Janaki Kalaganaledu February 10th: తల్లి మాటలకు కృంగిపోతున్న రామ.. మరో సలహా ఇచ్చిన జానకి!

జానకి కలగనలేదు సీరియల్ కథ మరో ఆసక్తికరమైన ఘట్టంతో ముందుకు సాగుతోంది. కుటుంబ పరిస్థితుల వలన విబేధాలు రావడంతో అఖిల్, విష్ణు విడిపోవాలని అనుకుంటారు. ఇక పెద్దవాడు రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని తాపత్రయపడుతుంటాడు. అయితే అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు. ఇక జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 500 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

మరో కాపురం పెట్టాలని..

మరో కాపురం పెట్టాలని..

మల్లిక ఇంట్లో నుంచి వెళ్లిపోయి మరో కాపురం పెట్టాలని అనుకుంటుంది. ఇక్కడ చేసిన అప్పు వారి మీద కూడా పడుతుందేమో అని విష్ణుకు కూడా ఆమె లేనిపోని మాటలు చెబుతుంది. ఇక విష్ణు కూడా మల్లికా మాటలకు ఎదురు సమాధానం చెప్పలేక పోతాడు. ఇక ఫైనల్ గా మల్లిక జానకి పై ఒక దొంగతనం నింద కూడా వేస్తుంది. తన ఉంగరం పోయింది అని జానకి బ్యాగులో ముందే వేసిన మల్లికా ఆమెను దోషిగా నిలబెడుతుంది. ఇక జానకి ఏమీ అనకుండా మౌనంగా ఉండి పోవాల్సి వస్తుంది. అలాంటి పని జానకి చేయదు అని మామ గోవిందరాజులు అలాగే మిగతా కుటుంబ సభ్యులు కూడా చెబుతారు.

మా ప్రాణం పోయినా కూడా..

మా ప్రాణం పోయినా కూడా..

అయితే మల్లికా మాత్రం అత్తగారికి కూడా ఎదురు సమాధానం చెబుతుంది. మేము ఇంట్లో ఉండాలని అనుకోవడం లేదు అని జానకి దొంగతనం చేసిన కూడా మీరు ఆమెను ఏమీ అనలేదు అని రేపు మా ప్రాణం పోయినా కూడా పట్టించుకోరు అని కారణం చెబుతూ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. ఇక మల్లిక అలా మాట్లాడగానే జ్ఞానాంబ మౌనంగా ఉండిపోతుంది. ఇక జానకి కూడా పెరట్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది.

అత్త బాధ గురించి జానకి ఆలోచన

అత్త బాధ గురించి జానకి ఆలోచన

ఇక రామచంద్ర జానకిని వెళ్లి ఓదార్చాలని అనుకుంటాడు. మల్లిక గురించి తెలిసింది కదా ఆమె మాటలు పట్టించుకోవద్దు అని అంటాడు. కానీ జానకి మాత్రం ఐపీఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంటున్న నాపైన అలా దొంగ ఇలా ముద్ర వేయడం అనేది చాలా బాధగా ఉంది అని అనుకుంటుంది. ఇక అత్తయ్య గారు కూడా ఇంట్లో పరిస్థితుల వలన బాధపడుతున్నారు అని మల్లికా వెళ్ళిపోతాను అని చెప్పింది. ఇక ఆ వెంటనే అఖిల్ కూడా ఆఫీస్ దూరమవుతుంది అని కారణం చేత మరో ఇంటికి వెళ్లి పోతాను అని అన్నాడు. అందువల్ల అత్తయ్య గారు మరింత బాధపడుతున్నారు అని జానకి చెబుతుంది.

మల్లిక నా మాట వినదు

మల్లిక నా మాట వినదు

ఇక మరోవైపు మల్లిక భర్త విష్ణు కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటాడు. అందుకోసం ఇంటికి అడ్వాన్స్ కూడా మల్లికా ఇచ్చింది అని తన తల్లికి చెబుతూ ఉంటాడు. కానీ గోవిందరాజులు మాత్రం భార్య మాట వినడానికి సిగ్గు లేదా ఆమెకి ఏదో ఒకటి సర్ది చెప్పవచ్చు కదా అని అంటాడు. కానీ ఆమె నా మాట వినదు అని నేను వచ్చిన రాకపోయినా కూడా తను బయటకు వెళ్ళిపోతాను అంటుంది అని అందుకే నా కాపురాన్ని నేను కాపాడుకోవాలి అంటే మల్లిక మాట వినాల్సిందే అని విష్ణు తెగించి చెబుతాడు.

 ఇదంతా రామ వల్లనే..

ఇదంతా రామ వల్లనే..

ఇక అతని మాటలకు గోవిందరాజులు ఏమీ అనలేక పోతారు. ఒక విధంగా వారికి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అని గోవిందరాజులు కూడా భార్యకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే ఇదంతా రామచంద్ర వల్లే వచ్చింది అని చేసిన అప్పు వలన భారం తమపై పడుతుందేమో అని అందరూ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు అని మరోసారి జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. కానీ గోవిందరాజులు మాత్రం ఆమెకు నచ్చచెప్పాలని అనుకుంటాడు. కారణం అది కాదు అని వాళ్లకి మనతో ఉండడం ఇష్టం లేదు అని అందుకే ఇలా చేస్తున్నారు అని అంటాడు.

భర్తకు సలహా ఇచ్చిన జానకి

భర్తకు సలహా ఇచ్చిన జానకి

ఇక జ్ఞానాంబ ఆ విధంగా మాట్లాడడంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. తల్లి మాటలను తలుచుకుంటూ సరిగా నిద్ర కూడా పోడు. ఇక అత్తయ్య గారు అలా మాట్లాడడానికి కారణం మీరు కాదు అని హఠాత్తుగా ఇద్దరు అలా వెళ్ళిపోతున్నారు అనగానే ఆమె బాధను తట్టుకోలేకపోయారు అని జానకి భర్తకు చెబుతుంది. ఇక జానకి భర్తకు మరో సలహా కూడా ఇస్తుంది వీళ్ళు వెళ్లిపోకుండా ఉండాలి అంటే మళ్ళీ మన పాత ఇంట్లోకి వెళ్లాలి అని ఆ ఇంట్లోకి వెళితే అఖిల్ కు కూడా ఆఫీస్ దగ్గర అవుతుంది అని, ఇక మల్లికకు కూడా కొంత ప్రైసైసి దొరుకుతుంది అని చెబుతుంది. ఇక రామచంద్ర మళ్ళి ఆ ఆలోచనలో పడతాడు. అయితే మరోవైపు అఖిల్ వెళ్లిపోవడానికి కారణం జెస్సి కూడా అనుకొని జ్ఞానాంబ జెస్సిపై కోపాన్ని చూపిస్తుంది. అయితే జెస్సి మాత్రం అఖిల్ పెట్టిన కండిషన్ వలన అత్తగారితో ఆ విషయం గురించి మాట్లాడదు. దీంతో ఆమె ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇక జానకి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ సమస్యలను రామచంద్ర ఎలా పరిష్కరిస్తాడో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X