోదిని అనేది కేవలం పాత్ర మాత్రమే అని, అది జబర్దస్త్ ప్రోగ్రామ్ వరకు మాత్రమే పరిమితం అని, దాన్ని చూసి నన్ను వేరేలా ఉహించుకోవద్దని అన్నాడు వినోద్.

    దాని కోసమే పెంచుతూ వస్తున్నా.. అంతేగానీ వేరే ఉద్దేశం లేదు

    దాని కోసమే పెంచుతూ వస్తున్నా.. అంతేగానీ వేరే ఉద్దేశం లేదు

    లేడీ గెటప్‌ అచ్చు గుద్దినట్లుగా ఉండాలనే చేతి గోళ్లు కూడా పెంచుకున్నానని, అంతేగానీ వేరే ఉద్దేశం లేదని వినోద్ అన్నాడు. లేడీ గెటప్‌లో ఆడియెన్స్‌ను మెప్పు పొందడానికే పెర్ఫామెన్స్‌పై కాస్త ప్రత్యేక శ్రద్ద పెడుతానని, అలాగే అమ్మాయిలా అందంగా తయారవుతానని అన్నాడు. దయచేసి ఇంకోలా అనుకోవద్దని ఈ సందర్బంగా ఆయన చెప్పాడు.

    కెరీర్ గురించి చెబుతూ..

    కెరీర్ గురించి చెబుతూ..

    ఇక ఇటీవలే తనపై జరిగిన దాడి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని, తిరిగి జబర్దస్త్‌ వేదికపై మీ అందరికీ వినోదం పంచుతానని వినోద్ చెప్పాడు. జబర్దస్త్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నానని, కెరీర్ సాఫీగా సాగేలా అడుగులు వేస్తున్నానని వినోద్ తెలిపాడు.

    English summary
    Jabardasth Comedy show Comedian Vinod has injured in an attack. He has been suffering with head injury. He filed a complaint on his house owner. He is residing in Kachiguda of Hyderabad. Now he tells reason for attack.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X