Janaki Kalaganaledu April 10th: మరోసారి రిస్కులో పడిన జానకి.. మర్డర్ కేసు కోసం ఊహించని నిర్ణయం!
జానకి కలగనలేదు సీరియల్ ట్విస్ట్ లతో ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 549 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
జ్ఞానాంబకు ఆహ్వానం: శ్రీరామనవమి సందర్భంగా ఊర్లో ఉండే గ్రామ పెద్ద సర్పంచ్ ప్రత్యేకంగా జ్ఞానాంబని ఇంటికి వచ్చి తప్పకుండా శ్రీరామనవమి ఉత్సవంలో పాల్గొనాలి అని కోరుతారు. అంతేకాకుండా మీరు జంటగా వచ్చి సీతారాముల కళ్యాణం జరిపించాలి అని అది అందరికీ బాగుంటుంది అని అంటారు. అయితే ఇంటికి పెద్ద కోడలు కొడుకు ఆ కార్యక్రమం చేస్తారని జ్ఞానాంబ పాటు ఆమె భర్త గోవిందరాజులు కూడా చెబుతారు. దీంతో అందుకు సర్పంచ్ కూడా ఒప్పుకోవడంతో రామచంద్ర సరే అని చెబుతాడు. అయితే అందరూ మాట్లాడే సమయంలో జానకి మాత్రం కొంత ఆలోచనలో పడుతుంది. జానకి మళ్ళీ గదిలోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది.

మర్డర్ కేసు విషయం: ఎందుకంటే శ్రీరామనవమి రోజు ఆమె బయటకు వెళ్లాల్సి ఉంటుంది ఎస్సై గారితో ఎలాగైనా మర్డర్ కేసు విషయం గురించి మాట్లాడాలి అని బాధితురాలికి న్యాయం చేయాలి అని జానకి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో అత్తగారు శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొనాలి అని చెప్పడం వలన జానకి ఇరకాటంలో పడుతుంది. అయితే తప్పనిసరిగా కేసు విషయంలో నేను పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి అని నేను అక్కడ ఉండాలి అని జానకి తన భర్తకు చెబుతుంది. దీంతో భర్త రామచంద్ర మాత్రం మొదట కొంత సందేహిస్తాడు. ఇదివరకే ఒకసారి మీరు అలా వెళ్లి సమయానికి రాకపోవడంతో అమ్మ చాలా అప్సెట్ అయింది. ఇక ఈసారి కూడా మళ్లీ అలా జరిగితే మరిన్ని సమస్యలు వస్తాయి అని రామచంద్ర చెబుతాడు.
కేసుని పక్కదారి పట్టించే అవకాశం: అయితే తాను మాత్రం బాధితురాలికి సహాయం చేయాలి అని లేకపోతే మా ఎస్ఐ గారు కేసుని పక్కదారి పట్టించే అవకాశం ఉంది అని జానకి అంటుంది. ఇక రామచంద్ర కూడా జానకి మాటలకు సరే అని ఒప్పుకుంటాడు కానీ వీలైనంత తొందరగా పూజ సమయానికి వచ్చేయాలి అని కూడా అతను మాట తీసుకుంటాడు. జానకి అందుకు ఒప్పుకుంటుంది. ఇక మరుసటి రోజు శ్రీరామనవమి సందర్భంగా అందరూ కూడా చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా గోవిందరాజులు జ్ఞానాంబ ద్వారా ఇద్దరు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని గుడికి వెళ్లి పూజ కార్యక్రమాలను చాలా బాగా జరిపించాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు.

గొడవ సృష్టించాలని మల్లిక ప్లాన్: అయితే అప్పుడే జానకిని జ్ఞానాంబ పిలవాలని అనుకుంటుంది. చిన్న కోడలు జెస్సికి చెప్పి వెళ్లి జానకిని పిలుచుకురా అని అంటుంది. ఇక జెస్సి వెళ్లి జానకిని పిలవాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర జానకి ఇంట్లో లేదు అని స్టేషన్ దగ్గర చిన్న పని ఉంటే చూసుకొని వస్తాను అని చెప్పింది అని జెస్సికి చెబుతాడు. కానీ అత్తగారు సీరియస్ అవుతారు అని నేను ఏదో ఒకటి చెప్పి ఇంట్లోనే ఉన్నారు అని అంటాను అని జెస్సి అంటుంది. అయితే వీరి మాటలు పక్కనే ఉన్న మల్లికా కూడా ఉంటుంది. ఇక వెంటనే ఆ విషయాన్ని అత్తగారికి చెప్పి ఇంట్లో గొడవ సృష్టించాలి అని జానకిని తిట్టించాలి అని మల్లికా అనుకుంటుంది. ఇక జెస్సి ఏదో ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నా సమయంలో అప్పుడే బాబు ఏడుస్తూ ఉంటాడు. దీంతో అతనికి పాలు పట్టించాలని అనుకుంటుంది.
రిస్క్ లో పడిన జానకి: ఇక మెల్లగా మల్లికా అత్తగారి దగ్గరికి వెళ్లి ఎలాగైనా విషయాన్ని చెప్పాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక సందర్భం రావడంతో జానకి ఇంట్లో లేదు అనే విషయాన్ని ఆమె చెబుతోంది. దీంతో అత్తగారు గోవిందరాజులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటారు. మల్లిక చెప్పిన మాటలు వాళ్లు మొదట నమ్మరు. జానకి ఉందా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళు లోపలికి వెళ్తారు. అయితే రామచంద్రను విషయం అడగడంతో చిన్న పని ఉంది అని పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. మళ్ళీ వెంటనే అరగంటలో తిరిగి వస్తానని చెప్పింది అని అతను అంటాడు. దీంతో జ్ఞానాంబ కొంత అప్సెట్ అవుతుంది. ఇక మరోవైపు జానకి మర్డర్ కేసు విషయంలో ఎస్సై మనోహర్ పై తీవ్ర స్థాయిలో టెన్షన్ పడుతూ ఉంటాడు. దీంతో అతను జానకిని ఈ కేసులో ఇన్వాల్వ్ లేకుండా చేయాలి అని నేరస్తులేని తప్పించుకునేలా చేయాలి అని అనుకుంటాడు. కానీ జానకి మాత్రం పట్టు విడవకుండా ఆ విషయాన్ని ఎలాగైనా ఉన్నతాధికారులతో చర్చించాలి అని అంటుంది. మరి ఈ కేసు విషయంలో జానకి వేసే అడుగులు ఏ విధంగా ఉంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











