Janaki Kalaganaledu April 20th: భర్తకు అసలు నిజం చెప్పిన జానకి.. మరోసారి మల్లిక అనుమానం!

జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన ఘట్టంతో ముందుకు సాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు.

కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 558 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

Janaki Kalaganaledu Serial 2023 April 20th Episode

ఉద్యోగం నుంచి వెళ్లిపోయేలా..: కానిస్టేబుల్ గా ఉన్న జానకి హత్య చేసిన బిల్డర్ ను ఎలాగైనా అరెస్టు చేయాలి అని FIR నమోదు చేయాలి అని అనుకుంటుంది. కానీ ఎస్ఐ మనోహర్ మాత్రం బిల్డర్ తో చేతులు కలిపి అతనితో డీల్ మాట్లాడుకుంటాడు. దీంతో జానకిని ఇబ్బంది పెట్టకుండా ఆమెను అడ్డు తొలగించుకోవాలి అని ఈ ఉద్యోగం నుంచి వెళ్లిపోయేలా చేయాలి అని అనుకుంటారు.

అంతేకాకుండా జానకి భర్త రామచంద్ర డ్రగ్స్ కేసులో కావాలని ఇరికిస్తారు. దీంతో జానకి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఇక రామచంద్ర కోసం ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అసలు నిజం తెలియక అసలు రామచంద్ర ఎలాంటి తప్పు చేయకపోయినా ఎందుకు అరెస్ట్ చేశారు అని ఆందోళన చెందుతూ ఉంటారు.

జానకి వల్ల ఏ పని జరగదు: ఇక జానకి అసలు నిజాన్ని ఇంట్లో చెప్పకుండా దాస్తుంది. ఎలాగైనా అంతకుడిని అరెస్టు చేయాలి అని అలాగే రామచంద్రను కూడా కాపాడుకోవాలని అనుకుంటుంది. కానీ రోజు రోజుకు పరిస్థితులు కఠినంగా మారుతూ ఉంటాయి. మరోవైపు మల్లిక ఇంట్లో మరిన్ని గొడవలు సృష్టించాలని అనుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ముందుగా అత్తగారిని మనసులో ఒక అనుమానాన్ని కలుగజేస్తుంది.

అసలు జానకి వల్ల ఏ పని జరగదు అని మనమే పోలీస్ స్టేషన్కు వెళ్లి బావగారిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అని చెప్పడంతో జ్ఞానాంబ మల్లికా ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లాలని అనుకుంటారు. ఇక అప్పుడే గోవిందరాజులు వచ్చి మల్లిక పోలీస్ స్టేషన్కు వెళితే గొడవ జరుగుతుందేమో అని వాళ్ళందరికీ అక్కడే ఆపేస్తాడు.

Janaki Kalaganaledu Serial 2023 April 20th Episode

భర్తకు నిజం చెప్పిన జానకి: నేను వెళ్లి అసలు విషయం కనుక్కుంటాను అని నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకు అని తన భార్య జ్ఞానాంబను గోవిందరాజులు గుమ్మం దగ్గర ఆపేస్తాడు. ఇక గోవిందరాజులు పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లాలని అనుకుంటాడు. అయితే పోలీస్ స్టేషన్ దగ్గర జానకి రామచంద్రకు భోజనం పెట్టాలని అనుకుంటుంది. ఇక జానకి రామచంద్ర కు జరిగిన అసలు విషయం గురించి చెబుతుంది.

ఇందులో మీరు నా కారణంగానే ఈ విధంగా పోలీస్ స్టేషన్ లోకి రావాల్సి వచ్చింది అని హత్య చేసిన బిల్డర్ మిమ్మల్ని ఇరికించాడు అని అలాగే ఎస్ఐ కూడా అతనితో చేతులు కలిపాడు అని చెబుతుంది. మిమ్మల్ని ఇలాంటి డ్రగ్స్ కేసులో ఇరికించి నా చేతిలు కట్టేశారు ఇప్పుడు నా పోలీస్ ఉద్యోగాన్ని వదిలేస్తేనే వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు అని జానకి చెబుతుంది.

పోలీస్ స్టేషన్ కు వచ్చిన తండ్రి: అయితే జానకికి ఆ విషయంలో రామచంద్ర సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ జాబ్ వదిలేయకూడదు. రేపు మీరు ఐపీఎస్ కావాలని అనుకుంటున్నారు అలాంటిది మీరు ఈ చిన్న కేసు కు భయపడి వెనుకడుగు వేస్తే మీరు కన్న కళలకు ఫలితం ఉండదు అని రామచంద్ర ఆమెకు మద్దతు ఇస్తాడు. ఇక అప్పుడే గోవిందరాజులు పోలీస్ స్టేషన్ కు వస్తాడు. రాగానే కొడుకు రామచంద్రని చూసి ఆయన గుండెలకు హత్తుకునే బాధపడుతూ ఉంటాడు.

ఈ పరిస్థితి ఏంటి రామచంద్రా అంటూ నేను ఇప్పుడే ఎస్ ఐ గారితో మాట్లాడుతాను అని అంటాడు. అయితే ఎస్ఐ మనోహర్ మాత్రం మీరు ఏమి అడిగినా ఎలాంటి సహాయం అడిగిన చేస్తాను కానీ రామచంద్రను మాత్రం వదిలే ప్రసక్తి లేదు అని రేపు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్లుగా ఎస్సై చెబుతాడు.

మల్లిక అనుమానం: అయితే ఈ కేసు విషయంలో మీ పెద్ద కోడలు గట్టిగా పూజలు చేయాలి అని అర్థమైందా జానకి అంటూ మనోహర్ ఇన్ డైరెక్ట్ గా చెబుతూ ఉంటాడు. ఇక తండ్రి ఎక్కువసేపు అక్కడ ఉండడం మంచిది కాదు అని రామచంద్ర ఆయనను ఇంటికి వెళ్ళిపోమని చెబుతూ ఉంటాడు. అలాగే జానకిని కూడా తీసుకు వెళ్ళమని అంటాడు. ఈ క్రమంలో ఇంట్లో మరోవైపు భర్త కోసం జ్ఞానాంబ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది.

అయితే పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం గురించి అసలు ఏమాత్రం మీ అత్తయ్య గారికి చెప్పకు అని కోడలు జానకి దగ్గర గోవిందరాజులు మాట తీసుకుంటాడు. ఇక రాగానే జ్ఞానాంబ కొడుకు విషయం గురించి ఏం మాట్లాడారు అని? రామచంద్ర ఇంకా రాలేదా అని అడుగుతుంది. అయితే గోవిందరాజులు అసలు నిజం చెప్పకుండా ఎస్ఐ గారు రాగానే బాగా మర్యాద చేశారు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మల్లిక వచ్చి వీరు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే అక్కడ పని జరగలేదని అనిపిస్తుంది అని అనుమానం వ్యక్తం చేస్తుంది. మరి ఆమె మాటలకు జానకి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X