twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంటతడి పెట్టిన శ్రీముఖి, బాబా భాస్కర్.. ఎలిమినేట్ అవుతూ జాఫర్ ఏం చేశాడంటే..

    |

    Recommended Video

    Bigg Boss Telugu Season 3 : Episode 15,Day 14 Highlights || Filmibeat Telugu

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో రెండో ఎలిమినేషన్ అత్యంత భావోద్వేగాల మధ్య సాగిపోయింది. ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూనే షోను హ్యాపీగా నిర్వహించారు హోస్ట్ నాగార్జున. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా సెలబ్రిటీలను ఉత్సాహంలో ముంచేశారు నాగ్. ఇంటిలోకి ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్, హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రవేశించి షాకిచ్చారు. ఈ సంతోషాల మధ్య జాఫర్ బయటకు వెళ్లపోవడం ఇంటి సభ్యులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే..

    ఫ్రెండ్ షిప్ డే రోజున ఫ్యాన్సీ లుక్‌తో నాగ్

    ఫ్రెండ్ షిప్ డే రోజున ఫ్యాన్సీ లుక్‌తో నాగ్

    ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా నాగ్ ఫ్యాన్సీ లుక్‌తో బిగ్‌బాస్ స్టేజ్‌పైకి వచ్చారు. ఇంటి సభ్యులకు హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే చెప్పి అందర్ని సంతోషంలో ముంచెత్తారు. ఇంటి సభ్యుల్లో ఒకరితో మరొరకరికి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టించారు. తమకు నచ్చిన వారికి బ్యాండ్ కట్టి ఎందుకు నచ్చారో కారణం చెప్పారు. బాబా భాస్కర్ అందరి మనసులను ఆకట్టుకొన్నారు.

    పునర్నవి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అంటూ

    పునర్నవి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అంటూ

    ఇక ఫ్రెండ్ షిప్ డే సెలబ్రేషన్ కొనసాగిస్తూనే నాగార్జున మిగిలిన నలుగురు ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించారు. పునర్నవి, వరుణ్, వితిక, జాఫర్‌ మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. అందులో నుంచి పునర్నవి భూపాళంను సేఫ్ చేశారు. దాంతో పునర్నవి హ్యాపీగా ఫీలైంది. వెంటనే ఒటర్లకు థ్యాంక్స్ చెప్పింది.

    ఇంటిలోకి ఇస్మార్ట్ శంకర్ రామ్

    ఇంటిలోకి ఇస్మార్ట్ శంకర్ రామ్

    ఇక ఇంటిలోకి ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్, హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రవేశించారు. రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన రామ్ తన అనుభూతిని పంచుకొన్నారు. శ్రీముఖిని అక్క అంటూ రామ్ పలకరించగా, అన్న అంటూ శ్రీముఖి హాయ్ చెప్పింది. వీరిద్దరు నేను శైలజ చిత్రంలో కలిసి నటించింది. వేదికపైనే చిలుక చిలుక అంటూ నాగార్జునతో కలిసి రామ్, నిధి డ్యాన్సులు చేశారు. వారితోపాటు ఇంటి సభ్యులు జోష్‌లో స్టెప్పులు వేశారు.

    మూవీ టైటిల్స్‌తో గేమ్

    మూవీ టైటిల్స్‌తో గేమ్

    హీరో రామ్, హీరోయిన్‌ నిధితోపాటు నాగ్ ఓ కొత్త గేమ్ ఆడారు. ఇంటి సభ్యులకు సూట్ అయ్యే సినిమా టైటిల్స్‌ బ్యాడ్జిల రూపంలో ఇచ్చి వారికి ఇవ్వమని ఒక్కొక్కరికి ఇచ్చారు. శ్రీముఖి, తమన్నాకు రెండు టైటిల్స్ వచ్చాయి. పోకిరి, దేశముదురు టైటిల్స్‌ను శ్రీముఖి సొంతం చేసుకొన్నది. కంత్రి తమన్నాకు వచ్చింది. బాబా భాస్కర్ రొబో టైటిల్‌ను సొంతం చేసుకొన్నారు.

    వరుణ్ సందేశ్ సేఫ్ ఇలా

    వరుణ్ సందేశ్ సేఫ్ ఇలా

    ఇలా ఆటపాటలతో సరదాగా సాగిపోయిన బిగ్‌బాస్ ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. వితిక, వరుణ్, జాఫర్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. వరుణ్‌ను సేఫ్ అంటూ రామ్ ప్రకటించడంతో ఎలిమినేషన్‌ బరిలో వితిక, జాఫర్ నిలిచారు. చివర్లో జాఫర్ ఎలిమినేట్ అయ్యారని నాగార్జున ప్రకటించడంతో వితిక సేఫ్ అయ్యారు. వెంటనే ఇంటి సభ్యులతో సెల్ఫీ దిగి బయటకు వచ్చారు.

    ఎలిమినేట్ అవుతూ కంటతడి పెట్టించిన జాఫర్

    ఎలిమినేట్ అవుతూ కంటతడి పెట్టించిన జాఫర్

    బిగ్‌బాస్ ఇంటిని వదిలే సమయంలో జాఫర్ చేసిన వ్యాఖ్య అందర్నీ కంటతడి పెట్టించింది. బాబా భాస్కర్‌ను ఎవరూ ఏమనకూడదు అంటూ అనడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత వేదిక మీద సభ్యులతో జాఫర్ ముఖాముఖి నిర్వహించారు. బిగ్‌బాంబు లేదని చెప్పడంతో ఇంటి సభ్యులు ఊపిరి పీల్చుకొన్నారు. అనంతరం రెండు వారాల జర్నీని చూపించారు. అలా నాగార్జునతో సెల్ఫీ దిగడంతో బిగ్‌బాస్‌లో జాఫర్ జర్నీ ముగిసింది.

    English summary
    Bigg Boss 3 season started with Nagarjuna as host. On day one, Shock for Sreemukhi, Baba Bhaskar. These along with some other celebraties nominated for elimination. Hema out from the bigg boss show, This week Jaffar Babu goes out from the Show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X