Jai Ganesha: కుష్బూని ఢీకొట్టేందుకు ఇంద్రజ రెడీ.. జై గణేషా ట్రెండింగ్!
సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్లకు సెంటిమెంట్ భారీగానే ఉంటుంది. ఫలానా హీరో, హీరోయిన్లు ఉంటే వర్కవుట్ అవుతుంది. లేదా ఫలానా జోడి ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తుంటారు అనే ఈక్వెషన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు సినిమాలకు ఏ మాత్రం తగ్గని క్రేజ్ ఉన్న టెలివిజన్ రియాలిటీ షోలకు కూడా కాంబినేషన్లు సెట్ చేస్తున్నారు. అలాంటి కాంబినేషన్‌తో ప్రముఖ టెలివిజన్ ఈ టీవీ రావడం బుల్లితెర ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
దక్షిణాదిలో కుష్బూ, తెలుగులో ఇంద్రజ టాప్ హీరోలతో హీరోయిన్స్ నటించి మెప్పించారు. గ్లామర్ పాత్రలు, ఎమోషనల్ క్యారెక్టర్లతో తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం టెలివిజన్ షోలోకు కూడా భారీ డిమాండ్ ఏర్పడటంతో అటు సినిమాలు, రియాలిటీ షోలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

సీనియర్ నటి కుష్బూ జబర్దస్త్ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తుంటే.. ఇంద్రజ శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర మీద తమ రోల్స్‌తో విశేషంగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకొన్నారు. ఇలాంటి సీనియర్ యాక్టర్లను ఇద్దరిని కలిపి ఒకే వేదిక మీదకు ఈటీవీ తీసుకొచ్చే ప్లాన్ చేసింది.
వినాయక చవితి సందర్భంగా స్పెషల్‌గా డిజైన్ చేసిన ఈవెంట్‌లో ఇంద్రజ, కుష్బూను కలిపి షోను జనరంజకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. జై గణేశా అంటూ రూపొందించిన ఈ షో ఆగస్టు 7వ తేదీ అంటే శనివారం ఉదయం 9 గంటలకు ప్రసారం కానున్నది. ఈ షోలో ఇంకా కొందమంది టీవీ ఆర్టిస్టులు, సెలబ్రిటీలు పాల్గొంటారు.
ఇంకా విశేషం ఏమిటంటే.. హీరో, బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ శివాజీ కూడా ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ షోకు రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోమోలు యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











