Janaki Kalaganaledu April 27th: బాబు విషయంలో ఊహించని ట్విస్ట్.. చివరికి జానకిపై అఖిల్ ఆగ్రహం!

జానకి కలగనలేదు సీరియల్ కథ మరో కీలక మలుపు తిరుగుతోంది. ఎంతో ఆసక్తిగా కొనసాగుతోన్న ఈ కథలో జానకి ఐపీఎస్ కావాలని అనుకుంటుంది. కానీ కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు.

కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 563 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

Janaki Kalaganaledu Serial 2023 April 27th Episode 2023

బయట బాబుతో కనిపించడంతో: జానకి తన చిన్న మరిది అఖిల్ కొడుకు బారసాల రోజు ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే బాబును సరదాగా ఎత్తుకొని అలా బయటకు వచ్చిన జానకి కాసేపు సంతోషంగా గడుపుతుంది. అయితే అప్పుడే జానకి పై పగ తీర్చుకోవాలి అని ఒక వ్యక్తి ఇంటికి వస్తాడు. గతంలో జానకి మోహన్ అనే వ్యక్తిని ఒక అమ్మాయిని ఎడిపించినందుకు అరెస్ట్ చేస్తుంది.

ఇక ఆ విషయంలో రివెంజ్ తీర్చుకోవాలి అని మోహన్ ఇంటికి వస్తాడు. ఇక జానకి బయట బాబుతో కనిపించడంతో ఆ బాబును ఎలాగైనా కిడ్నాప్ చేయాలి అని అనుకుంటాడు. ఇక జానకి బాబు కాస్త వాంతు చేసుకున్నాడు అని అతన్ని బయట బెడ్ పై పడుకోబెట్టి శుభ్రం చేసుకోవడానికి వెళుతుంది. అప్పుడే మోహన్ వచ్చి ఆ బాబును తీసుకుని వెళ్ళిపోతాడు.

Janaki Kalaganaledu Serial 2023 April 27th Episode 2023

ఇదంతా కూడా జానకి వల్లే జరిగింది: ఇక తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకసారి టెన్షన్ పడతారు. ఇదంతా కూడా జానకి వల్లే జరిగింది అని అఖిల్ తో పాటు మల్లికా కూడా కావాలని ఆమెని టార్గెట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మల్లికా అయితే జానకి ఇదివరకే చాలాసార్లు పొరపాటు చేసింది అని ఇప్పుడు మరోసారి బాబు విషయంలో ఆమె నిర్లక్ష్యం చేసింది అని చెబుతుంది.

చివరికి జానకి రామచంద్ర ఇద్దరు కూడా బాబు విషయంలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ ఎస్ఐ మనోహర్ మాత్రం జానకి విషయంలో కాస్త ముందుగానే సీరియస్ గా ఉంటాడు. ఇక ఆమె అప్పుడు రావడంతో అతను బిల్డర్ తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఎలాగైనా జానకిని అడ్డుకోవాలి అని వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.

Janaki Kalaganaledu Serial 2023 April 27th Episode 2023

ఎస్ఐ మనోహర్ మాత్రం ఏమీ పట్టనట్లుగా: ఇక జానకి తన భర్తతో కలిసి బాబు మిస్సయిన విషయం గురించి చెబుతూ ఉంటారు. అయితే ఎస్ఐ మనోహర్ మాత్రం ఏమీ పట్టనట్లుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి అని ఆ తర్వాత మేము వెతికి పెడతాము అని చెబుతారు. ఇక బాబు గురించే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జానకీ పాత క్రిమినల్ వివరాలు అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది.

కానీ ఎస్ఐ మనోహర్ మాత్రం నువ్వు ఇప్పుడు డ్యూటీలో లేవు అని నీకు ఇష్టం ఉన్నట్లు చేయడానికి వీలు లేదు అని చెబుతాడు. అంతేకాకుండా కొంతమంది కానిస్టేబుల్స్ ని అయినా కనీసం వెతకడానికి పంపించాలి అని జానకి సహాయము అడిగినప్పటికీ కూడా మనోహర్ ఆమె మాట ఏమాత్రం వినడు. ఇక రామచంద్ర కొంత సీరియస్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో జానకి రామచంద్రను కంట్రోల్ చేస్తుంది.

Janaki Kalaganaledu Serial 2023 April 27th Episode 2023

బాబు దొరుకుతాడేమో అని: ఆ తర్వాత ఏమి చేసేది ఏమి లేక జానకి తన భర్తను తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. అయితే ఇంట్లో అందరూ కూడా బాబు దొరుకుతాడేమో అని ఎంతగానో ఆరట పడుతూ ఉంటారు. ఇక మల్లిక అయితే జానకి గురించి పదేపదే తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో జెస్సీ తల్లి కూడా ఇంట్లో ఉండవద్దని నేను ముందే చెప్పాను అయినా నువ్వు నా మాట పట్టించుకోలేదు అని మాట్లాడుతూ ఉంటుంది.

ఇక జానకి విషయంలో తప్పుగా మాట్లాడవద్దు అని గోవిందరాజులు చెబుతూ ఉంటాడు. ఇక అఖిల్ కూడా జానకి పై తీవ్ర స్థాయిలో కోపంగా ఉంటాడు. ఇక అప్పుడే జానకి రామచంద్ర ఇద్దరు కూడా కాళీ చేతులతో రావడంతో నా బాబు ఎక్కడ అని అఖిల్ మరోసారి సీరియస్ గా అడుగుతాడు.

Janaki Kalaganaledu Serial 2023 April 27th Episode 2023

జానకి పై అఖిల్ సీరియస్: ఇదంతా మీ వల్ల జరిగింది అంటూ జానకి పై అఖిల్ మండిపడుతూ ఉంటాడు. అయితే గోవిందరాజులు అతని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ.. పోయింది నా బాబు కదా మీకు ఎందుకు బాధ ఉంటుంది అని.. నా బాబు దొరక్కపోతే నీ మీద పోలీస్ కంప్లైంట్ నేను ఇస్తాను అని అతను మరింత కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే మరోవైపు బాబును మోహన్ ఎత్తుకుపోగా అతను చివరికి ఒక ఖాళీ స్థలంలో పెడతాడు.

అయితే అక్కడ ఒక అడుక్కునే మహిళ ఆ బాబును చూసి ఎత్తుకుంటుంది. చివరికి నేను పెంచుకుంటాను అని ఆమె అనుకుంటూ బాబును తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో ఇంట్లో వాళ్ళు అందరూ కూడా బయట బాబును వెతకాలని ప్రయత్నం చేస్తారు. ఒకచోట అఖిల్ వెతుకుతూ ఉండగా.. అప్పుడే ఆడుక్కునే మహిళ వచ్చి బాబుకు పాలు పట్టాలని డబ్బులు ఇవ్వాలి అని అడుగుతుంది. కానీ అతను మాత్రం ఆమెను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నా టెన్షన్ లో నేను ఉన్నాను అని అంటాడు. మరి చివరికి అతను తన కొడుకుని చూస్తాడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X