Janaki Kalaganaledu February 14th: పాత ఇంటిని దక్కేలా చేసిన జానకి.. మల్లికకు మరో షాక్ ఇచ్చిన రామ!
జానకి కలగనలేదు మరో ఆసక్తికరమైన కథాంశంతో మరింతగా ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ పరిస్థితుల వలన కొంత విబేధాలు రావడంతో అఖిల్, విష్ణు విడిపోవాలని అనుకుంటారు. ఇక పెద్దవాడు రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని తాపత్రయపడుతుంటాడు. అయితే అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు. ఇక జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది.
జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 503 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

తమ్ముడి కోసం ఆలోచించి..
రామచంద్ర చేసిన ఒక పొరపాటు కారణంగా ఇంట్లో పరిస్థితులు ఒక్కసారిగా ఇబ్బందిగా మారిపోతూ ఉంటాయి. తమ్ముడు అఖిల్ ఎలాగైనా జాబ్ చేస్తూ సెటిల్ కావాలి అని రామచంద్ర తన పాత స్నేహితుడిని జాబ్ ఇవ్వమని కోరుతాడు. అయితే అతను 20 లక్షలు కడితే జాబ్ వస్తుంది అని చెబుతాడు. ఇక రామచంద్ర ఎవరికి తెలియకుండా ఇంటి పత్రాలను షాప్ పేపర్స్ తాకట్టుపెట్టి 20 లక్షలు తెచ్చి ఇస్తాడు.
కానీ అతను నమ్మకద్రోహం చేస్తాడు. ఆ తర్వాత కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతుంది. ఒక చిన్న ఇంట్లో అందరూ చాలా ఇబ్బందిగా పడుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఎలాగైనా రామచంద్రం మళ్ళీ ఇంటిని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు.

స్నేహితురాలి ద్వారా..
ఇక ఇంట్లో పరిస్థితులు బాగోలేవు కాబట్టి మల్లిక కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అలాగే చిన్న కొడుకా అఖిల్ కూడా ఇదే మంచి ఛాన్స్ అనే తన మామయ్య ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఎక్కడ చేసిన అప్పు తమ మీద పడుతుందో అని వారు ఆలోచిస్తూ ఉంటారు. కానీ రామచంద్ర మాత్రం ఆ విధంగా ఆలోచించడు.
ఇక మరోవైపు జానకి కూడా ఇంట్లో సమస్యలను పరిష్కరించాలి అని అనుకుంటుంది. అయితే జానకి కాలేజీలో తన స్నేహితురాలి ద్వారా మోసం చేసిన వ్యక్తి గురించి తెలుసుకుంటుంది. అతని పేరు సాయి చరణ్ అనే తెలుసుకున్న జానకి స్నేహితురాలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రామచంద్రను మోసం చేసిన వ్యక్తి అతను అని అనుకుంటుంది.

తెలివిగా పట్టుకున్న జానకి
ఇక అతను జాబ్ లో ఇస్తు మరికొందరినీ మోసం చేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో జానకి కూడా జాబ్ కోసం వచ్చిన అమ్మాయి తరహా లోనే అక్కడికి వెళుతుంది. ఇక అతని పేరు ఏమిటి అనగా శరత్ అని అంటాడు. మళ్ళీ పేరు మార్చుకున్నాడు అని ఆమె అనుకుంటుంది.
అయితే అతను నిజంగా మోసం చేసిన వ్యక్తేనా కాదా అని కొంత సందేహం పడిన జానకి గతంలో రామచంద్ర చూపించిన ఫోటో ఆధారంగా అతనిని గ్రహిస్తుంది. ఇక మెల్లగా అతని దగ్గరికి వెళ్లి జాబ్ కోసం అన్నట్లుగా మాట్లాడి కొట్టడానికి వెళుతుంది. అయితే అతను కూడా సీరియస్ అవుతూ ఉంటాడు. అనవసరంగా గొడవ చేస్తే నీకే నష్టమని ఆమెను కొట్టబోతాడు.

మోసం చేసిన వ్యక్తిని కొట్టిన రామ
ఇక అంతలోనే రామచంద్ర వచ్చి అతనిపై చేయి చేసుకుంటాడు. నీ కారణంగా నా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఎదురయింది అని ఫ్యామిలీలో గొడవలు వచ్చాయి అని అంటాడు. ఇక శరత్ భయపడుతూ రామచంద్ర కు ముందుగా ఒక 10 లక్షలు ఉన్నాయి అని మిగతా డబ్బులు త్వరలోనే ఇస్తాను అని చెబుతాడు.
ఇక ఈ విషయాన్ని మాత్రం బయట చెప్పకు అని నా పరువు పోతుంది అని అంటాడు. ఇక రామచంద్ర మాత్రం సహించకుండా నీ వల్ల మరొకరి జీవితాలు నాశనం అవ్వకూడదు అని బయటకు ఈడ్చుకొచ్చి అందరికీ చెబుతాడు. ఇక అప్పుడే పోలీసులు కూడా వస్తారు వెంటనే అతనిని అరెస్టు చేసి తీసుకువెళ్తారు.

వెళ్లిపోవడానికి సిద్ధమైన మల్లిక
ఇక మిగతా వాళ్లు రామచంద్ర జానకికి ధన్యవాదాలు చెబుతారు. మా డబ్బులు పోకుండా కాపాడారు అని అంటారు. ఇక మరోవైపు మల్లిక ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతూ ఉంటుంది. సామాన్లు అన్నీ సర్దుకుని ఆమె బయటకు వెళుతూ ఉండగా అప్పుడే లీలవతి కూడా వస్తుంది. ఆమె బయటకు వెళ్ళిపోతున్నావు ఎందుకు అని అడుగుతుంది. మా అత్తయ్య గారి గురించి అలాగే మా మామ గారి గురించి ఆలోచించి వెళుతున్నాను అని అంటుంది.
మళ్ళీ పాత ఇంటికి ఫ్యామిలీ
ఇక వారు మాట్లాడుతూ ఉండగా అప్పుడే జానకి వస్తుంది ఎవరు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి వీలులేదు అని అంటుంది. ఎందుకంటే మళ్లీ మన ఇంటిని దక్కించుకునే అవకాశం వచ్చింది అని సర్దుకున్న సామాన్లతోనే డైరెక్ట్ గా మన పాత ఇంటికి వెళ్లి పోదామని రామ చెబుతాడు. ఇక మల్లిక కొంత నిరాశ చెందినప్పటికీ చేసేదేమీ లేక పాత ఇంటికి వెళదాం పదండి అని అంటుంది.
ఇక అఖిల్ ఆఫీస్ కూడా పాత ఇంటికి దగ్గరే కాబట్టి అతన్ని కూడా రావాలి అని అందరూ చెబుతారు. ఇక అఖిల్ కూడా సైలెంట్ గా రావాల్సి వస్తుంది. ఇక రామచంద్ర తన ఇంటి కాగితాలను తెచ్చి తల్లి చేతిలో పెడతాడు. త్వరలోనే షాప్ కూడా మనదే అవుతుంది అని నమ్మకంతో చెబుతాడు. ఇక రామచంద్ర ఏ తప్పు చేయలేదు అని తండ్రి కూడా గర్వంగా చెప్పుకుంటాడు మరి రామచంద్ర నెక్స్ట్ షాప్ ను ఎలా తగ్గించుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











