Amardeep : నీచాతి నీచం, మిమ్మల్ని అంత ఈజీగా వదలను, పుచ్చ పగిలిపోద్ది జాగ్రత్త అంటూ వార్నింగ్!

సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయాక ఏ వార్త నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతోంది. నిజం నోరు దాటాక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందనే చందాన కొంత మంది సినీ సెలబ్రిటీలను బతికుండగానే చంపేస్తున్నారు సోషల్ మీడియా వీరులు. తాజాగా జానకి కలగనలేదు సీరియల్ లో హీరోగా నటిస్తున్న అమర్దీప్ చౌదరి చనిపోయాడంటూ ఒక యూట్యూబ్ ఛానల్ వీడియోలు పెట్టడం సంచలనం రేపింది. ఇదే ఈ విషయమై ఇప్పటికే అషు రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా స్పందించగా తాజాగా హీరో అమర్ దీప్ చౌదరి వార్నింగ్ ఇచ్చాడు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

వాళ్ళంతా చనిపోయరంటూ

వాళ్ళంతా చనిపోయరంటూ

ఈ మధ్య సినిమా హీరోలు హీరోయిన్ల లాగానే బుల్లితెరలో నటిస్తున్న హీరో హీరోయిన్లు కూడా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. వాళ్ల క్రేజ్ చూసి ఆ క్రేజ్ను వాడుకోవడానికి కొన్ని ఊరూపేరూ లేని యూట్యూబ్ ఛానల్స్ సిద్ధమవుతున్నాయి.. తాజాగా మిధున టాకీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ముఖ్యంగా బుల్లితెర సెలబ్రిటీల ని టార్గెట్ చేసుకుని కొద్ది రోజుల క్రితం అర్జున్ అంబటి తర్వాత మహేశ్వరి చనిపోయినట్టు వీడియోలు పెట్టింది.

అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా

అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా

ఆ తర్వాత వారు స్పందిస్తూ అదేమీ లేదని ఛానల్ రిపోర్ట్ చేయాలని కూడా కోరారు. అయితే ఇప్పుడు అదే ఛానల్ జానకి కలగనలేదు సీరియల్ హీరో గా ఉన్న అమర్ దీప్ చౌదరి చనిపోయాడంటూ ప్రచారం మొదలు పెట్టింది. అయితే ఈ విషయం మీద ముందుగా అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తమ మిత్రులు, ఫాలోవర్స్ ఈ ఛానల్ ని రిపోర్ట్ చేయాలని కోరుతూ ఆ చానల్ పెట్టిన లింక్ ను కూడా ఆమె షేర్ చేసింది.

పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను

పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను

అయితే తాజాగా ఇదే విషయం మీద అమర్దీప్ చౌదరి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. యూట్యూబ్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి చాలా మంది తనకు ఫోన్లు కూడా చేశారని అయితే తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అనే విషయాన్ని చెబుతూ ఈ ఫేక్ న్యూస్ ని ప్రసారం చేస్తున్న సదరు ఛానల్ మీద అమర్దీప్ ఫైర్ అయ్యారు.

నేను ఇంకా బతికే ఉన్నా

నేను ఇంకా బతికే ఉన్నా

అసలు మిధున టాకీస్ యూట్యూబ్ ఛానల్ లో వస్తున్న ఫేక్ వీడియో ని ఇప్పుడే చూశాను, అయితే నేను ఇంకా బతికే ఉన్నాను ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నాను హ్యాపీగా షూటింగులు చేసుకుంటున్నా సినిమాల్లో కూడా చేస్తున్నా అయితే నేను చనిపోయానని పోస్టులు ఎందుకు పెట్టారో నాకు తెలియదు అది చూసి చాలా మంది నాకు ఫోన్ చేసి కంగారు పడ్డారు నిజానికి షూటింగ్ ఉండడం వల్ల నాకు ఏం జరుగుతుందో కూడా తెలియదు అని అమర్ దీప్ చెప్పుకొచ్చాడు.

అంత ఈజీగా వదలను

అంత ఈజీగా వదలను

అంతే కాక అమర్దీప్ మాట్లాడుతూ ఒక మనిషి చనిపోయాడు అని చెప్పడం నీచమని, నీచాతి నీచం అని అన్నాడు నేను మిమ్మల్ని అంత ఈజీగా వదలను సాధారణంగా నేను ఎవరిని కెలకను కానీ మీరు నన్ను కెలికారు కదా, మిధున ఛానల్ ఎనన్ను దుర్కోవడానికి రెడీగా ఉండాలి ఇలాంటి తప్పుడు వార్తలు మళ్ళీ పెడితే పుచ్చ పగిలిపోద్ది జాగ్రత్త అంటూ అమర్ దీప్ చౌదరి వార్నింగ్ ఇచ్చాడు.

Recommended Video

Pragya Jaiswal Most Glamorous Show Ever || Filmibeat Telugu
సినిమాలు సీరియల్స్ తో బిజీ బిజీ

సినిమాలు సీరియల్స్ తో బిజీ బిజీ

జానకి కలగనలేదు సీరియల్ లో రామ చంద్ర పాత్రలో నటిస్తున్న అమర్దీప్ చౌదరి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ సీరియల్ కంటే ముందు అమర్దీప్ ఉయ్యాల జంపాల, సిరిసిరిమువ్వలు వంటి సీరియల్స్ తో పాటు కొన్ని వెబ్ సిరీస్ లో అలాగే నాని హీరోగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం, శైలజ రెడ్డి అల్లుడు వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించారు.

ఇక ఆయన అరియానా గ్లోరీతో ఎక్కువగా కనిపిస్తూ ఉండటం వల్ల వాళ్ళిద్దరి మధ్యా ఏదో ఉందనే ప్రచారం కూడా జరుగుతూ వస్తోంది. నిన్న అరియానా కారు కొన్న సమయంలో కూడా అమర్ దీప్ ఆమె పక్కనే ఉండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X