Janaki Kalaganaledu February 13th: జానకి ప్రేమ చూపించినా బాధలోనే రామ.. మరో ఊహించని ట్విస్ట్!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఘట్టంతో ముందుకు సాగుతోంది. ఫ్యామిలీ పరిస్థితుల వలన కొంత విబేధాలు రావడంతో అఖిల్, విష్ణు విడిపోవాలని అనుకుంటారు. ఇక పెద్దవాడు రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని తాపత్రయపడుతుంటాడు. అయితే అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు.
ఇక జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 502 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం
ఒకే ఒక్క తప్పు కారణంగా రామచంద్ర కుటుంబం మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటు ఉంటుంది. అసలు ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఎదురుచూస్తున్న మల్లిక అవకాశం దొరకగానే బయటకు వెళ్లిపోయి భర్తతో మరో కాపురం పెట్టాలి అని అనుకుంటుంది. ఈ క్రమంలో అత్త జ్ఞానాంబ ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మల్లికా ఆమె మాటలు పట్టించుకోదు.
ఇక రామచంద్ర ఇంట్లో పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మల్లికతో పాటు చిన్న తమ్ముడు అఖిల్ కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయి మరో కాపురం పెట్టాలని అనుకోవడంతో మరింత బాధను కలగజేస్తుంది. అలాగే తల్లి బాధపడుతోంది అనే ఆలోచన కూడా అతని మనసులో మరింత కలవరపెడుతూ ఉంటుంది.

ప్రేమికుల రోజు సందర్భంగా
ఇక మరోవైపు జానకి కూడా చదువుకోవాలి అని అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జానకి కాలేజ్ కు వెళ్లగానే అక్కడ ఊహించని వాతావరణం కనిపిస్తుంది. ప్రేమికుల రోజు కావడంతో అందరూ కూడా వారి ప్రేమా విషయాలను షేర్ చేసుకుంటూ ఎంతో కలర్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటారు. అయితే జానకి స్నేహితురాలు కూడా నీకు పెళ్లి అయిపోయింది కదా ఆ అదృష్టం లేదేమో అని అంటుంది. కానీ నా భర్తకు నేను ఎప్పుడు నా ప్రేమ విషయాన్ని గొప్పగా చెప్పలేదు అని ఇప్పుడు ఆ విషయాన్ని చెబుతాను అని జానకి చెబుతుంది.

బాధలోనే రామ
ఇక భర్త రామచంద్ర రాగానే అతనిపై తన స్పెషల్ లవ్ ను చూపించాలి అని ఆలోచిస్తుంది. ఇక రామచంద్ర జానకిని కాలేజీ నుంచి తీసుకు వెళుతుండగా మధ్యలో ఆమె ఒకచోట ఆగి తన ప్రేమ విషయాన్ని చెప్పాలని అనుకుంటుంది. ముందుగా రామచంద్ర నువ్వు కళ్ళు మూసుకోవాలని చెబుతుంది. ఇక రామచంద్ర కళ్ళు మూసుకోగా రోజా పువ్వులను ఇచ్చిన జానకి తన ప్రేమ విషయాన్ని ఎంతో ఆప్యాయంగా చెబుతుంది. కానీ రామచంద్ర మాత్రం కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించి ఉంటాడు. మీరు ఎంతో సంతోషంగా మీ ప్రేమ విషయాన్ని నాతో పంచుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఆనందం వచ్చినా కూడా నా మనసు అందుకు తగ్గట్టుగా లేదు అని ఇంట్లో పరిస్థితుల గురించి చెబుతాడు.

సిద్దమవుతున్న మల్లిక
ఇక జానకి కూడా మరో మాట మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. చాలా పనులు ఉన్నాయి వెళ్లిపోదామని రామచంద్ర చెప్పడంతో ఆమె బండి ఎక్కుతుంది. ఇక ఇంటికి రాగానే అక్కడ వారికి మరొక గొడవ కనిపిస్తుంది. మల్లికా ముందుగానే బట్టలు సర్దుకుంటూ ఉదయమే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని అనుకుంటుంది. అయితే తన భార్య బాధ చూడలేక కోడలితో మాట్లాడాలి అని గోవిందరాజులు అనుకుంటాడు. ఇక మల్లిక దగ్గరకు వెళ్లి ఒకసారి ఆలోచించు అని మీ అత్తయ్య గారు బాధపడుతున్నారు అని అంటాడు.

ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను
కానీ మల్లిక మాత్రం నేను ఏదో తప్పు చేస్తున్నట్లు అందరూ మాట్లాడుతున్నారు అని నేను మన కుటుంబం గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అని మేము మన పాత ఇంట్లో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెబుతుంది. ఒక గదిలో ఉంటే అత్తయ్య గారు మీరు హాల్లో పడుకుంటున్నారు ఇక బావ గారు జానకి ఇద్దరు కూడా కిచెన్ లోనే ఉంటున్నారు. మేము వెళ్ళిపోతే ఎవరో ఒకరికి మా గది ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోనే వెళ్లిపోతున్నామని మల్లికా మరొక విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మల్లికా మాటలు విన్న అందరూ కూడా కొంత ఆశ్చర్యపోతారు. కానీ ఆమె మాత్రం ఇంట్లో నుంచి ఎలాగైనా బయటకు వెళ్లిపోవాలని అనుకుంటుంది.

జెస్సికి అఖిల్ హెచ్చరిక
ఇక ఆమె అలా మాట్లాడడంతో భర్త విష్ణు కూడా మొదట మెచ్చుకుంటాడు. కానీ ఆమె మాత్రం ఇంట్లో నుంచి ఎలాగైనా వెళ్ళిపోతాను అదే బెటర్ అని అనుకుంటుంది. ఇక మరోవైపు జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ కూడా అదే ఆలోచనతో ఉంటాడు. ఇంట్లో నుంచి వీలైనంత తొందరగా బయటకు వెళ్ళిపోవాలి అని మల్లిక వదిన చెప్పింది నేను చెప్పలేదు అని తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు కానీ అతని భార్య జెస్సీ మాత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోకూడదు అని అందరితో కలిసి ఉండాలి అని ఆలోచిస్తుంది. కానీ అఖిల్ మాత్రం ఈ విషయంలో నువ్వు నాకు అడ్డు చెప్పకు అని ఏదైనా అంటే మాత్రం నువ్వు కూడా ఇక్కడే ఉండి పోవాల్సి వస్తుంది అని ఆ తర్వాత నీ ఇష్టం అని నేను అయితే వెళ్ళిపోతాను అని గట్టిగా చెబుతాడు. ఇక దీంతో జెస్సి ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంటుంది.

ఊహించని ట్విస్ట్
ఇక జానకి మరుసటి రోజు కాలేజీకి వెళ్లి అక్కడ దేవుడిని తలుచుకుంటూ ఈ బాధలు అన్నీ కూడా తొందరగా తొలగిపోయి అందరూ మళ్ళీ కలిసి ఉండేలా చూడాలని ఆ భగవంతుడిని కోరుకుంటుంది. ఇక ఇంతలోనే జానకి స్నేహితురాలు వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే తన అన్నయ్యకు ఒక ఉద్యోగం వచ్చింది అని సంతోషంగా చెబుతూ 20 లక్షలు కడితే మూడు నెలల్లోనే ఆ డబ్బు వెనక్కి వచ్చేలా చేస్తారని ఆఫర్ ఇచ్చారని ఆమె అంటుంది. అంతే కాకుండా భాగస్వామ్యలుగా చేసుకుంటారు అని కూడా చెప్పడంతో వెంటనే జనకికి, రామచంద్రకు జరిగిన మోసం గురించి తెలుస్తుంది. అఖిల్ విషయంలో రామచంద్ర కూడా అలాగే డబ్బు కట్టి మోసపోయాడు. బహుశా ఆ మోసం చేసిన వ్యక్తి అయ్యి ఉంటాడు అని జానకి గ్రహిస్తుంది. మరి ఈ విషయంలో ఆమె ఏ విధంగా అడుగులు వేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











