Janaki Kalaganaledu April 26th: అఖిల్ కొడుకును ఎత్తుకుపోయిన శత్రువు.. మరో సమస్యలో జానకి!

జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరమైన అంశాలతో ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. ఇక జానకి ఐపీఎస్ కావాలని అనుకుంటుంది. కానీ కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు.

కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 562 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

Janaki Kalaganaledu Serial 2023 April 26th Episode

మరొక సమస్యలో జానకి: జానకి ఊహించని విధంగా మరొక సమస్యలో ఇబ్బంది పడుతుంది. ఆమెపై పగ తీర్చుకోవడానికి ఒక వ్యక్తి తీవ్రంగా ప్రయత్నం అయితే చేస్తుంటాడు. గతంలో మోహన్ అనే వ్యక్తిని జానకి ఒక అమ్మాయిని ఏడిపించిన కేసులో అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అయితే ఆ విషయంలో మోహన్ జానకి పై పగ పెంచుకుంటాడు.

ఎలాగైనా జానకి పై రివెంజ్ తీర్చుకోవాలి అని అతను జానకి ఇంటి దగ్గరికి వస్తాడు. అయితే అదే సమయంలో జానకి చిన్న మరిది అఖిల్ కొడుకు బారసాల వేడుక జరుగుతుంది. ఆ సమయంలో జానకి బాబును ఎత్తుకొని ఆరు బయటకు వస్తుంది. అయితే ఆ బాబు అప్పుడే వాంతులు చేసుకోవడంతో జానకి అతన్ని బయట ఉన్న సోఫాపై పడుకోబెట్టి చీర శుభ్రం చేసుకోవడానికి వెళుతుంది.

బాబును ఎత్తుకుపోయిన మోహన్: అయితే ఆ విషయాన్ని గమనించిన మోహన్ జానకి ఎత్తుకున్న బాబును కిడ్నాప్ చేయాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత పగ తీర్చుకోవాలని కూడా అతను ఆలోచిస్తాడు. ఇదే క్రమంలో మెల్లగా మోహన్ జానకి పక్కకు వెళ్లగానే ఇంటి లోపలికి వెళ్తాడు. ఇక బాబును మెల్లగా అతను ఎత్తుకొని వెళుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఒక చిన్న పాప కూడా చూస్తుంది.

అయితే మోహన్ మాత్రం ఆమె దృష్టిని మరల్చే విధంగా ఒక చాక్లెట్ ఇస్తాడు. ఇక అక్కడి నుంచి మెల్లగా అతను బాబును తీసుకొని పరారవుతాడు. ఈ క్రమంలో మరోవైపు ఇంట్లో వాళ్ళందరూ కూడా బాబు బారసాల వేడుకను నిర్వహించాలి అనే ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే పెద్దకొడుకు రామచంద్రపై తల్లి జ్ఞానాంబ కూడా ప్రేమ చూపిస్తుంది. ఆమె తన చేతితో ప్రత్యేకంగా పాలు కూడా ఇస్తుంది. ఇక పాలు తాగిన రామచంద్ర తల్లిపై ప్రేమను కూడా చూపిస్తూ ఉంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 April 26th Episode

బాబు ఎక్కడ అంటూ..: ఇక అందరూ కూడా ఆనందంలో మునిగితేలుతుంటారు. ఇక ఇంతలో జెస్సి తల్లి వచ్చి ఇక కార్యక్రమాలు మొదలుపెడదామని అంటుంది. ఇక పంతులుగారు కూడా బాబును తీసుకువస్తే పూజ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి అని అంటాడు. అయితే బాబు ఎక్కడ అని అఖిల్ అడుగుతూ ఉంటాడు. ఇక అందరూ ఊహించిన విధంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.

ఇక వెన్నెల చివరగా బాబుని ఎత్తుకుంది అని జెస్సి చెప్పడంతో నా దగ్గర నుంచి పెద్ద వదిన తీసుకుంది అని చెబుతుంది. అయితే అప్పుడే జానకి వస్తుంది. నేను ఇందాక బాబుని బయట పడుకోబెట్టినప్పుడు నువ్వే తీసుకున్నావు అనుకున్నాను వెన్నెల అని జానకి చెబుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 April 26th Episode

జానకి అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటుంది?: దీంతో ఆ సమాధానానికి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మల్లికా అదే సమయానికి జానకి పై కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉంటుంది. జానకి అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటుంది అని బాబు ఏమయ్యాడో కూడా తర్వాత చూసుకోరా అనే అడుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో అఖిల్ కూడా నా బాబుని ఏం చేశావు వదినా అనే బాధపడుతూ అడుగుతాడు.

అంతేకాకుండా అతను అసహనం కూడా వ్యక్తం చేస్తూ ఉంటాడు. అయితే ఈ సమయంలో మనం ఇలా మాట్లాడుకోకూడదని ముందు బాబును ఎక్కడున్నాడో చూడాలి అని ఎవరైనా ఎక్కడైనా ఇంట్లో పడుకోబెట్టి ఉండవచ్చు కదా అనే అందుకే అందరూ నలువైపులా ఒకసారి వెతకండి అని రామచంద్ర చెబుతాడు.

నా బాబు నాకు కావాలి: దీంతో అందరూ కూడా ఇంట్లో వెతుకుతూ ఉంటారు. కానీ బాబు ఎక్కడ కనిపించడు దీంతో మల్లికా జానకి పై నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది. ఇంతకు ముందు కూడా బాబు విషయంలో జానకి నిర్లక్ష్యంగానే కనిపించింది మళ్ళీ ఇప్పుడు బాబు కనిపియ్యకుండా పోవడానికి కారణమయ్యింది అని చెబుతూ ఉంటుంది. ఇక అఖిల్ కూడా నా బాబు నాకు కావాలి అనే చెబుతాడు. ఇక అందరూ కూడా బయట వెతికినప్పటికీ ఎక్కడా కనిపించడు.

ఎస్ఐ మనోహర్ ఊహించని రియాక్షన్: అయితే అఖిల్ తీవ్ర మనస్తాపంతో మాట్లాడుతూ ఉండడంతో ఒక పాప మాత్రం ఏ బాబు అంకుల్ ఇప్పటిదాకా ఒక వ్యక్తి వచ్చి బాబును తీసుకువెళ్లాడు అని ఆ పాప చెబుతుంది. ఇక జానకి రామచంద్ర వెంటనే ఆ పాపను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ ఆ పాప తల్లి వచ్చి ఎందుకు నా పాపను మళ్లీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలని అనుకుంటున్నారా? అని మా పాపకు ఏమీ తెలియదు అని మాట్లాడుతుంది.

దీంతో మళ్ళీ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక లాభం లేదు అని పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటారు. కానీ అక్కడ ఎస్సై మనోహర్ జానకి పై కోపంతో కనిపిస్తూ ఉంటాడు. మరి ఈ విషయంలో అతను జానకికి ఎలాంటి సమాధానం ఇస్తాడు అసలు బాబును జానకిని తీసుకు వస్తుందా? లేదా అనే విషయం తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X