For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 1st Episode: జానకి అసలు రహస్యం తెలుసుకున్న మల్లిక.. ఇది అసలైన ట్విస్ట్

  |

  జానకి కలగనలేదు సీరియల్ అసలు కథలోకి వచ్చిన అనంతరం సరికొత్త ట్విస్టులు క్రియేట్ అవుతున్నాయి. నటిమణులు వారి టాలెంట్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. రొటీన్ గా అత్త కోడళ్ల గొడవలు మాత్రమే కాకుండా వాటి మధ్యలో మంచి ప్రేమ కథలను కూడా హైలెట్ చేస్తున్నారు. జానకి, రామచంద్ర పాత్రలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మొదట్లో ఈ సీరియల్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ ఆ తరువాత మెల్లగా రేటింగ్స్ ను పెంచుకుంటూ టాప్ సీరియల్స్ కు పోటీగా నిలుస్తోంది.

  సీనియర్ హీరోయిన్ రాశి రీ ఎంట్రీ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ఆమె బుల్లితెర శివగామి రేంజ్ లో తన ప్రతిభను చూపిస్తోంది. ఇక మరోవైపు మల్లిక పాత్ర కుట్రలకు సీరియల్ లో సరికొత్త మలుపులు క్రియేట్ అవుతున్నాయి. జానకి కలగనలేదు యువతకు కూడా నచ్చే విధంగా అందమైన ప్రేమ సన్నివేశాలతో కొనసాగుతోంది. విభిన్నమైన ఎమోషన్స్ తో అత్త జ్ఞానాంబ పాత్రలో నటిస్తున్న రాశి సిరియల్ పై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 118వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  Avinash Engagement: అవినాష్ పెళ్లాడే అమ్మాయి ఎవరంటే.. పర్సనల్ ఫొటోల్లో ఎలా ఉందో చూడండి!

   మల్లిక చెడు బుద్ధి

  మల్లిక చెడు బుద్ధి

  రాఖీ పండుగ సందర్భంగా జ్ఞానాంబ కూతురు వెన్నెలతో తన అన్నయ్యలకు రాఖీ కట్టిస్తుంది. అయితే అప్పుడు రామచంద్ర తన చెల్లికి ఖరీదైన కానుకను కూడా ఇస్తాడు. వెన్నెల కూడా అన్నయ్య ప్రేమకు ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. ఇక విష్ణు వంతు వచ్చేసరికి అతని భార్య మల్లిక మరోసారి తన చెడు బుద్దిని చూపిస్తుంది. ఎక్కువగా డబ్బులు పెడితే మంచిది కాదు అని కేవలం 50 రూపాయలు మాత్రమే ఇవ్వాలి అని అంటుంది. అయినప్పటికీ వెన్నెల ఏ మాత్రం బాధ పడకుండా విష్ణు అన్నయ్య హ్యాపీగా ఉంటే చాలు అని అంటుంది.

  జానకిని ఎత్తి పొడిచిన మల్లిక

  జానకిని ఎత్తి పొడిచిన మల్లిక

  ఇక సమయం చూసుకొని అత్త దగ్గరకు వెళ్లిన మల్లిక తన తమ్ముడికి రాఖీ కట్టాలని అందుకే ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. అందుకు ఏ మాత్రం ఒప్పుకొని జ్ఞానాంభ నీకు అంత శ్రమ అవసరం లేదు. మీ తమ్ముడినే ఇక్కడికి రమ్మన్నాను అని చెబుతోంది. దీంతో మల్లిక మరోసారి అత్తని లోపలే తిట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో మల్లిక తమ్ముడు ఇంటికి రావడంతో ప్రేమతో రాఖీ కడుతుంది.

  ఆ సన్నివేశాన్ని చూసిన జానకి తన అన్నయ్యను గుర్తుచేసుకుని ఎమోషనల్ అవుతుంది. జానకి బాధపడటానికి చూసిన మల్లిక అదే అవకాశంగా చేసుకొని మరింత బాధ పెట్టాలని అనుకుంటుంది. నీకు రాఖీ కట్టే అదృష్టం లేదని భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో ఉంటుందని మరింత బాధకు గురిచేస్తుంది. అప్పుడే కలుగజేసుకొని రామచంద్ర జానకి అన్నయ్యకు రాఖీ పంపించిన విషయాన్ని గుర్తు చేస్తాడు.

  ఎన్ని గొడవలున్నా సంతోషంగా ఉండాలని

  ఎన్ని గొడవలున్నా సంతోషంగా ఉండాలని

  జానకి అన్నయ్య వదినలతో వీడియో కాల్ కూడా మాట్లాడించిన రామచంద్ర మరోసారి భార్యకు మరింత దగ్గరవుతాడు. దీంతో ఎంతగానో సంతోషించిన జానకి భర్తకు ముద్దు కూడా పెడుతుంది. అందుకు ఎంతగానో సంతోషించిన రామచంద్ర అది తన బాధ్యత అంటూ జానకి మరింత భరోసా ఇస్తాడు. మీకు ఇబ్బందికరమైన సమయంలోనే పెళ్లి చేయడం మీ అన్నయ తప్పే కావచ్చు. కానీ అన్న చెల్లెలి మధ్య ఎన్ని గొడవలున్నా సంతోషంగా ఉండాలని రామచంద్ర సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అంతే కాకుండా మీరు ఇద్దరు ఇక్కడ సంతోషంగా ఉంటేనే.. పైన ఉన్న మీ అమ్మ నాన్నలు కూడా సంతోషిస్తారని అంటాడు. అందుకు జానకి కూడా ఎంతగానో ఆనందపడుతుంది.

   అత్తకు జానకి సేవలు

  అత్తకు జానకి సేవలు

  ఇక మరోవైపు అత్తను ఎలాగైనా పోలీసులకు పట్టించాలని మల్లిక కుట్ర పన్నుతుంది. తనకు నరకం చూపిస్తున్నారు అని ఒక వీడియో సైతం చేయాలనుకుంటుంది. ఇక అప్పుడే విష్ణు వచ్చి మల్లికను డిస్టర్బ్ చేస్తాడు. తన భార్య టార్చర్ కూడా తట్టుకోలేక పోతున్నానని ఆ వీడియోలో కనిపించే విధంగా మాట్లాడతాడు.

  ఇక ఆ విషయం గురించి మల్లిక పట్టించుకోకుండా జానకి రామచంద్ర ఏం చేస్తున్నారు అని వారికి దగ్గరికి వెళుతుంది. ఇక తల్లి కాళ్లు నొక్కి సేవలు చేసే రామచంద్రను అడ్డుకున్న జానకి ఈరోజు నేను మా అత్తగారికి కాళ్లు పడతానని అంటుంది. ఎంత చెప్పినా కూడా ఏమాత్రం ఒప్పుకోదు. డైరెక్ట్ గా అత్త దగ్గరికి వెళ్లిన జానకి కాళ్లు నొక్కుతూ ఉంటుంది. మొదట రామచంద్ర అనుకున్నాను జ్ఞానంభ జానకి వైపు చూసి ఒక్క సారిగా ఉలిక్కి పడుతుంది. కోడళ్ళతో నాకు ఇలాంటి సేవలు చేసుకోవడం ఏ మాత్రం నచ్చదు అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది.

  సీక్రెట్ లాగే ప్రయత్నం

  సీక్రెట్ లాగే ప్రయత్నం

  అయినప్పటికీ జానకి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీరు నా తల్లి లాంటి వారు అంటూ సేవలు చేసుకోనివ్వండి అని అంటుంది. అందుకు గోవిందరాజులు కూడా ఎంతగానో సంతోషించి పెద్దకోడలు మంచి గుణవంతురాలు అంటూ సంబర పడుతుంటాడు. ఇక ఆ మాటలకు మరోసారి కుళ్ళుకున్న మల్లిక ఎలాగైనా వారి మధ్య లో చిచ్చు పెట్టాలని అనుకుంటుంది. వెంటనే జానకి రామచంద్ర ఉండే గదిలోకి వెళ్ళి తొంగి చూస్తుంది అయితే అక్కడ పుస్తకాలు, టేబుల్, లైట్ ఉండడం చూసి తనకు తెలియకుండా ఏదో జరుగుతోందని అనుకుంటుంది. గతంలో జానకి ఫోటో పేపర్లో పడటం కూడా మరోసారి ఆలోచిస్తుంది.

  Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
   అసలు నిజం తెలుస్తుందా?

  అసలు నిజం తెలుస్తుందా?

  దీని వెనుక ఏదో పెద్ద సీక్రెట్ ఉందని అనుకుంటుంది ఎలాగైనా దాన్ని బయటకు తీసి జానకిని ఇంటి నుంచి బయటకు పంపించాలని అనుకుంటుంది. వెంటనే పరిగెత్తుకుంటూ అత్త దగ్గరికి వస్తుంది. మీ కోడలు మీ అందరికీ తెలియకుండా ఏదో ఘనకార్యం చేయబోతోంది అంటూ సూటిపోటి మాటలతో చాడీలు చెబుతుంది. అయితే ఎవ్వరికీ కూడా కొంత సేపటి వరకూ ఏమీ అర్థం కాదు.

  జ్ఞానాంబ కూడా జానకి మొహం చూసి ఆశ్చర్యపోతుంది. కానీ మల్లిక మాత్రం చాలా గట్టిగా వాదిస్తూ ఉంటుంది. ఒకసారి జానకి రూమ్ లోకి వచ్చి చూస్తే తప్పకుండా ఆ విషయం మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది అని అంటుంది. మల్లిక దేని గురించి మాట్లాడుతోంది అని జానకి ఆలోచనలో పడుతుంది. ఇక వెంటనే పుస్తకాల విషయం గుర్తుకు వస్తుంది.

  గదిలో ఉన్న పుస్తకాలను అలానే ఉండటం చూసి ఉంటుందని పసిగడుతుంది. మరి మల్లిక అనుకున్నట్లుగానే జానకి చదువుకున్న విషయాన్ని బయట పెడుతుందో లేదో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 118
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X