Bigg Boss 7: ఈసారి మరో బుల్లితెర హీరోకు ఛాన్స్.. బిగ్ బాస్ ఎంట్రీపై అతను ఏమన్నాడంటే..
బుల్లి తెర రియాల్టీ షో బిగ్ బాస్.. గత ఆరు సీజన్లుగా టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న షో. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో.. 7 సీజన్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బిగ్ బాస్-7లో వాళ్లొస్తారు, వీళ్లు కనిపిస్తారు అంటూ పలువురు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సీరియల్ యాక్టర్ పేరు కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

మరింత కొత్తగా 7వ సీజన్
బిగ్ బాస్ మొదట నాలుగు సీజన్స్ కు భారీ స్థాయిలో క్రేజ్ అయితే వచ్చింది. అలాగే 5వ సీజన్ ఇంకా నాన్ స్టాప్ షో కూడా పరవాలేదు అనిపించింది. కానీ 6వ సీజన్ మాత్రం డిజాస్టర్ రేటింగ్స్ అందుకుంది. ఇక నాగార్జున కూడా హోస్ట్ గా చేయడానికి ఆసక్తి చూపడం లేదని ఒక టాక్ అయితే వస్తోంది. అయినప్పటికీ నిర్వాహకులు 7వ సీజన్ ను మరింత కొత్తగా కొత్త హీరోను హోస్ట్ గా చేసి స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆ సెలబ్రెటీల పేర్లు
ఇక 7వ సీజన్ కోసం ఇప్పటికే రాబోయే కొంతమంది సెలబ్రిటీల పేర్లు ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది. బుల్లి తెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్, కమెడియన్ కమ్ యాంకర్ సుడిగాలి సుధీర్ తో పాటు మరికొంత మంది సెలబ్రిటీలు ఈసారి బిగ్ బాస్ లో సందడి చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. కొన్ని సీజన్ల నుండి బిగ్ బాస్ లో జబర్దస్త్ కమెడియన్లు కనిపిస్తూ వస్తున్నారు. అలాగే 7వ సీజన్ లో హైపర్ ఆది కూడా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.

యాంకర్ పేరు వైరల్
వీరితో పాటు యాంకర్ ప్రదీప్ పేరు కూడా వినిపిస్తోంది. కమెడియన్లు, యాంకర్లతో పాటు పలువురు సీరియల్ నటులు కూడా బిగ్ బాస్ 7 లో కనిపిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో బుల్లితెర హీరో సైతం బిగ్ బాస్-7లో ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది.

ఈసారి సీరియల్ హీరో
'జానకి కలగనలేదు' సీరియల్ హీరో అమర్ దీప్ బిగ్ బాస్-7 సీజన్ లో కంటెస్టెంట్ గా కనిపించనున్నాడు అని తాజాగా వార్తలు వస్తున్నాయి. అమర్ దీప్ సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా.. టీవీ సీరియళ్లు ఫాలో అయ్యేవారికి అమర్ దీప్ చౌదరి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిన్నపాటి హీరోకు ఉండే ఫాలోయింగ్ ఉంది తనకు. 'జానకి కలగనలేదు' సీరియల్ తో టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు అమర్ దీప్.

క్లారిటీ ఇచ్చిన అమర్ దీప్
ఈ వార్తలపై స్పందించిన అమర్ దీప్.. తాను ప్రస్తుతం ఓ సీరియల్ చేస్తున్నానని బిగ్ బాస్ కు పంపించడం, పంపించకపోవడం పూర్తిగా తమ ఛానల్ ఇష్టమని చెప్పుకొచ్చాడు అమర్ దీప్. వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆ టైమ్ కు ఏమవుతుందో ఇప్పుడే చెప్పలేం అంటూ అమర్ దీప్ అన్నాడు. అమర్ దీప్ తో పాటు తన భార్య తేజస్విని గౌడ కూడా బిగ్ బాస్ లో కనిపిస్తుందని వార్తలు వస్తున్నా.. వాటిని అమర్ దీప్ కొట్టిపడేశాడు.


Click it and Unblock the Notifications











