Janaki Kalaganaledu April 23rd: పెద్ద కొడుకు కోసం జ్ఞానాంబ ఆరాటం.. ఎస్ఐకు ట్విస్ట్ ఇచ్చిన జానకి!
జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరమైన కథనంతో ఎంతో ఆసక్తిగా ఆకట్టుకుంటోంది. ఇక ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు.
కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 561 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

పెద్ద కొడుకు రామచంద్ర..: ఇంటికి పెద్ద కొడుకు రామచంద్ర పోలీస్ స్టేషన్లో ఉండడంతో తల్లి జ్ఞానాంబ చాలా బాధపడుతూ ఉంటుంది. మిగతా ఇద్దరు కొడుకులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చిన్నవాడు అఖిల్ అయితే తన కొడుకు బారసాల ఫంక్షన్ నిర్వహించాలని అనుకుంటాడు. అన్నయ్య కారణంగా నా కొడుకు ఫంక్షన్ ఎందుకు చేయకూడదు అంటూ మొండిగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
దీంతో తల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే తప్పకుండా రామచంద్రను బయటకు తీసుకు వస్తాను అని జానకి అందరికీ మాట ఇస్తుంది. కానీ బారసాల రోజు ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఇంకా రామచంద్ర ఇంటికి రాడు. ఈ క్రమంలో చిన్న కోడలు మల్లికా మరింత కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది.
ఈ ఒక్కరోజు ఓపిక పట్టి ఉండాలి: ఇక గోవిందరాజులు తన భార్య జ్ఞానాంబను కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఎలాగైనా ఈ ఒక్కరోజు ఓపిక పట్టి ఉండాలి. చిన్న కొడుకు అఖిల్ మళ్ళీ బాధపడతాడు. మన మొదటి మనవడి బారసాల వేడుకలు మనమే సంతోషంగా చేయకపోతే జీవితాంతం అదొక వెలితిగా ఉంటుంది.
నువ్వు ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఇంట్లో హడావిడిగా కనిపించే దానివి.కానీ ఇప్పుడు ఇలా ఉండడం కరెక్ట్ కాదు అని గోవిందరాజులు చెప్తాడు. అంతేకాకుండా గోవిందరాజులు ప్రాధేయపడుతూ తన భార్యను వేడుకుంటాడు. ఈ క్రమంలో జ్ఞానాంబ కూల్ అయ్యే ప్రయత్నం చేస్తుంది.

మరొక గొడవ క్రియేట్ చేయాలని: ఇక తర్వాత మల్లిక మరొక గొడవ క్రియేట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. వేడుకకు సమయం అవుతున్న కూడా ఆమె తీరిగ్గా కూర్చొని ఉంటుంది. ఇక ఆమెను చూసి భర్త విష్ణు కాస్త ఆశ్చర్యపోతాడు. ఇంకా రెడీ కాలేదు అని అడుగుతాడు. జరగని పేరంటానికే హడావిడి ఎందుకు అని ఆమె వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది.
ఇక వేడుకకు అందరూ సిద్ధమవుతున్న సమయంలోమల్లిక వచ్చి మరింత కటికంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే జ్ఞానాంబ కాస్త కుదుటపడి వేడుకకు సిద్ధమవుతుండగా మల్లిక వచ్చి మరొక విధంగా మాట్లాడుతూ ఉంటుంది. బావగారికి కనీసం బెయిల్ కూడా రాని కేసులో ఇరుక్కున్నారు అని అందరూ మాట్లాడుకుంటున్నట్లుగా ఆమె చెబుతుంది.
జ్ఞానాంబ కోలుకుంటూ ఉండగా: దీంతో గోవిందరాజులు అసహనానికి గురి అవుతాడు. ఇప్పుడిప్పుడే జ్ఞానాంబ కోలుకుంటూ ఉండగా మళ్లీ మల్లిక అనవసరంగా చర్చలు పెడుతోంది అని నువ్వు మంచిగా మాట్లాడవా ఉండవా? అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను ఉన్నదే మాట్లాడుతున్నాను అని అనవసరంగా అత్తయ్య గారు ఆశలు పెట్టుకొని మళ్ళీ బాధపడతారు అని అయినా ఇప్పటినుంచి నేను ఏమీ మాట్లాడను అని ఆమె అంటుంది.
ఇక గోవిందరాజులు మాత్రం ఆమెపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇక జ్ఞానాంబ ఆ మాటలకు అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు నాన్న అమ్మ అలా వెళ్ళిపోతుంది అంటూ చిన్న కొడుకు అఖిల్ అడుగుతాడు. ఇప్పుడు అమ్మ ఈ వేడుకల్9 ఉండకపోతే నెక్స్ట్ మన ఇంట్లో నాకు సంబంధించిన ఏ వేడుక జరగదు అని బలంగా చెబుతాడు.
ఎలాగైనా తీసుకురావాలని: ఇక మరోవైపు పోలీస్ స్టేషన్లో జానకి భర్తను ఎలాగైనా తీసుకురావాలని అనుకుంటూ ఉంటుంది. ఇక లాయర్ తో ఆమె పోలీస్ స్టేషన్కు వస్తుంది. బేయిల్ ఇప్పించాలి అని ఎస్ఐ మనోహర్ ను అడుగుతుంది. అయితే అతను ఎంత మాత్రం ఇవ్వను అని చెబుతాడు. ఇక లాయర్ మాత్రం మరొక విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు ఇంట్లో జానకి ఇంకా రాలేదా అని వచ్చిన వారు అడుగుతూ ఉంటారు.
మనోహర్ కు ఫోన్ కాల్: ఇక అఖిల్ అత్తమామలు కూడా అప్పుడే వస్తారు. మీ కుటుంబ సభ్యులు ఎవరు రాలేదని అడిగినప్పుడు ఎందుకు అనవసరంగా చెప్పడం.. మళ్ళీ ఈ కేసు విషయాల గురించి గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటారు అని ఆ బాధ తట్టుకోవడం కంటే పిలవకపోవడమే బెటర్ అని వాళ్ళు మరొక విధంగా మాట్లాడుతుంటారు. ఇక మరోవైపు జానకి తన భర్తను ఇంటికి తీసుకురావాలి అని మనోహర్ ను బ్రతిమాలే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
కానీ ఎస్సై మనోహర్ మాత్రం ఏమాత్రం ఒప్పుకోడు. ఈ క్రమంలో ఆమె రామచంద్ర గారి తల్లి ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదని మెడికల్ సర్టిఫికెట్స్ కూడా లాయర్ ద్వారా చూపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ నేను ఒప్పుకోను అని ఎస్సై చెబుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అసలు ఇంతకు ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారు? ఎస్ఐ మనోహర్ రామచంద్రకు బేయిల్ ఇస్తాడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్లు చూడాలి.


Click it and Unblock the Notifications











