Janaki Kalaganaledu June 15th: రామచంద్ర ఫైనల్స్ కు వెళ్లకుండా కన్నబాబు దారుణం.. షాక్ లో మల్లిక!

జానకి కలగనలేదు సీరియల్ ఎంతో ఆసక్తికరమైన కథాంశంతో ముందుకు సాగుతోంది. భార్యను ఐపీఎస్ చేయాలని ఒక వైపు భర్త కోరిక.. మరోవైపు స్వీట్ షాప్ లో ఉండే భర్తను అందరి కంటే గొప్ప వ్యక్తిగా నిలబెట్టాలని భార్య కోరిక.. ఇలా మంచి అంశాలతో సీరియల్ ఆసక్తికరంగా మారింది. ఇక అత్త నుంచి తొడి కోడలి నుంచి జానకి ఎదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉంటుంది. ఇక రామచంద్ర ఇంటర్నేషనల్ చెఫ్ పోటీలో ప్రైజ్ మనీ గెలవాలని కూడా అనుకుంటాడు. కానీ కన్నబాబు, రామచంద్ర అప్పు తీర్చే కంటే ముందే స్వీట్ షాప్ ను దక్కించుకునే విధంగా ప్రయత్నం చేసాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 323వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

సెమీఫైనల్ లో రామచంద్ర

సెమీఫైనల్ లో రామచంద్ర

రామచంద్ర వంటల పోటీల్లో గెలవాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. జానకి కూడా తన భర్త కోసం ప్రతి విషయంలో సహాయం గా ఉంటూ అతను ముందుకు వెళ్లేలా చేస్తుంది. ఏ మాత్రం భయపడకుండా బార్య అండ తో ముందుకు సాగుతూ ఉంటాడు. మొదటి సారి రామచంద్రకు తన తల్లి నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు అందుతూ ఉంటుంది. ఇక రామచంద్ర వంటల పోటీల్లో సెమీఫైనల్స్ వరకు రావడంతో అనుకోకుండా ఒక సమస్య కూడా అతనికి ఎదురవుతుంది.

 సునంద మోసం

సునంద మోసం

రామచంద్రను వంటల పోటీల్లో గెలవకుండా చేయాలనే సునంద దేవి ఆమె కొడుకు కన్నబాబు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వంట చెడగొట్టడానికి ఏదైనా చేయాలని కూడా ఆలోచిస్తారు. ఇక రామచంద్రకు ప్రత్యర్థిగా ఉన్న ఒక అమ్మాయి తో కలిసి వారు మోసం చేయాలని అనుకుంటారు. రామచంద్ర వంటలు చేసేటప్పుడు వాటిని పాడు చేయాలని అందుకోసం వెనిగర్ కలపాలిని డబ్బు కూడా ఇస్తారు. అయితే ఆ అమ్మాయి వెనిగర్ రామచంద్ర వంటలో కలపకుండా తన తన వంటలోనే కలుపుకొని అది రామచంద్ర చేశాడు అని అబద్ధం చెప్తుంది.

జానకి సలహాతో

జానకి సలహాతో

ఇక రామచంద్ర తప్పు చేశాడు అని న్యాయనిర్ణేతలు కూడా ఆలోచిస్తూ ఎలిమినేట్ చేసేందుకు నిర్ణయం కూడా తీసుకుంటారు. అయితే అప్పుడే జానకి కలుగజేసుకుని ఒక అమ్మాయి చెప్పిన మాటలను ఎలా సాక్షాలుగా తీసుకొని రామచంద్రను ఎలిమినేట్ చేస్తారు అని ప్రశ్నిస్తుంది. వెంటనే అక్కడ ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేయించాలి అని అప్పుడు ఎవరు తప్పుడు పని చేసారో తెలుస్తుంది అని సలహా ఇస్తుంది. దీంతో జానకి ఇచ్చిన సలహా కు మెచ్చుకొని అదేవిధంగా దోషిని పట్టుకోవాలని అనుకుంటారు. ఇక రామచంద్ర పై నిందలు వేసినా ఆ అమ్మాయి వెంటనే క్షమాపణలు చెప్పి తన తప్పును ఒప్పుకుంటుంది.

 సంతోషంలో రామ ఫ్యామిలీ

సంతోషంలో రామ ఫ్యామిలీ

రామచంద్ర ఎలాంటి తప్పు చేయలేదని తెలియడంతో అతన్ని వెంటనే ఫైనల్స్ ము సెలెక్ట్ చేస్తారు. ఇక తప్పు చేసిన అమ్మాయిని ఎలిమినేట్ చేస్తారు. మరోవైపు రామచంద్ర గెలిచాడు అని సునంద దేవి చాలా కోపం గా ఉంటుంది. ఇలాగే అతనిపై పగ తీర్చుకోవాలని కూడా అనుకుంటుంది. ఇక రామచంద్రను దెబ్బకొట్టేందుకు ఆమె కొడుకు కన్నబాబు కూడా ప్రణాళికలు రచిస్తూ ఉంటాడు. అయితే కన్నబాబు దగ్గర తీసుకున్న లక్ష రూపాయలు అప్పు గురించి ఎక్కడ తన తల్లిదండ్రులకు చెప్పేస్తాడో అని రామచంద్ర కూడా టెన్షన్ లో ఉంటాడు. అతను అప్పు తీర్చ కుండా ఉండాలి కన్నబాబు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రామచంద్ర తండ్రి గోవిందరాజుల మాత్రం మా కొడుకు తప్పకుండా ఈ పోటీలో భారీ బహుమతిని గెలుస్తాడు అని సంతోషంగా ఉంటారు

షాక్ లో మల్లిక

షాక్ లో మల్లిక

మరోవైపు మల్లికకు బుద్ధి చెప్పాలని విష్ణు ఆమె చేత మోకాళ్ళ మీద ప్రదీక్షణలు చేయిస్తాడు. జానకి భర్త ఒడిపోవాలని మల్లిక ఆ ప్రదీక్షణలు చేస్తూ ఉంటుంది. కానీ పైకి మాత్రం గెలవాలని అనుకుంటుంది. ఇక భార్య బుద్ధి గురించి పసిగట్టిన భర్త విష్ణు అన్నయ్య గెలిచాడు అని మల్లికకు ఝలక్ ఇస్తాడు. దీంతో మల్లిక షాక్ అవుతుంది.

టెన్షన్ లో రామచంద్ర

టెన్షన్ లో రామచంద్ర

రామ కుటుంబ సభ్యులు ఆనందాన్ని చూసి తట్టుకోలేక పోయిన కన్నబాబు ఊహించని దారుణానికి సిద్ధమవుతాడు. జానకి రామచంద్ర ఇద్దరూ కూడా ఒక గార్డెన్ లో నడుచుకుంటూ వెళుతూ ఉండగా జానకి మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. అయితే రామచంద్ర మాత్రం సైలెంట్ గా ఉంటూ కన్నబాబు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతని దగ్గర తీసుకున్న అప్పు గురించి ఏమవుతుందో అని ఆలోచనలు పడడంతో జానకి తన భర్తను టెన్షన్ పడకుండా చేయాలని అనుకుంటుంది.

 గాయపరచిన కన్నబాబు

గాయపరచిన కన్నబాబు

పక్కన కూర్చోబెట్టి ఎలాంటి టెన్షన్ పడకుండా రేపటి పోటీకి సిద్ధం కావాలి అని చెబుతుంది. అంతేకాకుండా ధ్యానం కూడా చేయాలి అని చెబుతుంది. అయితే ఒక దగ్గర కూర్చుని ధ్యానం చేస్తుండగా బిల్డింగ్ పై నుంచి కన్నబాబు ఒక కుండినీ రామచంద్రపై పడేలా చేస్తాడు. దీంతో రామచంద్ర భుజానికి గాయం అవుతుంది. అతను తను చేయని కదపలేని పరిస్థితుల్లో ఉంటాడు. మరి రామచంద్ర జరగబోయే ఫైనల్స్ కు సిద్ధమవుతాడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X