Janaki Kalaganaledu April 5th: మరో మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్.. సందిగ్ధంలో పడిన జానకి!
జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన ఎమోషన్స్ తో ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 545 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

సమయం చూసి
మల్లిక సమయం చూసి మరోసారి జానకిని టార్గెట్ చేస్తుంది. ఆమె కావాలని అఖిల్ కొడుకుకు విరిగిపోయిన పాలు తాగించాలని అనుకుంది అన్నట్లుగా నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది. అయితే అవి విరిగిపోయిన పాలు అని తనకు తెలియదు అని చూసుకోలేదు అని.. తెలిస్తే అలాంటి తప్పు నేను ఎందుకు చేస్తాను అని జానకి అడుగుతుంది.
కానీ మల్లిక మాత్రం ఆమె కావాలని తప్పు చేసింది అని అంటుంది. దీంతో జానకి ఒక్కసారిగా బాధపడిపోతుంది. అంతే కాకుండా అఖిల్ కూడా జానకిని తప్పుపడుతూ ఉంటాడు. అయితే రామచంద్ర సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అఖిల్ ఏమాత్రం కంట్రోల్ కాడు. ఇక మరోసారి నువ్వు బాబుని ఇలా ఒంటరిగా వదిలేయకు అంటూ తన భార్య పై కోప్పడుతూ ఉంటాడు.

బాధలో జానకి
ఇక ఆ సమయంలో గోవిందరాజులు జ్ఞానాంబ కూడా ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతారు. అయితే జానకి బాబుని జెస్సికి ఇచ్చేసి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆమె పరిస్థితిని చూసిన రామచంద్ర ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా ప్రత్యేకంగా టిఫిన్ ఆమె కోసం తీసుకువస్తాడు. మీరు ఈ టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్లాలి అని అంటాడు.
తను కావాలని తప్పు చేయలేదు అని జానకి చెబుతుంది. అయితే పొరపాట్లు జరుగుతాయి అని అంతమాత్రాన ఈ విధంగా బాధపడాల్సిన అవసరం లేదు అని అంతేకాకుండా మీరు ఒక పోలీస్ అని ఇలాంటి తప్పులు మీ డ్యూటీలో జరిగితే రేపు డ్యూటీని వదిలేస్తారా అని అర్థమయ్యేలా చెబుతాడు. దీంతో జానకి మళ్ళీ ఏమనకుండా రామచంద్ర చెప్పినట్టుగా వినే ప్రయత్నం చేస్తుంది.

మనోహర్ ఫోన్ కాల్
ఇక ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్ళగానే అక్కడ ఆమె తోటి కానిస్టేబుల్ ఎస్సై గారు ఒక పని చెప్పారని అంటుంది. మనం వెంటనే బ్యాంకు రాబరీకి సంబంధించిన కేసు విషయంలో బయటకు వెళ్లాలి అని ఎస్ఐ గారు చెప్పినట్లుగా ఆమె చెబుతుంది. అయితే ఇంతలో ఎస్ఐ ఫోన్ చేసి నా టేబుల్ మీద ఒక ఫైల్ ఉంటుంది వెంటనే నేను చెప్పిన చోటుకు తీసుకురావాలి అని చెబుతాడు. జానకికి ఇచ్చే పంపించాలని కూడా ఎస్ఐ మనోహర్ చెప్పడంతో ఆమె సరే అంటుంది.

చాలా సంతోషంగా
ఇక మరోవైపు ఇంట్లో మల్లిక చాలా సంతోషంగా ఉంటుంది జానకి పై రివెంజ్ తీర్చుకోవడంతో వంటగదిలోకి వచ్చి పనిచేసే మలయాళం ముందు ఆనందంగా మాట్లాడుతూ ఉంటుంది. నాకు గులాబ్ జాములు కావాలి అని ఈ సంతోషాల సమయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటుంది. ఇక మలయాళం మాత్రం మల్లిక చేసింది కరెక్ట్ కాదు అన్నట్లుగానే ఆమెకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అయితే జానకి చేసిన తప్పులు నీకు కూడా భాగం ఉంది అని మల్లికా మరొక విధంగా మాట్లాడడంతో అతను భయపడతాడు.

మల్లికను టార్గెట్ చేస్తూ
ఇక ఇంతలో గోవిందరాజులు అక్కడికి వచ్చి వారు మాట్లాడుకున్న విధానానికి కౌంటర్ గా మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యంగా మల్లికను టార్గెట్ చేస్తూ అనేక రకాలుగా కౌంటర్ ఇస్తాడు. మలయాళంను చూసి మల్లికను తిడుతూ ఉంటాడు. ఇక మల్లిక మాత్రం మామగారు ఇన్ డైరెక్ట్ గా నన్నే తిడుతున్నారు అన్నట్లుగా గ్రహిస్తుంది. ఇక తర్వాత గోవిందరాజులు ఫినిషింగ్ టచ్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలకు మల్లికా కొంత ఆ అసహనం గా ఫీల్ అవుతుంది.
నిర్లక్ష్యం చేస్తామా?
ఇక జ్ఞానంబా జెస్సి కొడుకుకు పోలియో చుక్కలు వేయించాలి కదా అని తీసుకువెళ్తాను అని చెబుతుంది. నేను రామ కలిసి బాబుని తీసుకువెళ్లి పోలీయో చుక్కలు వేస్తాము అని చెప్పడంతో జెస్సి కాస్త కంగారుపడుతుంది. ఎందుకంటే అఖిల్ కు ఈ విషయం తెలిస్తే మళ్లీ తన మీద కోప్పడతాడు అని ఉంటుంది.
అయితే అఖిల్ కు ఈ విషయం తెలియనివ్వకూడదు అని మన కారణంగా బాబు ని నిర్లక్ష్యం చేస్తామా? అని రామచంద్ర అనుకుంటూ ఉంటాడు. ఇక జెస్సి కూడా రామచంద్ర చెప్పిన మాటలకు బాబుని అతని చేతికి ఇస్తుంది. ఇక దూరం నుంచి మల్లిక చూస్తుంది.

మర్థర్ కేసులో..
ఇక మరోవైపు జానకి తన పోలీస్ డ్యూటీలో చాలా బిజీగా ఉంటుంది. ఇక మొత్తానికి ఎస్ఐ మనోహర్ చెప్పిన చోటికి ఫైల్ తీసుకొని వెళుతుంది. పక్కనే ఉన్న బిల్డింగ్ పై ఫ్లోర్ కి రావాలి అని చెప్పడంతో జానకి మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళుతుంది. జానకి మూడో ఫ్లోర్ కి రాగానే అక్కడ ఒక మర్డర్ జరుగుతుంది. ఒక వ్యక్తి కత్తితో మరో వ్యక్తిని పొడవడం జానకి చూస్తుంది. వెంటనే ఎస్ఐ కి ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది.
అయితే మర్డర్ చేసిన వ్యక్తిని తాను చూసాను అని అతను మరెవరు కాదు అని మీకు బాగా తెలిసిన వ్యక్తి బిల్డర్ మధు అని జానకి చెబుతుంది దీంతో ఒక్కసారిగా మనోహర్ కూడా షాక్ అవుతాడు. అయితే ఈ విషయాన్ని బయటకు ఎవరికి చెప్పవద్దు అని వెంటనే ఆంబులెన్స్ కి ఫోన్ చేసి అతన్ని హాస్పిటల్ కు తీసుకు వెళ్లాలని అంటాడు. అంతే కాకుండా ఈ విషయం ఎక్కడ లీక్ చేయకూడదని అంటాడు. మరి జానకి ఈ కేసు విషయంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











