అందుకే నాగబాబుకు దూరం.. నాకు బలుపు అనుకొంటే.. వివాదంపై ఆది హాట్ కామెంట్

తెలుగు టెలివిజన్ రంగంలో రియాలిటీ షోల తీరును మార్చేసినదేమైనా ఉందటే.. అది జబర్దస్త్. ఆ షో ద్వారా ప్రేక్షకులు వినోదాన్ని పొందడమే కాకుండా.. అత్యంత ప్రజాదరణను కట్టబెట్టారు. ఇలాంటి క్రమంలో జబర్దస్త్ అంటే ఠక్కున గుర్తొచ్చేది కమెడియన్ ఆది. ఆయన స్కిట్స్‌కు విశేషమైన ఆదరణ ఉంది. దాంతో టాప్ కమెడియన్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్నారు. ఈ క్రమంలో అదిరింది షో పోటీగా రావడం, దానికి నాగబాబు వెళ్లడం కొంత గందరగోళంగా మారింది. ఈ క్రమంలో నాగబాబు గురించి ఆది ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అదేమిటంటే..

జబర్దస్త్‌కు ఢోకా లేదు

జబర్దస్త్‌కు ఢోకా లేదు

అదిరింది షో స్టార్ట్ అయినా జబర్దస్త్‌కు ఎలాంటి దెబ్బ తగల్లేదు. కారణంగా కటెంట్ మాత్రమే. అదిరింది పోటీగా ఉన్న అక్కడ పాల్గొనే వాళ్లందరూ మాకు సన్నిహితులే. నాగబాబు అదిరింది షోకు వెళ్లినా.. ఆయన మాకు ఎప్పుడూ ప్రోత్సాహం అందిస్తుంటారు. మీరు బాగా చేయాలి, మనవాళ్లంత బాగా చేయాలి అని నాగబాబు మెసేజ్ పెట్టారు అని ఆది చెప్పారు.

అందుకే తోడుగా ఉండలేదు

అందుకే తోడుగా ఉండలేదు

అదిరింది షో కోసం నన్ను అడిగారు. కానీ అక్కడ ఉన్న కొన్ని పరిస్థితుల, వ్యక్తుల వల్ల నేను వెళ్లలేదు. ఆయనకు తోడుగా నేను నిలబడలేకపోయాను. కొందరు వ్యక్తుల వల్ల నేను నాగబాబుతో కలిసి ఉండలేకపోయినా.. రెగ్యులర్‌గా ఆయనతో మాట్లాడుతుంటాను. జబర్దస్త్ వల్లనే కాకుండా వ్యక్తిగతంగా కూడా నాకు మంచి రిలేషన్ ఉన్నాయి అని ఆది తెలిపారు.

నాగబాబుతో నా రిలేషన్

నాగబాబుతో నా రిలేషన్

నాగబాబుతో నాకు వ్యక్తిగత రిలేషన్స్ చాలా బలంగా ఉన్నాయి. జనసేన పార్టీ తరఫున నేను ప్రచారం చేశాను. అలాగే ఆయన ఎంపీగా నిలబడిన సమయంలో ఆయనతోపాటు నియోజకవర్గం అంతా తిరిగాను. ఇక ముందు జనసేన తరుఫున ప్రచారం చేస్తాను. నాగబాబు ఎక్కడ నిలబడినా నేను ప్రచారం చేస్తాను అని ఆది అన్నారు. ఆయనతో అనుబంధం సినీ, రాజకీయ, టెలివిజన్ పరంగా గొప్పగా ఉందన్నారు.

మాకు ఫ్యాన్స్ ఉంటారా?

మాకు ఫ్యాన్స్ ఉంటారా?

జబర్దస్త్ వల్ల మాకు బాగా ప్రజాదరణ లభించింది. మాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మాకు ఫ్యాన్స్ ఉన్నారంటే ఒప్పుకొను. కాకపోతే మమ్మల్ని ఇష్టపడే వాళ్లు ఉంటారు. నా స్వభావాన్ని చూసి కొంత మంది డౌన్ టూ ఎర్త్ అని, నా మాట్లాడే తీరు వల్ల కొంతమంది నాకు బలుపు అనుకొంటారు అని ఆది పేర్కొన్నారు.

Recommended Video

Jabardasth Comedy Show Management New Rules To Comedians
ఒక్కొక్కరికి ఒక్కో ఇమేజ్

ఒక్కొక్కరికి ఒక్కో ఇమేజ్


టెలివిజన్ రియాలిటీ షోలో ఒక్కొక్కరిది ఒక్కోస్టయిల్. ఆది తోపు అనుకోవడం తప్పు. ఎవరి జోనర్ వారిదే. ప్రతీ ఒక్కరికి ఒక్కో రకమైన ఇమేజ్ ఉంది. అందరూ కలిస్తేనే జబర్దస్త్. నేనొక్కడినే షోను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం అసాధ్యం. జబర్దస్త్ అనే టీమ్ వర్క్ అని ఆది అన్నారు. చమక్ చంద్ర ఇతరులు బాగా ఆకట్టుకొంటున్నారని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X