Janaki Kalaganaledu April 17th: జానకిపై సీరియస్ అయిన అఖిల్.. చెంప పగలగొట్టిన తండ్రి!

జానకి కలగనలేదు సీరియల్ ఉహించని మలుపులతో ఎంతో ఆసక్తిగా మారుతోంది. ఇక ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 555 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

మనోహర్ ప్లాన్ : జానకి భర్త రామచంద్ర అరెస్టయి పోలీస్ స్టేషన్లో ఉంటాడు. డ్రగ్స్ కేసులో అతన్ని మరింత ఇబ్బంది పెట్టాలని ఎస్ఐ మనోహర్ టార్గెట్ చేస్తూ ఉంటాడు. జానకి ఎలాగైనా ఈ పోలీసు ఉద్యోగం నుంచి తప్పించుకుంటే తాను హ్యాపీగా సంపాదించుకోవచ్చు అని ఎస్ఐ మనోహర్ అనుకుంటాడు. అంతేకాకుండా జానకి ఒక హత్య కేసులో బిల్డర్ ను పట్టించాలని అనుకుంటుంది. కానీ ఎస్ఐ మనోహర్ మాత్రం అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో రామచంద్ర తప్పు చేయకపోయినా కూడా అతను డ్రగ్స్ కేసులో ఇరుక్కునేలా ప్రణాళికలు రచిస్తాడు. ఇక జానకీ తప్పని పరిస్థితిలో రామచంద్రను అరెస్టు చేయాల్సి వస్తుంది.

Janaki Kalaganaledu

ఎలాగైనా కాపాడుకోవాలి అని : ఇక జానకికి రామచంద్రను ఎలాగైనా కాపాడుకోవాలి అని అలాగే తన పోలీసు ఉద్యోగానికి కూడా న్యాయం చేయాలని అనుకుంటుంది. అయితే ఇంట్లో వాళ్ళు మాత్రం రామచంద్ర పోలీస్ స్టేషన్లోనే ఉండడంతో బాధపడుతూ ఉంటారు. ఇక అత్తగారు జ్ఞానాంబ కూడా జానకిని తప్పుగానే అర్థం చేసుకుంటూ ఉంటుంది. గోవిందరాజులు మాత్రం కోడలు ఎన్నడూ తప్పు చేయదు అని తను చాలా మంచిది అని కుటుంబం ఎప్పుడూ కూడా కలిసి ఉండాలని కోరుకుంటుంది అని చెబుతూ ఉంటాడు.

చిన్న కొడుకు అఖిల్ : ఇక ఇంతలో అప్పుడే చిన్న కొడుకు అఖిల్ ఇంట్లోకి వస్తాడు. ఇక అతను తన గదిలోకి వెళ్లి చూడగా అక్కడ అతని భార్య జెస్సి ఒక దగ్గర జానకి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే బాబు ఏడుస్తూ ఉంటాడు. అంతేకాకుండా బెడ్ మీద అతను చివర ఉండడంతో వెంటనే అఖిల్ బాబును ఎత్తుకొని జెస్సినిపై కోపడుతూ ఉంటాడు. ఇక ఏం జరిగింది అంటూ బయట నుంచి తండ్రి గోవిందరాజులు అఖిల్ ని అడుగుతాడు. వెంటనే అఖిల్ వారి దగ్గరికి వచ్చి జానకి కారణంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు అని అసలు జానకి వదిన ఇంట్లోకి వచ్చినప్పటినుంచి ఈ సమస్యలు వస్తున్నాయి అని ఎవరు కూడా సంతోషంగా ఉండడం లేదు అని అంటుంటాడు.

అఖిల్ మల్లిక తప్పుడు మాటలు : అంతేకాకుండా ఆమె కారణంగా అన్నయ్య పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని ఆమెను పెళ్లి చేసుకోవడమే అన్నయ్య చేసిన పెద్ద తప్పు అని అఖిల్ మాట్లాడుతూ ఉంటాడు. అయితే గోవిందరాజులు మాత్రం వదిన గురించి అలా మాట్లాడవద్దు అని సమాధానం ఇస్తాడు. కానీ మరోవైపు మల్లిక కూడా అఖిల్ కు మద్దతు పలుకుతూ ఈ సమస్యలన్నీ వచ్చేది జానకి వల్లే అని అయినా కూడా ఆమె గురించి మాట్లాడే హక్కు మనకు లేదు అని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా జానకి అనుకుంటే బావగారు తొందరగా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది అని కానీ ఆమె అలా ఎందుకు చేయడం లేదో ఎవరికి అర్థం కావడం లేదు అని మల్లికా అంటుంది.

అఖిల్ పై ఆగ్రహం : ఇక అఖిల్ అయితే మరో అడుగు ముందుకు వేసి అసలు ఆమెను అన్నయ్య పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు అయిపోయింది కాబట్టి ఇంతగా అనుభవిస్తున్నాడు అని అఖిల్ తప్పు తప్పుగా మాట్లాడుతుంటాడు. దీంతో ఆగ్రహానికి లోనైనా గోవిందరాజులు వెంటనే అఖిల్ పై చేయి చేసుకుంటాడు. మరొక మాట జానకి గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని హెచ్చరిక చేస్తాడు. మీ అన్నయ్య భార్య వదినకు గౌరవం ఇవ్వాల్సింది పోయి అనవసరంగా ఇలా తప్పుగా మాట్లాడవద్దు అని అంటాడు. ఇప్పటికే తను చాలా బాధలో ఉంది అని అంటాడు.

మరింత కోపానికి లోనవుతో : ఇక అఖిల్ మరింత కోపానికి లోనవుతో ఇంట్లో అందరూ సమానమే అన్నప్పుడు ఆమె గురించి మాట్లాడే హక్కు నాకు లేదా అయినా ఆమె బాధ పడితే మేము కూడా బాధపడాలా ఇంట్లో నుంచి వెళ్లిపోదామన్నా కూడా ఆ మహాతల్లి వెళ్ళనివ్వదు అని మరింత కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంట్లో నాకు విలువలేదు అంటూ అతను మళ్ళి లోపటికి వెళ్ళిపోతాడు. అయితే జానకి ఈ గొడవ మొత్తం చూస్తుంది. ఇక గోవిందరాజులు ఆ విషయంలో మరింత బాధపడుతూ ఉంటాడు. అతని భార్య జ్ఞానాంబ తో మాట్లాడుతూ నువ్వు సీరియస్ గా ఉండే ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని.. చూసావా జానకిని వాళ్లు ఎంతలా మాట్లాడుతున్నారో అని అడుగుతాడు. కానీ ఆమె మౌనంగానే ఉంటుంది.

నేను ఇష్టమా? ఐపీఎస్ ఇష్టమా? : ఇక జానకి కూడా వారిని చూసి లోపలికి వెళ్ళిపోతుంది. జానకి వారు అన్న మాటలను గుర్తుచేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక రామచంద్రను తలుచుకుంటూ ఉండడంతో అప్పుడే రామచంద్రం వచ్చినట్లుగా ఆమె ఊహిస్తుంది. రామచంద్ర తోనే ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ సరదాగా ఉన్నట్లుగా గ్రహిస్తుంది. అయితే ఆ కలలో ఆమె రామచంద్ర ఒక ప్రశ్న అడుగుతాడు. నేను ఇష్టమా ఐపీఎస్ ఇష్టమా? అని అడగడంతో జానకి రెండు ఇష్టమే అని అంటుంది. కాదు ఒకటే చెప్పాలి అని రామ అడగడంతో అయితే రెండు చీటీలు వేస్తాను అని అప్పుడు సమాధానం మీరే ఒకటి తీసి సమాధానం చెప్పాలి అని జానకి అంటుంది. మరి రామచంద్ర ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X