బిగ్ బాస్ బయటకొచ్చిన జాఫర్.. రియాలిటీ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు
గడిచిన రెండు వారాల్లో హౌస్‌లో ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి వారంలో హేమ ఎలిమినేట్ కాగా రెండో వారంలో జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి ఆయన స్థానంలో వితికా షేరు వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ, దీనికి భిన్నంగా జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన జాఫర్ ఈ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు జాఫర్. బిగ్ బాస్ రియాలిటీ షో అనేది అబద్దమని, ఇదంతా ముందస్తుగా అనుకున్న స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోందని చాలా మంది భావిస్తుంటారని.. అయితే అందులో వాస్తవం లేదని జాఫర్ తేల్చి చెప్పాడు. తాను ప్రత్యక్షంగా బిగ్ బాస్ హౌస్‌లో ఉండి అన్నీ చూసినవాడిని కాబట్టి చెబుతున్నా.. బిగ్ బాస్ నిజంగా ఓ రియాలిటీ షోనే అని అన్నాడు. హౌస్ కంటెస్టెంట్స్ కొట్టుకోవడం, మళ్లీ కొద్దిసేపటికి కలిసిపోవడం అంతా కూడా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది, షోకి హైప్ తీసుకురావడానికి ఇదంతా అని భావిస్తుంటారు కానీ.. అదంతా నిజమే అని జాఫర్ తెలిపాడు.

మరోవైపు తొలి వారం ఎలిమినేట్ అయిన హేమ.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ, మరోవైపు గాయత్రి గుప్తా, శ్వేతా రెడ్డి లాంటి వారు పలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నా బిగ్ బాస్ 3 సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.


Click it and Unblock the Notifications











