Janaki Kalaganaledu April 19th: రామ మనసులో అనుమానాలు రేపేలా మనోహర్ మాటలు.. మరింత బాధలో జానకి!
జానకి కలగనలేదు సీరియల్ కథనం మరో కీలక మలుపు తిరుగుతోంది. ఇక ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 557 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అతనికి బుద్ధి చెప్పాలి: జానకి విషయంలో రామచంద్ర తమ్ముడు అఖిల్ ప్రతిసారి కూడా కావాలని టార్గెట్ చేస్తూ ఆమెను తిట్టాలని అనుకుంటాడు. అయితే జానకి మాత్రం ఎంతో సహనంతో ఉంటుంది. కానీ అఖిల్ భార్య జెస్సీ మాత్రం జానకి మీద ఉన్న అభిమానంతో ఆమెను ఒక మాట కూడా అననివ్వదు.
జానకి అక్కను అనవసరంగా ఎందుకు తిడుతున్నావు అంటూ తన భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అంతేకాకుండా అతనికి బుద్ధి చెప్పాలి అని కోపంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంట్లో నేను ఉండలేను అని నువ్వు చేసే ప్రతి గొడవ కూడా చాలా తప్పుగానే ఉంది అంటూ జెస్సి పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ గొడవ చేస్తుంది.
వదిన కారణంగా గొడవలు: ఇక గొడవ జరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా అఖిల్ బెడ్ రూమ్ లోకి వస్తారు. ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు. ఇంట్లో నాకు గౌరవం లేదు అని ఇప్పుడు జానకి వదిన కారణంగా జెస్సి కూడా తనపై సీరియస్ అవుతోంది అని అఖిల్ మరింత అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇక జానకి జెస్సిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది.
ఇక జెస్సి మాత్రం అఖిల్ పై మరింత సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు సమాధానం చెప్పు అని అంటుంది. అనవసరంగా లేనిపోని దానికి జానకి అక్క పై నిందలు వేయాలని అనుకుంటావు? ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని జెస్సి అంటుంది.

జానకి పై కోపాన్ని వ్యక్తం చేస్తూ..: అంతేకాకుండా ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పడంతో అఖిల్ కొంత ఆందోళన చెందుతూ ఉంటాడు. వెంటనే మళ్ళీ జానకి పై కోపాన్ని వ్యక్తం చేస్తూ నీ కారణంగా ఈరోజు మా మధ్యలో కూడా గొడవలు అవుతున్నాయని ఎలాగైనా జెస్సిని ఇంట్లోకి నుంచి వెళ్లకుండా చేయాలి అని జానకికి ఒక హెచ్చరిక చేసినట్లుగా అఖిల్ మాట్లాడుతూ ఉంటాడు.
ఇక అతను సైలెంట్ గా బయటకు వెళ్ళిపోతాడు ఇక జానకి మళ్ళీ జెస్సి కి వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇలా చేస్తే అయినా అఖిల్ మారతాడేమో అని అనుకున్నాను అక్క అంతే కానీ మళ్ళీ నీపై ఈ విధంగా ప్రవర్తిస్తాడు అని నేను అనుకోలేదు అని ఆమె చెబుతుంది. పరిస్థితులు అన్నీ త్వరలోనే సర్దుకుంటాయని నువ్వు అనవసరంగా ఇలాంటి పనులు చేయకు అని జానకి చెబుతుంది.
మాటలతో ఇబ్బంది పెడుతూ: ఇక జానకి విషయంలో మామ గోవిందరాజులు కూడా ఆమెకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇక జానకి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉన్న రామచంద్ర కు భోజనం తీసుకువెళ్లాలి అని అనుకుంటుంది. అయితే చుట్టుపక్కల వాళ్ళు జానకిని మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు.
సొంత భర్తనే ఏ తప్పు చేయకపోయినా కూడా ఆమె పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళింది అని ఇలాంటి భార్య ఎవరికి ఉండకూడదు అని కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక మరోవైపు రామచంద్ర పోలీస్ స్టేషన్లో ఉండగా ఎస్సై మనోహర్ అతనిని మరింత బాధ పెడుతూ మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా తన మాటలతో రామచంద్ర కు అతని భార్యపై కోపం తెప్పించాలి అని అనుకుంటాడు.

రామ మనసులో అనుమానం: పురాణాల గురించి చెబుతూ ఒకప్పుడు భర్తలను భార్యలు ఎలాగైనా కాపాడుకునేవారు అని ఈ రోజుల్లో అలా కనిపించడం లేదు అని ప్రతి విషయంలో కూడా స్వార్థంగా ఆలోచిస్తున్నారు అని చెబుతూ ఉంటాడు. జానకి నిన్ను కేసు నుంచి కాపాడగలదు.. కానీ అలా చేయడం లేదు.. అని మనోహర్ చెప్పడంతో రామచంద్ర మనసులో ఒక అనుమానం కలుగుతుంది.
ఎస్ఐ గారి కి అలాగే జానకి గారికి మధ్యలో ఏదో జరుగుతుంది అని అనుకుంటాడు. ఇక రామచంద్ర ఎంత చెప్పినా కూడా వినకుండా జానకి గారు తప్పకుండా నన్ను బయటకు విడిపిస్తారు అని మీకంటే గొప్పవారు అనే విధంగా మాట్లాడుతూ ఉంటాడు.
మరోసారి మనోహర్ సలహా: దీంతో ఎస్సై మనోహర్ మరింత కోపానికి లోనై రామచంద్ర మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మరొక కానిస్టేబుల్ కు చెబుతాడు. ఇక జానకి అప్పుడే పోలీస్ స్టేషన్ లోకి వస్తుంది. విషయం తెలుసుకోగానే మరి కొంత సమయం కావాలి అని ఎస్ఐ మనోహర్ ను బ్రతిమాలుతుంది. అంతేకాకుండా డ్రగ్స్ విషయంలో రామచండ్రను ఇరికించిన మరో నేరస్తుడిని కూడా ఆమె బ్రతిమాలుతుంది.
నువ్వు నిజం చెప్పు.. నాకు టైం లేదు రామచంద్ర గారు మళ్ళీ మరింత కష్టాల్లో పడతారు అని అతనిని బ్రతిమాలుకుంటుంది. ఇక మనోహర్ వచ్చి ఇలా బ్రతిమాలుకుంటే పనులు అవ్వవు అని నేను చెప్పినట్లుగా చేస్తే రామచంద్ర బయటకు వస్తాడు అని బిల్డర్ మనోహర్ చెప్పినట్లుగా కేసును వదిలేసి మీ పోలీసు యూనిఫాంలో కూడా వదిలేసి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెబుతాడు. ఇక ఆ విషయంలో జానకి మరోసారి ఆలోచనలో పడుతుంది. ఇక ఇంట్లో మల్లిక విష్ణు మధ్యలో కూడా కొంత గొడవలు జరుగుతాయి. మరి ఈ పరిస్థితుల నడుము జానకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











