Janaki Kalaganaledu April 6th: హత్య కేసులో జానకి కీలక నిర్ణయం.. దారుణంగా ఆలోచించిన మనోహర్

జానకి కలగనలేదు సీరియల్ ఊహించని ట్విస్ట్ లతో ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 546 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

హత్య జరగడంతో..: ఎస్ఐ మనోహర్ జానకిని నేమ్ ఒక బిల్డింగ్ దగ్గరికి రమ్మని చెబుతాడు. అక్కడికి తనకు కావాల్సిన ఫైల్ తీసుకొని రమ్మని చెప్పడంతో జానకి అక్కడికి తొందరగానే వస్తుంది. అయితే తాను ఒక బిల్డింగ్ పైన ఉన్నాను అని నువ్వు వెంటనే మెట్లు ఎక్కి రావాలి అని లిఫ్ట్ పనిచేయడం లేదు అని చెబుతాడు. దీంతో జానకి ఎస్ఐ మనోహర్ చెప్పిన విధంగానే మెట్లు ఎక్కుతూ పైకి వెళుతూ ఉంటుంది. ఈ క్రమంలో మూడో ఫ్లోర్లో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కత్తితో పొడిచిన సంఘటన కనిపిస్తుంది. దీంతో వెంటనే జానకి అతని దగ్గరికి వెళ్లి పట్టుకోవాలని అనుకుంటుంది.

Janaki Kalaganaledu Serial 2023 April 6th Episode

ఫోన్ చేసిన జానకి: కానీ అప్పటికే హంతకుడు పారిపోతాడు. అయితే బాధితుడు అక్కడ రక్తంతో తడిసి ఉండడంతో జానకి వెంటనే ఎస్ఐ మనోహర్ కు ఫోన్ చేస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేశారు అని మీరు వెంటనే రావాలి అని చెబుతోంది. దీంతో ఎస్ఐ మనోహర్ అక్కడికి వస్తాడు ఎవరు అతన్ని పొడిచారు అని అడగగానే మీకు తెలిసిన బిల్డర్ ఈ విధంగా పొడిచాడు అని జానకి చెప్పడంతో అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు.

బయటకు లీక్ చేయకూడదు : అయితే ఈ విషయాన్ని నువ్వు ఎక్కడ బయటకు లీక్ చేయకూడదు అని ముందుగానే ఎస్ఐ మనోహర్ జానకి కి చెబుతాడు. ఇక జానకి కూడా అందుకు సరే అని చెబుతోంది. జానకి అతన్ని హాస్పిటల్కు తీసుకు వెళుతుంది. అయితే ఆ క్రమంలో అప్పుడు హాస్పిటల్ కు జానకి అత్తగారు అలాగే భర్త కూడా వస్తారు. వాళ్ళు అఖిల్ కొడుకుకు పోలియో చుక్కలు వేయించాలని అనుకుంటారు. ఈ క్రమంలోని జానకి అక్కడ ఒక వ్యక్తిని తీసుకు వస్తున్న విధానాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా జ్ఞానాంబ, జానకి ఆ విధంగా రక్తంతో చేతులతో తడిసి ఉండడంతో ఈ పరిస్థితి ఏంటి నీకు అని అడుగుతుంది.

Janaki Kalaganaledu Serial 2023 April 6th Episode

నిజం చెప్పకుండా..: ఇక జానకి అలాంటిదేమీ లేదు అని అసలు నిజం చెప్పకుండా అతనికి యాక్సిడెంట్ అయింది అని చెబుతోంది. ఇక రామచంద్ర తన తల్లిని ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు. అయితే మరోవైపు ఎస్ఐ మనోహర్ బిల్డర్ తో మంతనాలు జరుపుతూ ఉంటాడు. నువ్వు హత్య చేసిన సంఘటన మాకు లేడి కానిస్టేబుల్ చూసింది అని ఈ సమయంలో నువ్వు ఏం చేయాలో నీకు తెలుసు కదా అని అంటాడు. ఇక తనకు 50 లక్షలు ఇవ్వాలి అని కూడా ఎస్ఐ మనోహర్ అతనితో డీలింగ్ మాట్లాడుకుంటాడు. అందుకు బిల్డర్ కూడా ఓకే అని చెబుతాడు. ఇక బిల్డర్ మాత్రం జానకి పై బాగా పెంచుకుంటాడు.

బాధితుడని రక్షించాలి : ఇక మరోవైపు జానకి ఎలాగైనా బాధితుడని రక్షించాలి అని అనుకుంటుంది. అప్పుడే అతని భార్య పిల్లలు కూడా అక్కడికి వస్తారు. నా భర్త లేకుంటే మేము ఏమైపోతామో అని ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది వారిని చూసి జానకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే అప్పుడే డాక్టర్లు వచ్చి అతను చనిపోయాడు అని చెప్పడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మేము ఎలా బ్రతకాలి అంటూ ఆ బాధితుడు భార్యాబిడ్డలు ఏడుస్తూ ఉంటారు. ఇక జానకిని ఎస్ఐ మనోహర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని మిగతా ఫార్మల్ అంతా కూడా నేను చూసుకుంటాను అని చెబుతాడు.

Janaki Kalaganaledu Serial 2023 April 6th Episode

జానకి ప్రయత్నాలు : ఇక జానకి కూడా ఆ భార్య పిల్లలకు ఏదైనా న్యాయం చేయాలి అని ఎస్ఐ మనోహర్ కు చెబుతుంది. తప్పకుండా విషయాలన్నీ నేను చూసుకుంటాను అని నువ్వు స్టేషన్ కి వెళ్ళు అని మనోహర్ చెబుతాడు. దీంతో జానకి సైలెంట్ గా నడుచుకుంటూ బయటకు వస్తుంది. ఇంతలో రామచంద్ర వచ్చి అసలు విషయం తెలుసుకుంటాడు. అయితే ఒక కానిస్టేబుల్ గా నేను వాళ్లకు ఏమి చేయలేను అని ఎస్ఐ గారు సపోర్ట్ చేస్తేనే వారికి న్యాయం జరుగుతుంది అని జానకి చెబుతుంది. ఇక మీకు మాత్రం నేను ఏ విషయంలోనైనా సరే అండగా ఉంటాను అని రామచంద్ర చెబుతాడు. ఇక జానకి హత్య చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అనుకుంటుంది కానీ మనోహర్ మాత్రం అందుకు ఒప్పుకోవడం పోలీస్ సాక్ష్యం ఎంత మాత్రం చెల్లదు అని ఏదైనా బలమైన సాక్షాదారాలు కావాలి అని అంటాడు మరి ఈ విషయంలో జానకి ఇలా ముందడుగు వేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X