Janaki Kalaganaledu April 18th: మరింత బాధలో జానకి.. అత్త ప్రమాణం, హంతకుడి బెదిరింపులు

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇక ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు.

ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 556 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

Photo Credits: Star Maa

Janaki Kalaganaledu Serial 2023 April 18th Episode 2023

ఇంట్లోనే బాధపడుతూ: భర్త పోలీస్ స్టేషన్లో ఉండడంతో జానకి ఇంట్లో ఉండి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అయితే రామచంద్ర దూరంగా ఉండటం ద్వారా ఇప్పుడు ఆయన ఉంటే బాగుంటుంది అని కలలు కూడా కంటుంది. అయితే ఆమె నిద్రలో ఉండగానే అప్పుడే అఖిల్ భార్య జెస్సి వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది.

నువ్వు ఇలా ఇంట్లోనే బాధపడుతూ కూర్చుంటే గుండె బరువు తగ్గిపోతుందా అక్క ఎందుకు సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు అని అడుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎంత బ్రతిమాలిన కూడా అన్నం కూడా తినవని నాకు తెలుసు. అందుకే ఈ పాలు తీసుకోవచ్చాను ఈ పాలు తాగమని జెస్సి చెబుతుంది.

ఎలాంటి గౌరవం లేకుండా: ఇక తర్వాత ఆమె అఖిల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అఖిల్ ఎలాంటి గౌరవం లేకుండా నిన్ను అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అది నాకు ఏమాత్రం నచ్చడం లేదు అక్క అంటూ జెస్సి చెబుతూ ఉంటుంది. ఎందుకు నువ్వు అక్కడే నిలదీసి అడగలేదు అని, అఖిల్ అన్ని మాటలు అంటున్న కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని జెస్సి అడుగుతుంది.

మన కుటుంబంలో అలాంటి కోపతాపాలకు పోతే దూరాలు పెరుగుతాయి.. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.. పరిస్థితులు మళ్లీ సర్దుకునే వరకు మనమే ఓపికతో ప్రశాంతంగా ఉండాలి అని జానకి చెబుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 April 18th Episode 2023

అఖిల్ పై జెస్సి సీరియస్: అయితే మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అని నువ్వు ఈ విషయంలో అఖిల్ గురించి మౌనంగా ఉండడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అని జెస్సి తన ఆలోచనను చెబుతుంది. నువ్వు ఇలాంటివి మనసులో పెట్టుకోకు అని జానకి మళ్ళీ జెస్సి కి చెబుతుంది.

కానీ జెస్సి మాత్రం అఖిల్ విషయంలో నువ్వు ఉరుకున్న కూడా నేను మాత్రం ఊరుకోను అని అతనికి ఎలాగైనా బుద్ధి వచ్చేలా చెబుతాను అని అంటుంది. ఇక జానకి ఎంత చెబుతున్న కూడా జెస్సి మాత్రం వినకొండ లోపలికి వెళ్తుంది.

నమ్మినవాళ్లే మోసం చేస్తుంటే..: ఇక మరోవైపు జ్ఞానాంబ కూతురు వెన్నెల పూజకు దగ్గర దేవుడికి దండం పెడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇక జానకి వెళ్లి ఆమెను పలకరిస్తుంది. అత్తయ్య గారు ఎక్కడా అని అడగడంతో కాస్త నీరసంగా ఉంది అని గదిలోనే పడుకున్నారు అని వెన్నెల చెబుతుంది.

ఇక జానకీ అత్తయ్య గారితో మాట్లాడాలని లోపలికి వెళితే ఆమె వెన్నెల వచ్చిందేమో అనుకొని కొన్ని మంచి నీళ్లు ఇవ్వమని అడుగుతుంది. కానీ జానకి అని తెలిసేసరికి మళ్ళీ తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడదు. నమ్మినవాళ్లే నన్ను మోసం చేస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది అని ఆ బాధ నీకు ఎదురైతే అప్పుడు అర్థమవుతుంది అని జ్ఞానాంబ అంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 April 18th Episode 2023

మాట తీసుకున్న అత్తగారు: కొడుకు గురించి నేను ఎంతో బాధపడుతున్నాను. అతను తప్పు చేయలేడు అని నీకు కూడా తెలుసు. అయినా కూడా ఎందుకు విడిపించడం లేదో.. అర్థం కావడం లేదు.. అని ఆమె బాధపడుతూ చెబుతుంది. తప్పకుండా నేను మీ అబ్బాయిని ఇంటికి తీసుకు వస్తాను అని నాకు కాస్త సమయం ఇవ్వండి అంటూ మళ్ళీ జానకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే ఎన్ని రోజుల్లో తీసుకువస్తావు రేపు తీసుకొస్తావా అంటూ అడుగుతుంది.

అంతేకాకుండా నువ్వు ఏదో దాస్తున్నావు అనే విధంగా అత్త గారు మాట్లాడుతూ ఉంటారు. అంతే కాకుండా తన మీద ప్రమాణం చేయించుకుని నా కొడుకును బయటకు తీసుకు వస్తావా లేదా అని నాకు మాట ఇవ్వు అంటూ జ్ఞానాంబ జానకి చేతిని తన తలపై పెట్టించుకుంటుంది. నా మీద ఒట్టేసి చెప్పు అని అంటుంది.

బిల్డర్ మధుకర్ ఫోన్ కాల్: ఇక జానకి అలా ఆలోచిస్తున్న సమయంలోనే అప్పుడే వెన్నెల వచ్చి చాలా సేపు నీకు ఫోన్ వస్తుంది అని చెప్పడంతో జానకి మళ్ళీ వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. హత్య చేసినటువంటి బిల్డర్ మధు ఫోన్ చేయడంతో జానకి కాస్త కంగారుపడుతుంది.

అతను ఫోన్ చేసి నేను చెప్పిన విషయం ఏం చేశావు అని అడుగుతాడు. వెంటనే నీ పోలీస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నా కేసును కూడా వదిలిపెట్టాలి అని అతను చెప్పడంతో జానకి మళ్ళీ సీరియస్ అవుతుంది.

అఖిల్ గోడవ మొదలు: మీరు తప్పు చేస్తున్నారా అనే విషయం మీకు అర్థం కావడం లేదా అని అడగడంతో.. నా ప్రాణం మీదికి వస్తే నేను ఎంతవరకైనా వెళ్తాను అని నువ్వు వెంటనే మీ నిర్ణయాన్ని చెప్పకపోతే మరింత సీరియస్ అవుతాను అని అంటాడు. ఇక జానకి మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది ఇంకా నువ్వు ఇచ్చిన టైం అయిపోలేదు అని చెప్పి ఆమె ఫోన్ పెట్టేస్తుంది.

ఇక మరోవైపు అఖిల్ భార్య జెస్సి అనుకున్నట్లే తన భర్తకు బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. కానీ అఖిల్ మాత్రం ఇదంతా జానకి వల్లే జరుగుతోంది అని ఇంట్లో నాకు ప్రశాంతత లేదు అని అసలు నేను మా అమ్మ కడుపులోనే పుట్టానా లేదంటే బయట నుంచి తీసుకొచ్చారా అంటూ మాట్లాడుతాడు. మరి ఈ విషయంలో జానకి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X