Janaki Kalaganaledu April 25th: కోడలిపై జ్ఞానాంబ సంతోషం.. జానకిని టార్గెట్ చేసిన మరో వ్యక్తి!
జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన ఎమోషన్స్ తో ఆసక్తిగా కొనసాగుతోంది. జానకి ఐపీఎస్ కావాలని అనుకుంటుంది. కానీ కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు.
కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 562 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఆ విషయం తెలిసినప్పటికీ..: జానకి భర్త రామచంద్ర పోలీస్ స్టేషన్లో ఉండడంతో ఎలాగైనా అతన్ని బయటకు తీసుకురావాలి అని జానకి ప్రయత్నం చేస్తుంది. ఏ తప్పు చేయకపోయినప్పటికీ డ్రగ్స్ కేసులో కావాలని ఎస్ఐ మనోహర్ రామచంద్రను పోలీస్ స్టేషన్లో పెడతాడు. ఆ విషయం తెలిసినప్పటికీ కూడా జానకి చట్టపరంగా న్యాయంగా అతన్ని వెనక్కి తీసుకురావాలని అనుకుంటుంది.
ఈ క్రమంలో మరోవైపు ఇంట్లో జానకి ఒక పోలీసు అయినప్పటికీ రామచంద్ర ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఎందుకు విడిపించుకు రావడం లేదు అని అసహనంతో ఉంటారు. ముఖ్యంగా అత్తగారు జ్ఞానాంబ అయితే జానకిని మళ్ళీ జీవితంలో ఇలాంటి విషయంలో నమ్మను అని ఆమెపై నాకు నమ్మకం పోయింది అంటూ కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది.
లాయర్ తో మాట్లాడి: ఆమె భర్త గోవిందరాజులు అయితే ఎంతగానో అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె నా మనసు విరిగిపోయింది అంటూ మరింత అసహనం వ్యక్తం చేస్తుంది. మరోవైపు జానకి పోలీస్ స్టేషన్లో ఎలాగైనా రామను విడిపించుకుని ఇంటికి తీసుకువెళ్లాలని అనుకుంటుంది.
అఖిల్ కొడుకు బారసాలు ఉండడంతో తప్పనిసరిగా ఇప్పుడు రామచంద్ర గారు ఇంట్లో ఉండాలి అని ఆమె అనుకుంటుంది. ఇక జానకి లాయర్ తో మాట్లాడి బేయిల్ ఇప్పించాలని అనుకుంటుంది. కానీ ఎస్ఐ మనోహర్ మాత్రం బేయిల్ ఇవ్వడానికి ఏమాత్రం ఒప్పుకోడు.

రామచంద్రను బయటకు వచ్చేలా: ఇక జానకి ఉన్నత అధికారులతో మాట్లాడి రామచంద్రను బయటకు వచ్చేలా చేస్తుంది. ఇక రామచంద్ర బయటకు రాగానే కౌగిలించుకున్న జానకి అతన్ని ఇంటికి తీసుకువెళ్లడానికి సిద్ధమవుతుంది. ఇక ప్రత్యేకంగా సహాయం చేసినందుకు లాయర్ కు జానకి కృతజ్ఞతలు తెలుపుతుంది.
ఇక ఇంట్లో అందరూ కూడా రామచంద్ర ఇక రాడు అని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అత్తగారు కోపంగా ఉన్న సమయంలోనే జానకి తన భర్తను ఇంటికి తీసుకువస్తుంది. ఇక గోవిందరాజులు ఆ విషయాన్ని ఎంతో సంతోషంగా భార్యకు చెబుతాడు. చూసావా జ్ఞానాంబ కోడలు చెప్పినట్లుగానే మన రామచంద్రను ఇంటికి తీసుకువచ్చింది అని సంతోషంగా మాట్లాడుతాడు.
పూర్తిగా బయటకు రాలేదు: ఇక జ్ఞానాంబ కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. అయితే కొంతసేపు గోవిందరాజులతో జానకి ప్రత్యేకంగా మాట్లాడాలని అనుకుంటుంది. అసలు రామచంద్ర బయటకు రాడు అనుకుంటున్న సమయంలో ఎలా తీసుకువచ్చావని ఆమెను గోవిందరాజులు అడుగుతాడు. అయితే ఇప్పుడు రామచంద్ర గారు పూర్తిగా బయటకు రాలేదు అని కేవలం బేయిల్ మీద మాత్రమే తీసుకోవచ్చాము అని చెబుతోంది.
దీంతో మళ్లీ ఆయన షాక్ అవుతాడు. ఇప్పుడే జ్ఞానాంబ కొడుకు వెనక్కి వచ్చాడు అని ఎంతగానో ఆనందపడుతుంది. మళ్లీ ఇలాంటి సమయంలో నువ్వు కొద్దిసేపే ఆమె ఇక్కడ ఉంటాడు అని చెబితే తట్టుకోలేదు అని ఈ ఫంక్షన్ అయిపోయే వరకు కూడా నిజం చెప్పకు అని ఆమె దగ్గర మాట తీసుకుంటాడు.
ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది: ఇక జానకి అందుకు ఒప్పుకొని అత్తగారికి దగ్గరికి వెళ్లి ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఇప్పుడైనా నామీద కోపం తగ్గిందా అత్తయ్య గారు అని అడుగుతుంది. అందుకు జ్ఞానాంబ ఎంతగానో సంతోషిస్తుంది. తప్పుగా అర్థం చేసుకున్నాను జానకి నువ్వు ఎప్పుడూ కూడా ఈ కుటుంబం సంక్షేమం కోసమే ఆలోచిస్తావు.
విడిపోతుంది అనుకున్న ఈ కుటుంబాన్ని మళ్లీ దగ్గర చేసేందుకు ప్రయత్నం చేస్తున్నావు. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు అని అత్తగారు అడగడంతో జానకి ఏం పర్వాలేదు అని మీరు కూడా ఒక అమ్మాలాంటి వారే అని ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది.
బాబును ఎత్తుకొని పోవాలి అని..: ఇక రామచంద్ర జానకి త్వరగా వేడుకకు సిద్ధం కావాలని రెడీ అవ్వండి అని గోవిందరాజులు చెబుతాడు. ఇక రామ అలాగే జానకి బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే ఇద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ఇక రామచంద్ర అయితే తన భార్యను హగ్ చేసుకొని ఎంతగానో సంతోషిస్తాడు. అయితే మరోవైపు జానకి ఎదుట మరో ప్రమాదం పొంచి ఉంటుంది. గతంలో ఒక అమ్మాయిని ఏడిపించినందుకు అరెస్టు చేసిన వ్యక్తి జానకి పై రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటాడు.
అందుకోసం ప్రత్యేకంగా అతను జానకి ఇంటి బయట కాచుకొని ఉంటాడు. ఏదో ఒకటి చేసి జానకిని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటాడు. అయితే అదే సమయంలో జానకి అఖిల్ కొడుకుని ఎత్తుకొని బయటకు వస్తుంది. అయితే అప్పుడు బాబు వాంతులు చేసుకోవడంతో జానకి బాబును బయట పడుకోబెట్టి లోపలికి వెళుతుంది. ఇక ఆ బాబును ఎత్తుకొని పోవాలి అని అతను ప్రయత్నం చేస్తుంటాడు. మరి జానకి అతన్ని ఎలా అడ్డుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











