Janaki Kalaganaledu April 4th: వారి సరసాలు చూసి మల్లికలో మరో కోరిక.. జానకిపై నిందలు!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 541 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

న్యాయంగా ఉన్నప్పటికీ..
జానకి ఎంతో న్యాయంగా తన పోలీస్ డ్యూటీ చేస్తున్నప్పటికీ కూడా కుటుంబ పరిస్థితులు ఆమెకు అనుకూలించవు. ఒక అమ్మాయిని ఏడిపిస్తున్న వ్యక్తిని ఆమె అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకు వెళుతుంది. అయితే ఆ వ్యక్తి తండ్రి వచ్చి రామచంద్ర కు హెచ్చరిక చేస్తాడు. నా కొడుకు అవమానంతో ఏదైనా ఆత్మహత్యాయత్నం చేసుకుంటే దానికి మీరే బాధ్యులు అని ఆ తర్వాత ఎవరిని వదిలిపెట్టను అని అంటాడు.
అయితే ఆ జరుగుతున్న గొడవను జ్ఞానాంబ అలాగే గోవిందరాజులు కూడా చూస్తారు ఇక వాళ్ళిద్దరు ఇంటికి రాగానే కోడలిని ఆ విషయంలో ప్రశ్నించాలని అనుకుంటారు. ముఖ్యంగా జ్ఞానాంబ ఒక సీరియస్ హెచ్చరిక అయితే చేస్తుంది.

బాధపడుతున్న జానకి
నీ కారణంగా ఈరోజు ఇంటి పరువు తగ్గకూడదు అనే అనుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి అని ఒక వ్యక్తి రామచంద్రను అలా తిడుతూ ఉంటే ఏమి అనలేని పరిస్థితుల్లో ఉండి పోయాము అని అత్తగారు చెబుతారు. ఇక ఆమె అలా చెప్పడంతో జానకి కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది.
ఇక తర్వాత ఆమె గదిలోకి వచ్చి ఎంతో దీనంగా కూర్చుండిపోతుంది. ఇక అప్పుడే వచ్చిన రామ జానకి చాలా బాధపడుతూ కనిపించడంతో తట్టుకోలేక పోతాడు. వెంటనే ఏం జరిగింది అని అడుగుతాడు. నా వల్లే మీకు ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి అని అది నన్ను తీవ్రంగా కలచివేస్తుంది అని ఆమె బాధ పడుతూ ఉంటుంది.

గొడవలు పట్టించుకోవద్దు
అయితే ఇలాంటి డ్యూటీలో ఇవన్నీ సహజమని అతను తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ విధంగా మాట్లాడాడు అని వీటిని పట్టించుకోవద్దు అని అతను ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా మీరు ఏమి పట్టించుకోకుండా వెళ్లే స్నానం చేసి రండి అని అంటాడు. ఇక జానకి కోసం రామచంద్ర ప్రత్యేకంగా మల్లెపూలు కూడా తెస్తాడు.
ఇక వాటిని కట్టుకోవాలి అని ఈరోజు మీరు డ్యూటీకి వెళ్ళకూడదు అని మనం ఇంట్లో చాలా హ్యాపీగా సంతోషంగా ఉందామని అంటాడు. కానీ జానకి మాత్రం అందుకు ఒప్పుకోదు. సరదాగా నవ్వుతూ రామచంద్రను ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అత్తగారు పిలవడంతో ఆమె తొందరపాటులో బయటకు వెళ్ళిపోతుంది.

వారి సరసాలు చూసిన మల్లిక
అయితే రామచంద్ర జానకి సరసాలు చూసిన మల్లికా కూడా తనలో అలాంటి కోరికలు పుడతాయి. వెంటనే తన భర్త దగ్గరకు వెళ్లి అదే తరహాలో రొమాన్స్ చేయాలని అనుకుంటుంది. ఇక జడలో మల్లెపూలు పెట్టుకుని విష్ణు దగ్గరికి వెళ్లిన మల్లిక నేను ఎంత అందంగా ఉన్నాను అంటూ అడుగుతుంది. ఇక విష్ణు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోడు తనకు పనులు ఉన్నాయని చెబుతూ ఉంటాడు.
ఇక మీరు ఇలా మౌనంగా ఉంటే కష్టమని.. ఇప్పటికే మీ చిన్న తమ్ముడు ఒక గదిలో నుంచి ఒక బాబు శబ్దం వినిపిస్తోంది అలాగే మరోవైపు మీ అన్నయ్య వదిన రేపు మరో పిల్లాడినో పాపనో కనేలా ఉన్నారు. కానీ మనం మాత్రం ఇలానే ఉండిపోతున్నామని వీలైనంత త్వరగా మనం పిల్లలను కనాలి అని మల్లికా చెబుతూ ఉంటుంది.

ఎంత చెప్పినా కూడా..
అయితే మల్లికా ఎంత చెప్పినా కూడా విష్ణు ఆమె మాటలు పట్టించుకోకుండా పిల్లలు ఉండి ఏం లాభం అని ఇప్పుడు మా అమ్మ నాన్నలను మేము ఏమైనా సరిగ్గా చూసుకుంటున్నామా అని ఆమెకు సమాధానం చెబుతాడు. దీంతో మల్లికా వెంటనే అందరి పరిస్థితిలు అలా ఉండవు అని చెబుతుంది. ఇక ఆ తర్వాత విష్ణు మాటలకు ఆమె పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోతుంది.
అయితే మరోవైపు చిన్న కోడలు జెస్సి తన బాబును ఇంట్లో ఆడిస్తూ ఉంటుంది. ఇక బాబు ఏడుస్తూ ఉండడంతో లోపలికెళ్ళి పాలు తీసుకురావాలని అనుకుంటుంది. అయితే ఆమె ముందుగా డబ్బాలో పూసుకొచ్చిన పాలు విరిగిపోతాయి. అవి తాపితే మంచిది కాదు అని ఆమె ఇంట్లో ఉన్న మలయాళం చెబుతుంది.
జనకిపై నిందలు
ఇక బాబును చూసుకో నేను ఇప్పుడే మళ్లీ పాలు తీసుకొని వస్తాను అని ఆ డబ్బా అక్కడి పెట్టి జెస్సి వంటగదిలోకి వెళ్తుంది. ఇక అప్పుడే మలయాళంను జ్ఞానాంబ పిలుస్తుంది. ఇక బాబును అక్కడ సోఫాలో పడుకోబెట్టి అతను వెళ్ళిపోతాడు. ఇక బాబు ఒంటరిగా ఏడుస్తూ ఉండడంతో అప్పుడే జానకి వచ్చి బాబుని ఎత్తుకుంటుంది. పాల కోసం ఏడుస్తూ ఉండవచ్చు అని పక్కనే ఉన్న పాల డబ్బా తీసుకొని అతనికి పట్టించాలని అనుకుంటుంది.
అయితే అవి విరిగిపోయిన పాలు అని ఆమెకు తెలియదు. ఇక వెంటనే మల్లిక వచ్చి.. కావాలని జానకి పై నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది. కావాలని జానకి బాబుపై పగ పట్టింది అని నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చి ఉంటే ఈ పాలు తాపేది అని మల్లికా అనవసరమైన నిందలు వేస్తూ ఉంటుంది. ఇక జానకి నేను అలాంటి తప్పు చేయాలని అనుకోలేదు అని ఎంత చెప్పినా కూడా అఖిల్ కూడా వినకుండా తప్పుగా మాట్లాడుతుంటాడు. మరి ఈ పరిస్థితులను జానకి ఇలా ఎదుర్కొంటుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.


Click it and Unblock the Notifications











