Janaki Kalaganaledu April 21st: అఖిల్ ఇచ్చిన ట్విస్టుతో సీరియస్ అయిన జ్ఞానాంబ.. మరో సమస్యలో జానకి!
జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన కథాంశంతో ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 559 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
ఏ తప్పు చేయకపోయినా : రామచంద్ర ఏ తప్పు చేయకపోయినా అరెస్టు చేశారు అని అతన్ని ఎందుకు విడిపించడం లేదు అని జానకిపై అత్త జ్ఞానాంబతో పాటు ఇంట్లో అందరూ కూడా కాస్త అసహనంతో ఉంటారు. కానీ రామచంద్ర తండ్రి గోవిందరాజులు మాత్రం జానకి ఎలాంటి తప్పు చేసి ఉండదు అని నమ్ముతాడు. డ్యూటీలో భాగంగా ఒక కానిస్టేబుల్ గా జానకి రామచంద్రను అరెస్టు చేసి తీసుకు వెళ్లాల్సి వస్తుంది. ఇక పోలీస్ స్టేషన్లో ఉన్న రామచంద్రను ఎలాగైనా నిర్దోషిగా బయటకు తీసుకురావాలి అని జానకి ప్రయత్నాలు చేస్తుంది. అయితే అత్తగారు జ్ఞానాంబ మాత్రం నా కొడుకు ఎప్పుడు వస్తాడు అంటూ పదేపదే అడుగుతూ ఉంటుంది. ఇక ఈ క్రమంలో ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని అనుకుంటున్న సమయంలో గోవిందరాజులు అడ్డుపడి ఆమె వెళితే అనవసరంగా మళ్ళీ గొడవలు అవుతాయని ఒక్కడే వెళతాడు.
అఖిల్ ఇచ్చిన ట్విస్ట్ : ఇక జానకిని అక్కడ చూసి గోవిందరాజులు నచ్చజెప్పి మళ్ళీ ఇంటికి తీసుకువస్తాడు. రామచంద్ర తప్పకుండా ఇంటికి వస్తాడు అని జానకి కూడా భరోసా ఇస్తుంది. ఇక అత్తగారిని ఎలాగైనా కంట్రోల్ చేయాలి అని జానకి అనుకుంటుంది. కానీ ఆమె మాత్రం నా కొడుకు రావాల్సిందే అని పదేపదే చెబుతూ ఉంటుంది. ఇక ఇంతలో చిన్న కొడుకు అఖిల్ వచ్చి తన కుమారుడి బారసాల వేడుకలు నిర్వహించాలని అనుకుంటాడు. అయితే ఇప్పుడు రామచంద్ర లేకుండా ఇలా వేడుక జరపడం కరెక్ట్ కాదు అని తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా తను వినడు. అన్నయ్య ఇప్పట్లో రాడు అని అతను అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ కోర్టులు కేసులు అనేవి ఇప్పట్లో తేలవని ఆ విషయం పెద్ద వదినకు కూడా తెలుసు అని అతను కామెంట్ చేస్తాడు. అందుకే అన్నయ్య వచ్చేలోపు ఆలస్యం చేయడం కంటే ఇప్పుడే నిర్వహించడమే బెటర్ అని పంతులు గారితో కూడా మాట్లాడాను అని అఖిల్ చెబుతాడు.

చచ్చిపోయినట్లు లెక్క అని : ఇక అఖిల్ తీసుకున్న నిర్ణయంతో జ్ఞానాంబ కూడా ఆశ్చర్య పోతుంది. ఎలాగైనా తన కొడుకు రేపు బారసాల వేడుకకు రావాలి అని ఆమె జానకితో చెబుతుంది. లేదంటే నేను ఇంట్లో చచ్చిపోయినట్లు లెక్క అని అంటుంది. దీంతో జానకి మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఎలాగైనా ఇప్పుడు రామచంద్ర గారిని బయటకు తీసుకురావాలి. నేను ఈ ఉద్యోగం వదిలేస్తేనే ఎస్ఐ గారు రామచంద్రను వదిలేస్తారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని జానకి ఆలోచనలో పడుతుంది. అయితే ముందుగా అఖిల్ ను బ్రతిమాలి ఎలాగైనా ఈ వేడుకను వాయిదా వేయించాలని అనుకుంటుంది. కానీ అతను మాత్రం ఆ ఒక్కటి తప్ప ఏదైనా అడుగు అని ముందుగానే అంటుంటాడు. ఈ విషయంలో మీ అమ్మగారి గురించి కూడా ఆలోచించాలి అని మీ అన్నయ్యగారు రాకపోతే ఆమె ఆరోగ్యం మరింత డిస్టర్బ్ అవుతుంది అని జానకి ఎంతగానో నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది.
జానకి ఎదురుగా మరో సమస్య : కానీ అఖిల్ మాత్రం నువ్వే ఏదో నిజం చెప్పొచ్చు కదా అన్నయ్య ఇప్పుడు రాడు అని మళ్లీ అఖిల్ కౌంటర్ ఇచ్చేలా మాట్లాడుతుంటాడు. అంతేకాకుండా సెంటిమెంట్తో నన్ను బ్లాక్ మెయిల్ చేయకు అని అతను మరింత గట్టిగా మాట్లాడుతుంటాడు. ఇక జానకి మళ్ళీ ఆలోచనలో పడుతుంది. అయితే మరోవైపు జానకి ఇంతకుముందు ఒక అమ్మాయిని ఏడిపించిన కేసు విషయంలో ఒక వ్యక్తిని అరెస్టు చేస్తుంది. అయితే అతను ఎలాగైనా జానకిపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అతని స్నేహితులు అతన్ని ఒక లేడీ కానిస్టేబుల్ చేత చివాట్లు తిని పరువు పోగొట్టుకున్నాడు అని అనడంతో ఎలాగైనా జానకి పై పగ తీర్చుకోవాలని వారి ముందే శపధం చేస్తాడు.



Click it and Unblock the Notifications











