హైపర్ ఆదికి చేదు అనుభవం.. ‘నీకసలు సిగ్గుందా’ అంటూ రెచ్చిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్.!
తెలుగు టెలివిజన్‌లో వచ్చే కామెడీ షోలలో 'జబర్ధస్త్'కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది మంచి మంచి ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకరు. జబర్ధస్త్ ద్వారా పరిచయం అయిన ఈ యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టు.. ఆ షో రేటింగ్‌ను పెంచేసే స్థాయికి ఎదిగిపోయాడు. అదే సమయంలో మంచి పాపులారిటీని సైతం దక్కించుకున్నాడు. గుక్క తిప్పకుండా పంచులు వేస్తూ కడుపుబ్బా నవ్వించే ఈ కమెడియన్‌కు బిగ్ బాస్ కంటెస్టెంట్ వల్ల ఊహించని అనుభవం ఎదురైంది. ఇంతకీ ఏం జరిగింది.?

ఆది ఇలా ఉన్నాడంటే వాళ్లే కారణం
జబర్ధస్త్ షో వల్లే హైపర్ ఆది వెలుగులోకి వచ్చాడన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆయన ఈ షోలోకి రావడం వెనుక అదిరే అభి పాత్ర ఉంది అని కొందరికి మాత్రమే తెలుసు. మొదట ఆది.. అభి టీమ్‌లోనే చేశాడు. ఆ సమయంలో అతడి రైటింగ్స్ స్కిల్స్ చూసి జబర్ధస్త్ డైరెక్టర్లు నితిన్, భరత్ టీమ్ లీడర్‌గా అవకాశం కల్పించారు.

ఇక్కడ మాత్రమే కాదు.. అక్కడ కూడా
హైపర్ ఆది బుల్లితెరపైన మాత్రమే తన ప్రభావం చూపించలేదు. అతడు ఈ మధ్య విడుదలైన ‘వెంకీ మామ'తో పాటు వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ', ‘ఆటగదరా శివ', ‘మేడ మీద అబ్బాయి', ‘చిత్రలహరి' సహా పలు సినిమాల్లో నటించాడు. అలాగే, అల్లరి నరేష్ నటించిన ‘మేడ మీద అబ్బాయి' సహా పలు చిత్రాలకు డైలాగ్ రైటర్‌గానూ పని చేశాడు.

స్పెషల్ షోల స్పెషలిస్టు ఆదినే
జబర్ధస్త్‌లో వచ్చే స్కిట్లు, సినిమాల్లో డైలాగులు మాత్రమే కాదు.. హైపర్ ఆది స్పెషల్ షోలకు కూడా స్క్రిప్టు రాస్తుంటాడు. పండుగలకు, ప్రత్యేక రోజులకు మల్లెమాల వాళ్లు షోలు ప్రసారం చేస్తుంటారు. వీటిలో జబర్ధస్త్ కమెడియన్లతో పాటు ఎంతో మంది సెలెబ్రిటీలను కూడా తీసుకు వస్తుంటారు. ఈ షోలు భారీగా టీఆర్పీలను సొంతం చేసుకుంటుంటాయి.

న్యూ ఇయర్ స్పెషల్‌గా ఆడవాళ్ల షో
ప్రతి ఏడాది న్యూ ఇయర్ రోజు మల్లెమాల వాళ్లు స్పెషల్ షోను ప్లాన్ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా వాళ్లు సరికొత్త ఈవెంట్‌తో ముందుకు వస్తున్నారు. ‘ఆడువారి పార్టీలకు అర్థాలే వేరులే' అనే టైటిల్‌తో వస్తున్న ఈ షోలో రోజా, జానీ మాస్టర్ రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు. అందులో ఆది, శ్రీను, రాం ప్రసాద్, సుధీర్, విష్ణు ప్రియ, వర్షిణి, భాను సహా ఎంతో మంది ఉన్నారు.
హైపర్ ఆదికి షాకిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్
ఇక, ఇదే షోకు సంబంధించిన ప్రోమోలను యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా వచ్చిన ప్రోమోలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ జాఫర్ బాబు.. చేసిన ఇంటర్వ్యూలో ‘మీరు ***పై బాడీ షేమింగ్ చేశారు.. మీకు సిగ్గుందా' అని ప్రశ్నించాడు. దీంతో ఆది సహా అందరూ షాక్ అయిపోయారు.

రోజాను కూడా వదిలి పెట్టలేదు
ఇదే ప్రోగ్రాంలో జాఫర్.. రోజాను కూడా వదిలి పెట్టలేదు. ఆమెను కూడా ఓ ఊహించని ప్రశ్న అడిగాడు. ‘మీరు టీవీ షోలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, ప్రజాసేవకు తక్కువ సమయం కేటాయిస్తున్నారని బయట అనుకుంటున్నారు. ఇది నిజమేనా' అని జాఫర్ ప్రశ్నించాడు. దీంతో రోజా ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు. ఈ ప్రోమో కూడా వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











