Janaki Kalaganaledu April 11th: మనోహర్ ప్లాన్ వలన చిక్కుల్లో పడిన రామ.. టైమ్ చూసి కొట్టిన మల్లిక

జానకి కలగనలేదు సీరియల్ ఊహించని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 550 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

సీతారాముల కళ్యాణం కోసం:శ్రీరామనవమి సందర్భంగా జ్ఞానాంబ కుటుంబాన్ని గ్రామ పెద్దలు సర్పంచ్ ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. అయితే మీ చేతిలో మీదుగా సీతారాముల కళ్యాణం జరగాలి అని వాళ్ళు కోరుకోవడం తో అందుకు జ్ఞానాంబ కూడా ఒప్పుకుంటుంది మా పెద్ద కొడుకు పెద్ద కోడలు వచ్చి ఈ వేడుకను నిర్వహిస్తారు అని చెప్పడంతో అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే జానకి మాత్రం తన పోలీస్ డ్యూటీ కి సంబంధించిన కేసు విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా శ్రీరామనవమి రోజు ఆమె పోలీస్ స్టేషన్కు వెళుతుంది. భర్త ఎంత చెప్పినా కూడా నేను తప్పనిసరిగా ఈరోజు వెళ్లాలని ఒక బాధితురాలికి న్యాయం చేయాల్సి ఉంది అని జానకి చెప్పడంతో అందుకు రామచంద్ర ఒప్పుకుంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 April 11th Episode no 548

రివెంజ్ తీర్చుకోవడానికి..:ఇక చివరికి మల్లిక జానకి పై రివెంజ్ తీర్చుకోవడానికి ఇదే మంచి అవకాశం అని ఇంట్లో గొడవ సృష్టించాలని అనుకుంటుంది. ఇక వెళ్లి అత్తగారికి జానకి గురించి చెబుతుంది. ఆమె ఈరోజు శ్రీరామనవమి ఉన్నప్పటికీ కూడా మీ మాటలు లెక్కచేయకుండా ఎక్కడికో వెళ్ళింది అని మల్లికా చెబుతూ ఉంటుంది. ఇక అదే విషయాన్ని జ్ఞానాంబ వెళ్లి తన కొడుకు రామచంద్రను అడుగుతుంది. జానకి ఎక్కడికి వెళ్ళింది అని అడగడంతో పోలీస్ స్టేషన్లో ఏదో అర్జెంటు పని ఉండడం వలన వెళ్ళింది అని మళ్లీ వెంటనే తిరిగి వస్తానని చెప్పింది అన్నట్లుగా రామచంద్ర చెబుతాడు. అయితే నేను ఎంత చెప్పినా కూడా ఎందుకు జానకి పట్టించుకోలేదు అని ఆలోచిస్తుంది.

మల్లిక కఠినంగా..:ఇక మల్లిక కూడా సమయం చూసి జానకి పై నిందలు వేస్తూ ఉంటుంది. ఈ ఇంట్లో అందరికీ ఒక న్యాయం జానకికి మరొక న్యాయం అని మేము ఇంట్లో ఉన్నాము అని చూడకుండా కూడా జానకి పెద్ద కోడలు అనే అర్హత ఇచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని ఆమె మోసం చేస్తోంది అని మీ మాట అంటే అసలు లెక్కలేదు అని మల్లిక అంటుంది. ఇక జానకి విషయంలో మిగతా వాళ్ళు మాత్రం పాజిటివ్ గానే ఉంటారు. అర్జెంటుగా పని ఉంటే తప్ప బయటకు వెళ్ళదు అని చెబుతారు. అయితే జానకి విషయంలో జ్ఞానాంబ కూడా కొంత అసహనంతో మరొక నిర్ణయం తీసుకుంటుంది. ఎలాగు ఆమె రాదు కాబట్టి చిన్న కొడుకు చిన్న కోడలి చేత శ్రీరాములకళ్యాణం జరిపించాలి అని చెబుతుంది. ఇక రామచంద్ర మాత్రం జానకి విషయంలో ఆందోళన చెందుతూ ఉంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 April 11th Episode no 548

హాంతకుడిని తప్పించాలి అని..:అయితే మరోవైపు పోలీస్ స్టేషన్లో జానకి ఒక మర్డర్ కేస్ గురించి ఎస్సైతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే SI మనోహర్ మాత్రం హాంతకుడిని తప్పించాలి అని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ జానకి మాత్రం వెళ్లి మనం ఎస్పీ గారితో మాట్లాడదామని చెబుతూ ఉంటుంది. దీంతో ఎస్ఐ మనోహర్ జానకి దృష్టిని పక్కదారి పట్టించాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక ముందస్తు ప్లాన్ ప్రకారం ఒక కానిస్టేబుల్ ఒక దొంగను అక్కడికి తీసుకు వస్తాడు. అయితే అతన్ని ఎందుకు పట్టుకున్నావని ఎస్ఐ మనోహర్ అడుగగా మాదకద్రవ్యాలు అమ్ముతున్నాడు అని అందుకే పట్టుకొచ్చాను అని చెబుతాడు.

రామ దగ్గర మాదకద్రవ్యాలు:ఇక ఎస్సై మనోహర్ అతన్ని పిలిచి ఈ మాదకద్రవ్యాలు నీకు ఎవరు ఇచ్చారు అని ఎవరి దగ్గర కొంటున్నావని అడగడంతో అతను రామ అని చెబుతాడు. దీంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పటికి కూడా జానకి ముందు మనం ఎస్పీ గారి దగ్గరికి వెళ్లి మర్డర్ కేసు గురించి మాట్లాడదామని ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి ఇతని సంగతి చూద్దాం అని అంటుంది. కానీ మనోహర్ మాత్రం ఈ కేసు చాలా ఇంపార్టెంట్ అంటూ డ్రగ్స్ కేసును అంత ఈజీగా వదలకుడదు అని అంటాడు. అంతే కాకుండా రామ ఎలాంటి తప్పు చేయడు అని నేను నమ్ముతున్నాను అని నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అని జానకితో మాట్లాడుతూ ఉంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 April 11th Episode no 548

ఎలా రియాక్ట్ అవుతారో..:ఇక రామ తప్పు లేదని నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పుడు రామచంద్ర ఇంటికి వెళ్లి ఒకసారి సెర్చ్ చేయాలి అని జానకితో అంటాడు. దీంతో ఎస్సై మనోహర్ మాటలకు జానకి ఆశ్చర్య పోతుంది. తప్పని పరిస్థితుల్లో అందరితో కలిసి జానకి వారి ఇంటికి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. అయితే మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ కూడా శ్రీరాముల ఉత్సవాలకి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. ఇక అప్పుడే జానకి పోలీస్ జీప్ నుంచి దిగుతూ ఉంటుంది. ఇక ఎస్సై మనోహర్ వారి కుటుంబం దగ్గరికి వచ్చి రామచంద్ర మదకద్రవ్యాలు అమ్ముతున్నాడు అని ఇతను చెప్పాడు అని అది ఎంతవరకు నిజమనే విషయం తెలుసుకోవాలని అనుకున్నట్లుగా ప్రశ్నిస్తాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ ఆవుతారు. మరి ఈ విషయంలో జ్ఞానాంబ అలాగే మిగతా కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X