Janaki Kalaganaledu April 15th: భయంతో నిజాన్ని దాస్తున్న జానకి.. కోపాన్ని పెంచుకుంటున్న జ్ఞానాంబ!
జానకి కలగనలేదు సీరియల్ ఉహించని మలుపులతో ఎంతో ఆసక్తిగా మారుతోంది. ఇక ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు.
ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 554 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అరెస్ట్ కావడంతో: రామచంద్ర డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ కావడంతో తల్లి జ్ఞానాంబ తో పాటు తండ్రి గోవిందరాజులు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇక తల్లి అయితే ఏమి తినకుండా అలానే కూర్చుండిపోతుంది. ఆమెను ఓదార్చాలి అని గోవిందరాజులు ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె ఆ బాధ నుంచి బయటికి రాదు. తన కుమారుడు ఏ తప్పు చేయకపోయినా ఈ పరిస్థితి రావడం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది.
అయితే అత్తగారు బాధపడుతూ ఉండడంతో జానకి కూడా వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. తనకు కూడా ఎంతో బాధగా ఉంది అని ఒక భర్త అరెస్టు అయితే అతడి భార్య కన్నతల్లి కంటే ఎక్కువ బాధపడుతుంది అని, మీరు మీ బాధను బయటకు చెప్పుకుంటున్నారు నేను చెప్పుకోవడం లేదు అని జానకి చాలా ఎమోషనల్ అవుతుంది.
ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడాల్సి వస్తోంది: అయితే అలా బాధపడుతూ ఉన్న సమయంలోనే మల్లిక వస్తుంది. నువ్వు అంతగా బాధపడే బదులు ఆ పోలీస్ జాబు వదిలేయవచ్చు కదా.. నువ్వు ఆ చేస్తున్నప్పటి నుంచి ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు మీ జాబ్ కారణంగా కూడా ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడాల్సి వస్తోంది అని మల్లికా అంటుంది.
అయితే జానకి వెంటనే అనవసరంగా నువ్వు లేనిపోని తప్పుడు ఆలోచనలు కలిగించకు అని జానకి సీరియస్ అవుతుంది. ఇక తర్వాత జానకి నేను రామచంద్ర గారికి భోజనం ఇచ్చి వస్తాను అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతుంది. అయితే ఇక మల్లికా అత్తగారి మనసులో మరొక తప్పుడు ఆలోచనలు కలిగించాలని అనుకుంటుంది.

బయటకు తీసుకురాకపోతే: బావగారిని ఇప్పుడే బయటకు తీసుకురాకపోతే మళ్ళీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అని ఈ డ్రగ్స్ కేసు సీరియస్ అవుతాయి చాలా సమస్యలు ఎదురవుతాయి అని అల్లిక చెబుతుంది. అయితే జ్ఞానాంబ ఆ విషయం గురించి కూడా బాధపడుతూ ఉండడంతో గోవిందరాజులు ఆమెకు మళ్ళీ ధైర్యం చెబుతాడు.
నువ్వు అనవసరంగా మల్లిక మాటలు ఏమాత్రం పట్టించుకోవద్దు అని జానకి తప్పకుండా రామచంద్రని బయటకు తీసుకువస్తుంది అని తన మాటలు మాత్రమే నమ్మాలి అని చెబుతాడు. ఇక మరోవైపు జానకి భోజనం పట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళుతుంది. అక్కడ ఎస్సై మనోహర్ తప్పుడు మాట్లాడుతూ ఉంటాడు.
వెటకారంగా మాట్లాడుతూ: ఒకవైపు భార్య పాత్రను మరొకవైపు పోలీస్ పాత్రను కూడా చాలా చక్కగా పోషిస్తున్నారు అని ఆమెపై వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక జానకి రామచంద్ర దగ్గరికి వెళ్లి అతనికి భోజనం పెట్టాలని అనుకుంటుంది. నా వల్లే మీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని బాధపడుతూ ఉంటుంది.
దీంతో రామచంద్ర మీ వల్ల ఎందుకు బాధ పడతారు అని మనం న్యాయం మీద నమ్మకం ఉంచుదామని తప్పకుండా న్యాయం జరుగుతుంది అని రామచంద్ర అంటూ ఉంటాడు. అయితే జానకి మొదట జరిగిన విషయం గురించి రామచంద్ర తో చెప్పాలని అనుకుంటుంది.

జానకి షాకింగ్ డ్రీమ్: ఎస్ఐ మనోహర్ అలాగే హత్య చేసిన బిల్డర్ ఇద్దరు కూడా కుమ్మక్కై మీకు ఈ పరిస్థితి తీసుకువచ్చారు అని మొదట రామచంద్ర కు జానకి అసలు నిజం చెప్పాలని అనుకుంటుంది. అయితే రామచంద్ర సీరియస్ అయ్యి మళ్ళీ ఎస్సై మనోహర్ దగ్గరికి వెళితే అతను ఎన్కౌంటర్ చేసిన చేస్తాడు అని ఆమె ఊహిస్తుంది.
దీంతో మళ్ళీ వెంటనే ఆ ఊహ నుంచి బయటకు వచ్చి అసలు ఈ విషయం రామచంద్ర కు చెప్పకూడదు అని అనుకుంటుంది. మీరు ఏ మాత్రం టెన్షన్ పడకండి అంటూ రామచంద్ర జానకికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు.
జ్ఞానాంబ సీరియస్: ఇక మరోవైపు ఇంట్లో జ్ఞానాంబ తన కొడుకును తలచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక గోవిందరాజులు వచ్చి జానకి విషయంలో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని తను ఎన్నడూ కూడా తప్పు చేయదు అని మొన్నటి వరకు కూడా మన కుటుంబం కలిసే ఉండాలి అని అనుకున్న జానకిని నువ్వు తప్పు పట్టడం కరెక్ట్ కాదు అని చెబుతూ ఉంటాడు.
అంతేకాకుండా గతంలో నీ కిడ్నీ సమస్య ఎదురైనప్పుడు తన కిడ్నీ ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చింది అని చెబుతాడు. అయితే గతంలో అలా జరిగి ఉంటే కనుక నేను బ్రతికే ఉండే దాన్ని ఇంత విషయం తాగి చచ్చిపోయేదాన్ని అని జ్ఞానాంబ చెబుతూ ఉంటుంది. అంతేకాకుండా తన కిడ్నీ తనకు ఇవ్వండి అంటూ డాక్టర్లను వెళ్లి అడిగేదాన్ని అని జ్ఞానాంబ మరింత సీరియస్ అవుతుంది. మరి ఈ విషయంలో జానకి అత్త గారితో ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











