Janaki Kalaganaledu ఫేమ్ అమర్‌దీప్‌ నిశ్చితార్థం.. అందమైన నటితో రామగారు సూపర్బ్, మధ్యలో జానకి!

కొంతమంది సీరియల్ నటులు ఇటీవల కాలంలో ప్రేక్షకుల్లో మంచి ఆదరణను పెంచుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ కావడంతో వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా చాలా ఈజీగా తెలుసుకుంటున్నారు. అయితే జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మంచి గుర్తింపును అందుకుంటున్న నటుడు అమర్‌దీప్‌ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరెవరో కాదు. ఆమె కూడా ఇంతకుముందు కొన్ని తెలుగు సీరియల్స్ తో మంచి క్రేజ్ అందుకుంది. ఇక వారికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

జానకి కలగనలేదు సీరియల్

జానకి కలగనలేదు సీరియల్

జానకి కలగనలేదు సీరియల్ లో రామచంద్ర అనే పాత్రతో అమాయకమైన చూపులతో ఎంతగానో కట్టుకున్న అమర్‌దీప్‌ సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. జానకికి భర్తగా అతను కనిపిస్తున్న విధానం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చాలా సింపుల్ గా ఫ్యామిలీ మ్యాన్ కనిపించే అమర్‌దీప్‌ బాహ్య ప్రపంచంలో మాత్రం చాలా స్టైలిష్ గానే ఉంటాడు.

నటితో నిశ్చితార్థం

నటితో నిశ్చితార్థం

అతను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్గా అతను నిశ్చితార్థ వేడుకలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత కొంతకాలంగా ఒక ప్రముఖ సీరియల్ నటితో ప్రేమలో ఉన్న అమర్‌దీప్‌ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అసలైతే ఈ ఏడాది మొదట్లోనే వారి పెళ్లి జరిగేదట. కాకపోతే కొన్ని కుటుంబాల కారణాల వలన ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కొయిలమ్మతో క్రేజ్

కొయిలమ్మతో క్రేజ్

అమర్‌దీప్‌ ప్రేమలో ఉన్నది మరెవరితోనో కాదు. కోయిలమ్మ అనే సీరియల్ తో అందరిని ఎంతగానో ఆకట్టుకున్న తేజస్విని గౌడ. ఇక ఆమె గత కొంతకాలంగా అమర్‌దీప్‌ ప్రేమలో ఉందట. ఇక ఇప్పుడు మొత్తంగా వీరు పెళ్లి చేసుకోవడానికి మరొక అడుగు ముందుకు వేశారు. తెలుగు తమిళం కన్నడ భాషల్లో బుల్లితెరపై మంచి గుర్తింపు అందుకున్న తేజస్విని కూడా ఇప్పుడు తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మధ్యలో జానకి

మధ్యలో జానకి

అసలు అమర్‌దీప్‌ ఆమెతో ప్రేమలో ఉన్నట్లు చాలామందికి తెలియదు. కేవలం వారి సన్నిహితుల కు మాత్రమే ఈ విషయం తెలుసట. ఇక హఠాత్తుగా అమర్‌దీప్‌ తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలతో సోషల్ మీడియాలో హడావిడిగా కనిపించాడు. ఇక వీరు ఎంగేజ్మెంట్ వేడుకలో జానకి కలగనలేదు సీరియల్ లో లీడ్ రోల్ లో నటిస్తున్న ప్రియాంక జైన్ కూడా వారితో కలిసి ఫోటోలు దిగింది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సినిమాల్లో కూడా

సినిమాల్లో కూడా

ఇక అమర్‌దీప్‌ విషయానికి వస్తే అతను 2016 నుంచి ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో గుర్తింపునందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అతను రాజధాని స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ అందుకున్నాడు. అనంతరం శైలజా రెడ్డి, అల్లుడు, కృష్ణార్జున యుద్ధం, సారథి వంటి సినిమాల్లో కూడా కనిపించాడు. ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ నటుడు ప్రయత్నాలు చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X