Janaki Kalaganaledu April 28th: అఖిల్ కొడుకును కనిపెట్టిన జానకి.. చివరి క్షణంలో ఊహించని ట్విస్ట్!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు సరికొత్త ట్విస్ట్ లతో ఎంతో ఆసక్తిగా మారుతోంది. జానకి ఐపీఎస్ కావాలని అనుకుంటుంది. కానీ కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. కానీ రామను మనోహర్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 565 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.

నా బాబు నాకు కావాలి:అఖిల్ కొడుకు బారసాల రోజు అందరూ ఆనందంగా ఉన్న సమయంలోనే బాబు కనిపించకుండా పోతాడు. జానకి పొరపాటు వలన బాబు ఎవరో బాబును ఎత్తుకుపోయారు అని అందరూ కూడా ఎంతో ఆగ్రహంతో ఉంటారు. జానకి పై పగతోనే మోహన్ అనే వ్యక్తి బాబును తీసుకువెళ్లే ఒక దగ్గర పెట్టి పారిపోతాడు. ఆ తరువాత బాబు అడుక్కునే ఒక మహిళకు దొరుకుతాడు. ఇక బాబు ఎక్కడికి వెళ్లాడు ఎక్కడ ఉన్నాడు అని తెలియక ఇంట్లో వాళ్ళు అందరు కూడా సతమతమవుతుంటారు. ఇక తల్లి జెస్సి అయితే నా బాబు నాకు కావాలి అని అందరిని బ్రతిమాలుతుంది. ఇక ఆ సమయంలో అఖిల్ జానకి పై అసహనం వ్యక్తం చేస్తూ ఉండడంతో ఇప్పుడు గొడవలు పడాల్సిన సమయం కాదు అని వెంటనే బాబును తీసుకురావాలి అని జెస్సి మాట్లాడుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 April 28th Episode 565

బాబు ఏడుస్తూ ఉండడంతో..:ఇక అఖిల్ ముందుగా బయటకు వెళ్లి వేతకాలని అనుకుంటాడు. ఇక తర్వాత జానకి జెస్సి కి క్షమాపణలు చెప్పి బాబును వెతకడానికి ఆమె కూడా భర్తతో కలిసి బయటకు వెళుతుంది. ఈ క్రమంలో వాళ్లు రోడ్డుపై వెళ్లే వాళ్లందరినీ కూడా బాబు గురించి అడుగుతూ ఉంటారు. కానీ ఎవరు కూడా సరైన సమాధానం చెప్పరు. అయితే అప్పుడే బాబును ఎత్తుకొని అడ్డుకునే మహిళ అఖిల్ దగ్గరకు వస్తుంది. అయితే అఖిల్ మాత్రం ఆమెను గమనించడు. బాబు ఏడుస్తూ ఉండడంతో కాస్త పాలు కొనాలి అని డబ్బు ఉంటే ఇవ్వమని ఆమె అడుగుతుంది. కానీ అఖిల్ మాత్రం బాబుని చూడకుండా అక్కటినుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ మహిళ బాబుని ఎత్తుకొని ముందుకు కొనసాగుతూ ఉంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 April 28th Episode 565

తన వల్లే తప్పు జరిగింది అని..:అయితే అతను బాబు గురించి వెతుకుతున్నాడు అని తెలుసుకున్న మహిళ మళ్ళీ వెనక్కి వచ్చి అఖిల్ను కలవాలని అనుకుంటుంది. కానీ అఖిల్ అప్పటికే కనిపించకుండా బైక్ పై వెళ్లిపోతాడు. ఇక మరోవైపు రామచంద్ర జానకి ఇద్దరు కూడా అన్ని వీధుల్లో కూడా బాబు కోసం వెతుకుతూ ఉంటారు. తన వల్లే తప్పు జరిగింది అని బాబు లేకుండా ఇంటికి వెళితే నన్ను ఎవరు క్షమించరు అని జానకి బాధపడుతూ ఉంటుంది. ఇక రామచంద్రా ధైర్యం చెబుతూ తప్పకుండా బాబు దొరుకుతాడు అని మీరు అటువైపు వేతకండి నేను ఇటువైపు వెతుకుతాను అని అంటాడు.

Janaki Kalaganaledu Serial 2023 April 28th Episode 565

ఆ బాబు కోసం పాలు కొనాలని..:ఇక ఒక మహిళ అక్కడ బాబును ఎత్తుకొని ఉండడంతో జానకి చూసి బాబు ఎందుకు ఏడుస్తున్నాడు పాలు పట్టవచ్చు కదా అని అడుగుతుంది. అయితే ఆ మహిళా మాత్రం నాకు ఆ విషయం తెలుసులే అని చెబుతుంది. ఇక జానకి మళ్ళీ వెనక్కి వెళ్లి ఆ బాబు కోసం పాలు కొనాలని అనుకుంటుంది. కానీ అతనే అఖిల్ కొడుకు అని ఆమె గ్రహించదు. ఇక మరోవైపు ఇంట్లో అందరూ కూడా బాబు కోసం బాధపడుతూ ఉంటారు. జానకి వల్లే ఈ తప్పులు జరిగాయని.. ఎవరు మీద కోపం ఎవరిమీద ఎవరు చూపించారో అర్థం కావడం లేదు అని అసలు బాబును ఎత్తుకుపోవాల్సిన అవసరం ఎవరికి వచ్చి ఉంటుంది అని మల్లిక తప్పుగా మాట్లాడుతుంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 April 28th Episode 565

దొరికిన అఖిల్ కొడుకు:ఈ క్రమంలో జ్ఞానాంబ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అసలు మన వంశంలో ఏదో అపశకునం ఉంది అని వారసుడు కలిసి రావడం లేదు అని ఆమె బాధ పడుతూ ఉంటుంది. ఇక కళ్ళు తిరిగి పడిపోవడంతో గోవిందరాజులు వెంటనే టాబ్లెట్స్ ఇస్తాడు. తప్పకుండా బాబు దొరుకుతాడు అని నువ్వు టెన్షన్ పడకు అని ధైర్యం చెబుతాడు. ఇక మరోవైపు జానకి పాలు తీసుకువచ్చి ఆ మహిళకు ఇస్తుంది. అయితే అక్కడ ఆ బాబుపై జానకికి అనుమానం వస్తుంది. బహుశా ఇతను అఖిల్ కొడుకు అయి ఉండవచ్చు అని ఆమె ఒకసారి చూస్తుంది. ఇక అతను మా బాబే అని చెప్పి ఆమె తీసుకుంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 April 28th Episode 565

జానకిపై కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమైన అఖిల్:ఈ బాబు నీకు ఎక్కడ దొరికాడు అని ఆ మహిళ అడగడంతో ఒకచోట పడిపోయి ఉండడంతో నేను తీసుకున్నాను అని అంటుంది. ఆమెకు కృతజ్ఞతలు చెప్పి జానకి రామచంద్ర ఇంటికి బయలుదేరుతారు. అయితే అదే సమయంలో అఖిల్ ఇంటికి వచ్చి బాబు దొరకలేదు అని చెప్పడంతో జెస్సి ఒక్కసారిగా తల్లడిల్లిపోతుంది. అయితే జానకి పై పోలీస్ కేసు పెట్టాలి అని అతను బయలుదేరుతాడు. ఇక ఇంతలోనే జానకి బాబును తీసుకువస్తుంది. దీంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ క్రమంలో అఖిల్ పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి సిద్ధమైనట్లు వెన్నెల జానకికి చెబుతుంది. ఇక విషయాలను మర్చిపోదామని జానకి చెబుతుంది. ఇక ఆ ఘటన నుంచి బయటకు వచ్చాక మరోవైపు అల్ కోడలికి మల్లెపూలు మామిడి పండ్లు ఇస్తుంది. ఇది రామచంద్ర కు ఇవ్వు అని చెబుతోంది. మరోసారి కొడుకు కోడలి కోసం ఆమె శోభనం ఏర్పాట్లు చేసినట్లు అర్థమవుతుంది. ఇక జానకి భవిష్యత్తు ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X