Bigg Boss Telugu 7 జానకి కలకు బిగ్‌బాస్ ఫిదా.. బిగ్‌బాస్ తెలుగు 7లోకి ప్రియాంక జైన్ ఎలా అడుగుపెట్టిందంటే?
తెలుగు, కన్నడ సీరియల్స్ చూసే బుల్లితెర అభిమానులకు ప్రియాంక జైన్ పేరు చెబితే గుర్తు పట్టడం అంత కష్టం కాదు. మహారాష్ట్రకు చెందిన ప్రియాంక జైన్ మోడల్‌గా రాణిస్తూ వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అటు కన్నడలోను, ఇటు తెలుగు టెలివిజన్ రంగంలో ప్రియాంక జైన్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే తెలుగు టెలివిజన్ రంగంలో విశేషంగా పాపులారిటీ సంపాదించుకొన్న ఈ ముద్దుగుమ్మ పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నది. అందుకు కారణం ఈ అమ్మాయి తెలుగు బిగ్‌బాస్ 7 సీజన్‌లోకి అడుగుపెడుతున్నారనే వార్త. ఈ క్రమంలో ప్రియాంక జైన్ ఎవరు? ఆమె పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తూ...
ప్రియాంక జైన్ వ్యక్తిగత వివరాల్లోకి వెళితే.. జైన్ కుటుంబానికి చెందిన ఆమె 1998లో జూలై 2వ తేదీన జన్మించారు. ఆమె బెంగళూరులోని ఎన్‌కేఎస్ ఇంగ్లీష్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం కొనసాగించారు. జైన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత బర్జర్ పెయింట్స్, పిజా లాంటి సంస్థల ప్రొడక్ట్స్‌కు ఆమె మోడలింగ్ చేశారు. మోడలింగ్ చేస్తుండగానే.. ఆమె సినిమా, టెలివిజన్ రంగాల్లో అవకాశాలు వెతుక్కొంటూ వచ్చాయి.

ప్రియాంక జైన్ ప్రొఫెషనల్ విషయానికి వస్తే.. 2015లో రంగీ తరంగా అనే తమిళ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2016లో గోలిసోడా సినిమా ద్వారా కన్నడ చిత్రంలో నటించారు. ఆ తర్వాత 2018లో చెల్తే చెల్తే అనే సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఎవడు తక్కువ కాదు.. వినర సోదరా వీర కుమారా లాంటి సినిమాల్లో కూడా నటించారు. అయితే సినిమా రంగం నుంచి టెలివిజన్ కెరీర్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె గ్రాఫ్, పాపులారిటీ మరింత పెరిగింది.
ప్రియాంక జైన్ 2017లో స్టార్ మా రూపొందించిన మౌనరాగం సిరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అమ్ములు పాత్ర ద్వారా మంచి పాపులారిటి సొంతం చేసుకొన్నారు. ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. యూ గాట్ మీ గర్ల, శారదీ ఆర్య నే నిన్ సతి, సితార, సోచ్ లాంటి వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్‌లో నటించింది. తాజాగా నీతోనే డ్యాన్స్ సోలో మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.
అందం, అభినయంతోనే కాకుండా డ్యాన్స్‌లతో ఆలరించే ప్రియాంక జైన్ బిగ్‌బాస్ మనసు దోచుకొన్నారు. దాంతో ఆమెకు బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో పాల్గొనే ఆఫర్ లభించింది. సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభమయ్యే బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర కాబోతున్నారు.మొదటి
కంటెస్టెంట్‌గా ప్రియాంక జైన్
బిగ్‌బాస్ ఇంటిలోకి ఫస్ట్ కంటెస్టెంట్‌గా జానకి కలగనలేదు సీరియల్ యాక్టర్ ప్రియాంక జైన్ అడుగుపెట్టింది. నాగార్జున ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఆమెతో కుశల ప్రశ్నలు వేసి ఆమెను ఇంటిలోకి సాగనంపారు. వేదికపై నాగార్జునతో ఫన్నీగా మాట్లాడింది. ప్రియుడు శివ కుమార్ ముద్దుగా వరి అని పిలుస్తారని ఆమె చెప్పింది. ఇంటిలోకి వెళ్లిన తర్వాత నా కల నెరవేరింది. బయట వేడిగా ఉంది. స్విమ్మింగ్ ఫూల్‌లో దూకేయాలని ఉంది. ఇళ్లంతా కలియ దిరుగుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ఆరంభంలోనే సూట్‌కేస్‌తో గేమ్
బిగ్‌బాస్ తెలుగు 7 అంతా కొత్తగా ఉంటుందని చెప్పినట్టే.. డిఫరెంట్‌గా షోను ప్రారంభించారు. ఇంటిలోకి హోలో గ్రామ్ ద్వారా నాగార్జున ఇంటిలోకి అడుగుపెట్టాడు. ప్రియాంక జైన్‌ను కలిసేందుకు ఇంటిలోకి వెళ్లాడు. ప్రియాంక ముందు సూట్ కేస్ పెట్టి.. సాధారణంగా లాస్ట్‌లో ఇస్తారు. కానీ ఈ షోలో మొదటి రోజే వచ్చింది. ఈ సూట్‌కేస్‌ను దాచి పెట్టాలి. అది వేరే వాళ్లకు దక్కకుండా చూస్తే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని నాగ్ చెప్పగానే ప్రియాంక జైన్ సూట్ కేసు దాచి పెట్టింది.


Click it and Unblock the Notifications











