Janaki Kalaganaledu April 7th: జానకి మాటలకు టెన్షన్ లో మనోహర్.. మరో సమస్యలో రామచంద్ర!
జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన ఎమోషన్స్ తో ఆకట్టుకుంటోంది. ఐపీఎస్ కావాలని అనుకున్న జానకి కానిస్టేబుల్ కావాల్సి వస్తుంది. అయితే ఐపీఎస్ పరీక్షలు మరోసారి రాసి కలను నిజం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ అక్కడ ఆమెకు మనోహర్ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక భర్త రామ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 547 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..
హత్యపై జానకి సీరియస్: ఒక బిల్డర్ అమాయకుడిని హత్య చేశాడు అని జానకి నిజం తెలుసుకుంటుంది. అంతేకాకుండా హత్య చేసిన ఘటనని కూడా ఆమె కళ్ళారా చూడడంతో ఎలాగైనా బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని అనుకుంటుంది. వెంటనే అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని ఫిక్స్ అవుతుంది. అయితే అంతకుముందే హత్య చేసిన బిల్డర్ ఎస్ఐకి ఫోన్ చేసి ఒక డీల్ సెట్ చేసుకుంటాడు. ఈ కేసు నుంచి తప్పిస్తే 50 లక్షలు ఇస్తాను అని చెబుతాడు. దీంతో ఎస్సై అందుకు ఒప్పుకుంటాడు. కానీ మరోవైపు జానకి మాత్రం పట్టు విడవకుండా బాధితురాలికి న్యాయం చేయాలని అనుకుంటుంది.

తొందర పడకూడదు: అయితే ఈ క్రమంలో ఆమె ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉండగా ఎస్సై మనోహర్ వచ్చి ఇప్పుడే అంత తొందర పడకూడదు అని ఇది పెద్ద వాళ్లతో కూడుకున్న వ్యవహారం అని ముందే మనం తొందరపడితే హంతకుడు తప్పించుకునే అవకాశం ఉంటుంది అని అతను అబద్ధాలు చెబుతూ ఉంటాడు. అయితే మనం ఎస్పీ గారితో మాట్లాడదామని కూడా ఎస్ఐకి చెప్పడంతో అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. నువ్వు ఏమాత్రం తొందర పడకు అని నేను మొత్తం చూసుకుంటాను అని మనం కొంత సమయం వేచి చూడాలి అని కూడా అంటాడు. దీంతో జానకి కూడా ఎస్ఐ మాటలకు ఒప్పుకుంటుంది.
సీరియస్ అయ్యే అవకాశం ఉంది:ఇక మ్యాటర్ సీరియస్ అయ్యే అవకాశం ఉంది అని ఎస్ఐ మనోహర్, బిల్డర్ కు ఫోన్ చేసి చెబుతాడు. అయితే అతను మాత్రం ఆ జానకిని కూడా చంపేద్దామా అని అంటే అసలు వద్దు అని, ఇప్పటికే నువ్వు ఒక హత్య చేశావని ఇప్పుడు కానిస్టేబుల్ ను హత్య చేస్తే విషయం మామూలుగా ఉండదు అని హెచ్చరిక చేస్తాడు. అయితే ఏదో ఒకటి చేయగానే నేను ఈ కేసు నుంచి తప్పించుకోవాలి అని నేను అరెస్టు అయితే నా బిజినెస్ దెబ్బతింటుంది అని అతను అంటాడు. కావాలంటే మరో 10 లక్షలు కూడా తీసుకొని ఆఫర్ ఇస్తాడు. దీంతో ఎస్ఐ మనోహర్ మరోసారి ఆలోచించి సరే అని అంటాడు.

10 లక్షలు ఇవ్వాలి: ఇక మరోవైపు ఇంటిదగ్గర జ్ఞానాంబ గోవిందరాజులు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఆరు బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ క్రమంలో జ్ఞానాంబకు తెలిసిన మహిళ వచ్చి గతంలో మీరు తాకట్టు పెట్టిన నగలు తీసుకోవాలి అని ఇప్పుడు నగలు తాకట్టు ఇచ్చిన వారికి డబ్బు అవసరం పడింది అని చెబుతోంది. వెంటనే 10 లక్షలు ఇవ్వాలి అని కూడా చెప్పడంతో జ్ఞానాంబ కొంత ఆశ్చర్య పోతుంది. అయితే ఈ విషయంలో కొడుకులతో మాట్లాడతామని కూడా గోవిందరాజులు అంటాడు. కానీ పిల్లలను ఈ టైంలో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని మనమే ఆ గోల్డ్ అమ్మేసి ఇచ్చేద్దామని నాకు నగలు లేకపోయినా పర్వాలేదు అని జ్ఞానాంబ చెబుతుంది. ఇప్పటికే నువ్వు నగలు లేకుండా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పిన గోవిందరాజులు మన కొడుకులకు ఈ విషయాన్ని చెప్పి డబ్బు తీసుకుందాము అని అంటాడు.
రామ కీలక నిర్ణయం: కానీ జ్ఞానంతో మాత్రం ముందు ఒప్పుకోదు. కానీ వీరు మాట్లాడకుండా తీరును చూసి రామచంద్ర మరొక నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే గతంలో విష్ణుకి డబ్బు అవసరం పడినప్పుడు అమ్మ ఆ నగలు తాకట్టుపెట్టి డబ్బులు తీసుకువచ్చింది అని తన భార్యకు చెబుతూ ఉంటాడు. అయితే ఈ సమయంలో మనం తొందరపడడం కరెక్ట్ కాదు అని ఇప్పుడు విష్ణుని అడుగితే గొడవలు అవుతాయేమో అని అందుకే అత్తయ్య గారు వెనుకడుగు వేశారు అని జానకి చెబుతుంది. కానీ రామచంద్ర మాత్రం విష్ణుని అడిగి డబ్బు తీసుకోవాలని అనుకుంటాడు. అయితే రామచంద్ర వచ్చే కంటే ముందే మల్లిక వెళ్లి తన భర్త విష్ణుకు జరిగిన విషయం చెబుతుంది. మీ అన్న గారు వచ్చి ఇప్పుడు డబ్బు అడుగుతారు అని మీ దగ్గర అసలు ఏమాత్రం లేవు అని చెప్పేసేయండి అంటూ మల్లికా తన భర్తకు గట్టిగా చెబుతుంది.

డబ్బులు లేవని మల్లిక కౌంటర్: ఇక విష్ణు కూడా తన భార్య మాట ప్రకారం మాట్లాడాలని అనుకుంటాడు. రామచంద్ర పిలిచి అడగగానే అతను తన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని అంటాడు. అయితే వారం లేదా పది రోజుల సమయం తీసుకొని డబ్బు సమకూర్చే పని చేయాలి అని అంటాడు. కానీ తన దగ్గర లేవు అని కుదరదు అని సమాధానం ఇస్తూ ఉంటాడు. అలాగే మల్లికా కూడా మరో మాటతో డబ్బులు లేవు అని చెబుతుంది. ఇక ఇంతలో కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వస్తారు. అయినా పోయిన షాపును ఎలా వెనక్కి తీసుకురావాలో అని ఆలోచించకుండా ఇప్పుడు మా వెనకాల డబ్బు కోసం పడితే ఏం బాగుంటుంది అని మల్లిక ఊహించని విధంగా మాట్లాడుతుంది. దీంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి ఈ గొడవలో జానకి ఏ విధంగా మాట్లాడుతుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











