బిగ్ బాస్ 2: ఇద్దరు మగాళ్లని ఏసుకుని హీరోయిన్ అనుకుంటోంది.. షాకింగ్ సర్ప్రైజ్, ఆ ఇద్దరు నటులు!
నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షో కొనసాగుతోంది. ఈ షోపై కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆకట్టుకునే విధంగానే కంటెస్టెంట్స్ పెర్ఫామ్ చేస్తున్నారు. అప్పుడే బిగ్ బాస్ 2 లో ఓ ఎలిమినేషన్ కూడా పూర్తయిపోయింది. షోని ఇంకా రసవత్తరంగా మార్చేందుకు బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ మా విడుదల చేసిన ప్రోమోని బట్టి గురువారం బిగ్ బాస్ 2 మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తేజస్వి, గీతామాధురి మధ్య వివాదం
తేజస్వి, గీతామాధురి మధ్య నేడు ఏదో వివాదం చోటుచేసుకోబోతోంది. ప్రోమోలో వీరిద్దరూ వాగ్వాదం చేసుకుంటూ కనిపించారు. కౌశల్ అనే టాపిక్ నీతో ఎందుకు తీసుకుని వస్తాను అని తేజస్వి గీత మాధురి తో అంటోంది.
Recommended Video


హీరోయిన్ అనుకుంటోంది
మరో కంటెస్టెంట్ భాను చేసిన సంచలన కామెంట్ కూడా ప్రోమోలో చూపించారు. భాను ఎవరినో తిడుతూ.. ఆమెకు ఆమె హీరోయిన్ అనుకుంటోంది ఇద్దరు మగాళ్లని ఏసుకుని అనే ఘాటైన వ్యాఖ్య చేసింది.

హౌస్‌లో సర్ప్రైజ్
బిగ్ బాస్ హౌస్ లో నేడు మరో విశేషం కూడా చోటు చేసుకోబోతోంది. జంబలకడి పంబ టీం హౌస్ లోకి ఎంటర్ కాబోతోంది. దానికి సంబందించిన ప్రోమో కూడా విడుదల చేసారు.

ఒక్కసారి బిగ్ బాస్‌ని
నటుడు శ్రీనివాస్ రెడ్డి, కమెడియన్ వెన్నెల కిషోర్ హౌస్ లోకి సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఒక్కసారి బిగ్ బాస్ ని బాగా దగ్గరినుంచి చూడాలని ఉంది అని శ్రీనివాస్ రెడ్డి జంబలకడి పంబ స్టైల్ లో ఫన్నీగా డైలాగ్ చెబుతున్నాడు.


Click it and Unblock the Notifications











