Janaki Kalaganaledu April 3rd: ఉద్యోగం కారణంగా జానకి ఇంట్లో గొడవలు.. కోడలిపై జ్ఞానాంబ సీరియస్
జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన ఎమోషన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. మళ్ళీ ఐపీఎస్ పరీక్షలు రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 541 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

వెంటనే సీరియస్
ఒక యువకుడు అమ్మాయిని అనవసరంగా ఏడిపిస్తున్నాడు అని జానకి ఇంటికి ఒక కంప్లైంట్ వస్తుంది. ఒక తల్లి వచ్చి మా అమ్మాయిని ఒక వ్యక్తి ఏడిపిస్తున్నాడు అని చెప్పడంతో జానకి వెంటనే సీరియస్ అవుతుంది. ఇక అతన్ని పట్టుకొని రోడ్డు మీద కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకువస్తుంది.
అయితే ఈ క్రమంలో మనోహర్ మరోసారి జానకి పని తీరుకు అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నట్లుగా ఏవైనా సాక్షాలు ఉన్నాయా? అని అనేక రకాల ప్రశ్నలు అడుగుతాడు. ఇక్కడ నేను ఎస్ఐనే ఉన్నాను అని విషయాన్ని కూడా గుర్తించాలి అని అనవసరంగా నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోకూడదు అని జానకిని సీరియస్ అవుతూ ఉంటాడు.

మనోహర్ కు కౌంటర్
అయితే జానకి ఒకవైపు రౌడీని తిడుతునే, ఎస్ఐ మనోహర్ కు కౌంటర్ ఇస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. అతను నిజం ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొడతాను అని వార్నింగ్ ఇస్తుంది. అయితే ఈ క్రమంలో ఎస్ఐ మనోహర్ ఇక్కడ తాను చెప్పినట్లుగానే నడవాలి అని మాట్లాడుతూ ఉంటాడు.

మల్లిక జాతకం గోల
ఇక మరోవైపు ఇంటిదగ్గర మల్లిక ఉగాది పంచాంగం చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఈసారి కూడా నా జాతకం ఏమాత్రం బాగోలేదు అని ఆదాయం కన్నా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి అని రాజపూజ్యం అసలే లేదు అని ఆవేదన చెందుతూ ఉంటుంది. ఇక ఇంట్లో పని చేసే మలయాళం మల్లిక దగ్గరికి వచ్చి అనవసరంగా ఎందుకు బాధపడుతున్నారు అంటూ ఆమెపై సెటైర్లు వేస్తూ ఉంటాడు.

అనవసరంగా బాధపడుతున్నారు
అయినా అవమానం అనేది ఫీల్ అయితే ఉంటుంది కానీ మీరు ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా పట్టించుకోరు కదా ఎందుకు అనవసరంగా బాధపడుతున్నారు. అంటూ ఆమెపై జోకులు వేస్తూ ఉంటాడు. ఇక మల్లికా అతనిపై కాస్త సీరియస్ అవుతుంది. అంతేకాకుండా నువ్వు నాకు జాతకం చెప్పావు కాబట్టి నీకు డబ్బులు ఇస్తాను అంటూ రెండు రూపాయల చేతులు పెడుతుంది. ఇక ఆ రెండు రూపాయలు చూసిన మలయాళం మల్లికపై కోపంగా చూస్తూ ఈ రెండు రూపాయలు మీరే ఉంచుకోండి అని చెబుతాడు. ఇక తర్వాత అతని వెంటపడి కొట్టే ప్రయత్నం చేస్తుంది.

విషయం మరోలా ఉండేది
అయితే మరోవైపు రామచంద్ర స్వీట్ బండి దగ్గర తన వ్యాపారం చూసుకుంటూ ఉండగా అంతలోనే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు అక్కడ స్వీట్ కొట్టుకు జానకి ఫోటో ఉండడం చూసే దాన్ని కింద పడేస్తాడు. ఎందుకు బాబాయ్ అలా పడేసావు అని అడిగినప్పటికీ కూడా మీ భార్య ఇక్కడ ఉండి ఉంటే విషయం మరోలా ఉండేది అని అతను సీరియస్ అవుతూ ఉంటాడు. మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు రావా ఎవరూ తప్పులు చేయరా అని అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు.

మీ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టను
అయితే మరోవైపు నుంచి గోవిందరాజులు జ్ఞానాంబ కూడా అటువైపుగా వెళుతూ ఉండడంతో జరిగే గొడవను చూస్తూ ఉంటారు. వెంటనే అక్కడికి వెళ్లి విషయం గురించి అడిగే ప్రయత్నం చేస్తారు. తన కొడుకును మీ జానకి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్లింది అని నాకు ఎంత అవమానంగా ఉంటుంది అని అతను ప్రశ్నిస్తాడు. ఈ కారణంగా నా కొడుకు ఏదైనా ఆగాయిత్యం చేసుకుంటే ఆ తర్వాత మీ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టను అంటూ అతను హెచ్చరిక చేసి వెళ్ళిపోతాడు.
తప్పు చేసినట్లు ఒప్పుకున్న జానకి
అయితే జానకి అలా చేయడంతో మల్లిక ఇంట్లో వాళ్లకి కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉంటుంది. నేను అప్పటికి చెబుతూనే ఉన్నాను ఈ పోలీస్ ఉద్యోగం కూడా వద్దు అని కానీ జానకి ఇంట్లో కూడలి బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తుంది అన్నట్లుగా ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే జానకి రాగానే ఏదో ఒకటి తేల్చేలా మాట్లాడాలి అని తన మామగారికి అత్తగారికి చెబుతూ ఉంటుంది.
ఇక జానకి రాగానే అత్తగారు కూడా నువ్వు చేసిన పని ఏమాత్రం బాగోలేదు. పరువు పోయే అవకాశం ఉంది అని చెబుతుంది. దీంతో జానకి మొదట ఆ తిట్టిన వ్యక్తికి హెచ్చరిక ఇవ్వాలి అని అనుకుంటుంది. కానీ అత్తగారు చెప్పిన మాటలకు ఏమి మాట్లాడకుండా తప్పు జరిగిందని క్షమించండి అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. మరి ఈ ఉద్యోగం విషయంలో ఎలాంటి ఆటు పోట్లు ఎదురవుతాయి? జానకి భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











