రోజాను ఢీకొట్టేందుకు నాగబాబు రెడీ.. జబర్దస్త్‌కు ధీటుగా.. బుల్లితెరపై ‘కామెడీ షో‘ ఫైట్

తెలుగు బుల్లితెరపై అధిపత్యాన్ని కొనసాగిస్తున్న కామెడి రియాలిటీ షో జబర్దస్త్‌ను ఢీకొట్టేందుకు మరో కామెడీ షో అదిరింది రెడీ అయ్యింది. లాక్‌డౌన్‌కు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన షో షూటింగులు వాయిదా పడటంతో పూర్తిస్థాయిలో ప్రసారం కాలేకపోయింది. ఇప్పుడు మరోసారి పూర్తి హంగులతో అదిరింది ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. దీంతో జబర్తస్థ్, అదిరింది షోల మధ్య పోటీపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగినట్టు కనిపిస్తున్నది. ఆ పోటీ ఎలా ఉంటుందనే విషయంపై..

ఖతర్నాక్ కామెడీ షో అంటూ

ఖతర్నాక్ కామెడీ షో అంటూ

గతంలో ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ అంటూ ప్రముఖ ఛానెల్లో ప్రచారమైన షోపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొందరు బూతులతో నిండపోయిందంటే.. కొందరు మారిన పరిస్థితుల్లో ఆ మాత్రం ఉండొద్దా అంటూ సమర్ధించే ప్రయత్నం చేశారు. ఎవరెన్నీ విమర్శించినప్పటికీ జబర్దస్త్ కామెడీషోకు ప్రేక్షకులు బ్రహ్మండంగా అండగా నిలిచారు.

తెలుగు టెలివిజన్ రంగంలో

తెలుగు టెలివిజన్ రంగంలో

తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్‌కు గణనీయమైన గుర్తింపే ఉంది. సినీ పరిశ్రమకు లెక్కలేనేంత మంది కమెడియన్లను పరిచయం చేసింది. పలువురు సినిమాలో కమెడియన్లుగా, టెలివిజన్‌పై హోస్టులుగా మారి ఆదాయ వనరులను పెంచుకోవడమే కాకుండా క్రేజ్‌ను కూడా సొంతం చేసుకొన్నారు. జబర్దస్త్‌లో కమెడియన్ గ్రూపుల బృందాలతోపాటు ఆ షోకు ఇద్దరు న్యాయమూర్తులు నాగబాబు, రోజా మంచి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. వ్యక్తిగత ఆలోచన విధానం విషయంలో వారిద్దరిది వేరు దారులైనప్పటికీ.. ఆ తేడా ఏ మాత్రం కనిపించకుండా జబర్దస్త్‌ను ఏకతాటి మీదకు తీసుకొచ్చి మంచి ఆదరణ కల్పించడంలో తమ వంతు పాత్రను పోషించారు.

నాగబాబు హోస్ట్‌గా అదిరింది

నాగబాబు హోస్ట్‌గా అదిరింది

అయితే పరిస్థితుల్లో కొన్ని మార్పుల వల్ల జబర్దస్త్‌కు న్యాయమూర్తిగా వ్యవహరించిన నాగబాబు ఆ షో నుంచి తప్పుకోవడం వెంటనే మరో ఛానెల్‌లో అదరింది షోతో మరో కార్యక్రమాన్ని ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి. అయితే అదిరింది ప్రారంభమైన కొద్ది రోజులకే లాక్‌డౌన్ విధించడంతో కామెడీ షోకి బ్రేక్ పడింది.

హైపర్ ఆది వర్సెస్ సద్దాం హుస్సేన్

హైపర్ ఆది వర్సెస్ సద్దాం హుస్సేన్

ఇక జబర్దస్త్ విషయానికి వస్తే హైపర్ ఆది నేతృత్వంలోని సుధీర్, రాంప్రసాద్‌తో కూడిన బృందం ఎప్పటి నుంచో ఆ షోకు వెన్నుముకగా నిలిచింది. ఇక కొత్తగా ప్రారంభమైన అదిరింది షోలో కొత్త దూసుకొచ్చిన సద్దా టీమ్ ప్రస్తుతం మెరుపులు మెరిపించే ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలో జబర్దస్త్ షో, అదిరింది మధ్య మంచి ఆహ్లాదకరమైన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అనసూయ వర్సెస్ యాంకర్ రవి

అనసూయ వర్సెస్ యాంకర్ రవి

ఇక రెండు కామెడీ షోలకు బలమైన హోస్టులు, న్యాయమూర్తులు ఉండటంతో మరింత క్రేజీగా మారింది. జబర్దస్త్‌కు అనసూయ హోస్ట్‌గా ఉంటే.. అదిరిందికి యాంకర్ రవి ధీటుగా నిలిచాడు. నాగబాబు స్థానంలో సింగర్ మనో చేరారు. అదిరిందిలో నాగబాబుకు సపోర్టుగా హీరో నవదీప్ న్యాయమూర్తిగా మారారు. ఇక టోటల్‌గా ఇప్పుడు ఈ రెండు కామెడీ షోలు రోజా వర్సెస్ నాగబాబుగా మారాయి. ఈ రెండు షోలలో ఎవరు ఎక్కువగా ప్రేక్షకులను ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
జూలై 5న అదిరింది షో

జూలై 5న అదిరింది షో

కాగా, జబర్దస్త్ షో ఇప్పటికే ప్రసారం అవుతుండగా, అదిరింది షో త్వరలోనే అంటే జూలై 5వ తేదీన పున: ప్రారంభం కావడానికి సిద్ధమవుతున్నది. తాజాగా విడుదలైన ప్రోమో ఆకట్టుకొనేలా ఉంది. ‘మరెన్నో సరికొత్త మరెన్నో సరికొత్త,సరదా సరదా ఎపిసోడ్లతో మీ ముందుకు రాబోతుంది. అదిరింది - మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్!! నవ్వులే నవ్వులు అంటూ ప్రోమోను రిలీజ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X