Janaki Kalaganaledu April 14th: నా పుట్టలో వేలు పెట్టింది.. జానకి అంతు చూస్తాను: మల్లిక ఛాలెంజ్!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తికరమైన కథాంశంతొ కొనసాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 553 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
న్యాయం చేయాలి అని..:జానకి పోలీస్ జాబ్ లోకి చేరిన తర్వాత ఊహించిన విధంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక వ్యక్తి హత్య జరగడంతో అతని కుటుంబానికి ఎలాగైనా న్యాయం చేయాలి అని ఆమె ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే ఎస్ఐ మనోహర్ మాత్రం నిందితులతో చేతులు కలిపి అతని దగ్గర డబ్బు తీసుకోవాలి అని ఈ క్రమంలో జానకి కేసుపై ఫోకస్ చేయకుండా చేయాలి అని అనుకుంటాడు. కానీ జానకి మాత్రం ఒక కానిస్టేబుల్ గానే తన ప్రయత్నాలు మొదలు పెడుతూ బాధ్యతగా కొనసాగుతుంది. అయితే ఊహించిన విధంగా ఎస్ఐ మనోహర్ జానకి భర్తను డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు.

రామచంద్ర అలాంటి వ్యక్తి కాదు:అటువైపు నుంచి ఆమె దృష్టిని మరల్చాలని అనుకుంటాడు. రామచంద్ర డ్రగ్స్ అమ్ముతున్నాడు అని అతనిపై నిందలు వేసి పోలీస్ స్టేషన్ వరకు తీసుకురావడం జరుగుతుంది. ఈ విషయంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. రామచంద్ర అలాంటి వ్యక్తి కాదు అని జానకి ఎంత చెప్పినా కూడా మనోహర్ రూల్స్ ప్రకారం వెళుతున్నాము అన్నట్లుగా చెబుతాడు. దీంతో జానకి కూడా భర్త విషయం గురించి ఆలోచిస్తూనే మరోవైపు హత్య కేసు గురించి కూడా ఆలోచిస్తుంది. అయితే హత్య చేసిన వ్యక్తి ఫోన్ చేసి వెంటనే ఈ కేసు గురించి మర్చిపోవాలి అని లేకపోతే నీ అంతు చూస్తాను అని చెబుతాడు. అంతేకాకుండా నువ్వు ఈ ఉద్యోగం వదిలి వెళ్లి పోవాలి అని కేసు గురించి మరోసారి ఆలోచించకూడదు అని ఆమెకు హెచ్చరికలు చేస్తాడు.
జానకికి సపోర్ట్ చేస్తున్నట్లుగా..:ఇక ఆ విషయాన్ని ఆమె ఎస్సై మనోహర్ కు కూడా చెబుతుంది. కానీ ఎస్ఐ మనోహర్ అక్కడ జానకికి సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చిన రిస్క్ జానకి అనవసరంగా నువ్వు ఇబ్బంది పడతావు మనం పోలీస్ జాబ్ నిజాయితీగా చేయాలి కానీ మనం ఇబ్బంది పడేలా చేసుకోకూడదు అని చెబుతూ ఉంటాడు. అయితే జానకి ఆ విషయం గురించి మరోసారి ఆలోచించాలని అనుకుంటుంది. ఇక ఇంటి దగ్గర చిన్న కోడలు మల్లిక జానకి పై మళ్లీ రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. జానకికి అలా జరిగినందుకు ఆమె చాలా సంతోషపడుతూ ఉంటుంది.

నా పుట్టలో వేలు:అయితే ఈ విషయంలో నువ్వు బాధపడడం లేదని భర్త విష్ణు అడిగినప్పుడు నేను ఎందుకు బాధపడతాను అని నన్ను చాలా సార్లు జానకి ఇబ్బంది పెట్టింది అని నా పుట్టలో వేలు పెట్టినప్పుడు. నేను మాత్రం ఎందుకు ఉరుకుంటాను అని తప్పకుండా చీమ తరహాలోనే కుడతాను అంటూ మల్లికా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా గతంలో జానకిని చెంప దెబ్బ కొట్టిన విషయాన్ని కూడా గుర్తు చేసుకొని అంతకంతకు ఆమెపై రివెంజ్ తీర్చుకుంటాను అని అత్తగారి ముందు తిట్టిస్తాను అని మల్లికా తనలో తానే శపథం చేసుకుంటూ ఉంటుంది.
అనవసరంగా ఇబ్బంది పడకు:ఇక కొడుకు గురించి జ్ఞానాంబ కూడా ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది. ఆమెకు భర్త గోవిందరాజులు ప్రత్యేకంగా టీ ఇచ్చిన కూడా ఏమాత్రం ఆసక్తి చూపించదు. నువ్వు అనవసరంగా ఇబ్బంది పడకు జానకి ఎలాగోలా రామచంద్రను విడిపించుకుని తీసుకువస్తుంది అని ఆయన ధైర్యం చెబుతాడు. కానీ రామచంద్ర అక్కడ ఎలాంటి ఇబ్బంది పడుతున్నాడో అని అతను తిన్నాడో లేదో అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఏ తల్లి అయినా సరే తన పిల్లలు కడుపునిండా తిన్న తర్వాతనే భోజనం చేస్తుంది. ఇప్పుడు కొడుకు ఆ పరిస్థితుల్లో ఉంటే నాకు ఇవన్నీ ఎలా తిను బుద్ధి అవుతుంది అని ఆమె బాధపడుతూ ఉంటుంది.

రామ ఎక్కడ?:ఇక జానకి అప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వస్తుంది. ఇక ఆమె దగ్గరికి వెళ్లిన జ్ఞానాంబ రామచంద్ర ఎక్కడ అని ఎందుకు ఇంకా తీసుకురాలేదు అని అడుగుతుంది. అయితే తన ఉద్యోగం కారణంగా రామచంద్ర గారు ఈ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది అని విషయాన్ని ఇంట్లో చెబితే మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది అని జానకి అసలు నిజం చెప్పకుండా సాక్షాలతో దొరికాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పవు అని నేను తప్పకుండా రామచంద్ర బయటకు తీసుకు వస్తాను అని చెబుతుంది.

జ్ఞానాంబ సీరియస్:అయితే ఒక్కసారిగా అత్తగారు ఆ విషయంలో సీరియస్ అవుతారు. అసలు ఈ సమస్యలన్నీ వచ్చింది నీ వల్లే నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే ఇవన్నీ అసలు మాకు ఉండేవి కావు. అయినా నువ్వు ఐపిఎస్ చదువుతున్నావు కదా ఏం ఉపయోగం. అసలు ఏ నేరం చేయనటువంటి రామచంద్రను కూడా విడిపించలేకపోతున్నావు అతను నేరం చేయలేదు అనే విషయం నీకు బలంగా తెలుసు. అయితే ఇప్పుడు జానకి మాటలు పట్టించుకోవద్దు అని ఎవరైనా లాయర్ ని చూస్తే బెటర్ అని జ్ఞానం చెబుతుంది. ఇక ఆ విషయంలో జానకి మామ గారితో మాట్లాడుతూ లాయర్ ను మాట్లాడుకుంటే మనకు కలిగే నష్టం ఎక్కువ అని నేను తప్పకుండా నా భర్తను బయటకు తీసుకొస్తాను అని చెబుతుంది. మరి ఈ విషయంలో జానకి ఇంకా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











