Janaki Kalaganaledu February 15th: పని చేస్తూనే రామ, జానకి స్వీట్ రొమాన్స్.. మరో నిర్ణయంతో అత్తగారు షాక్!
జానకి కలగనలేదు విభిన్నమైన ఎమోషన్స్ తో మరింత ఆసక్తిగా కొనసాగుతోంది. ఫ్యామిలీ పరిస్థితుల వలన కొంత విబేధాలు రావడంతో అఖిల్, విష్ణు విడిపోవాలని అనుకుంటారు. ఇక రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని తాపత్రయపడుతుంటాడు. అయితే అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు.
ఇక జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 504 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

10 లక్షలు రావడంతో..
రామచంద్ర తన తమ్ముడు అఖిల్ కోసం ఆలోచించి ఒక పొరపాటు చేస్తాడు. తన పాత స్నేహితుడిని నమ్మి 20 లక్షలు అతనికి ఇచ్చి ఉద్యోగం వచ్చేలా చేయాలని అంటాడు. కానీ అతను మాత్రం మోసం చేస్తాడు. దీంతో ఆ కారణంగా ఇంటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఇక మళ్లీ ఆ సమస్యలను తొలగించేలా చేయాలి అని అతని భార్య జానకి కూడా అనుకుంటుంది. ఇక మొత్తానికి రామచంద్ర మోసం చేసిన వ్యక్తిని తెలివిగా పోలీసులకు పట్టిస్తుంది. ఇక అతడి నుంచి ముందుగా ఒక 10 లక్షలు అయితే వస్తాయి. దీంతో ఇంటి కోసం డబ్బులు కట్టేసి మళ్లీ పాత ఇంటికి వస్తారు.

జానకి దెబ్బకు మల్లికకు షాక్
జానకి రామచంద్ర మళ్లీ అందరూ కూడా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాలా చేస్తారు. దీంతో ఆ విషయంలో తల్లి జ్ఞానాంబ ఎంతగానో సంతోషపడుతుంది. అయితే మరోవైపు మల్లిక మాత్రం ఎప్పటినుంచో ఇంట్లో నుంచి వెళ్లిపోయి మరో కాపురం పెట్టాలని ఆలోచిస్తుంది.
కానీ ఆమె వెళ్లిపోయే క్రమంలోనే జానకి రామచంద్ర డబ్బులు తీసుకువచ్చి మళ్లీ పాత ఇంటిని దక్కించుకుంటారు. దీంతో అందరు కూడా మళ్ళీ కొత్త ఇంట్లోకి రావాల్సి వస్తుంది. ఇక ఎన్నో ప్రణాళికలు రచించిన మల్లిక మాత్రం మరోసారి జానకి దెబ్బకు ఒక్కసారిగా షాక్ అవుతుంది.

పాత ఇంట్లో సందడిగా..
ఇక పాత ఇంట్లోకి అడుగుపెట్టబోయే ముందు మామ గోవిందరాజులు అందరూ పనిచేయాలని మల్లికా కూడా చీపిరి పట్టుకొని మొత్తం శుభ్రం చేయాలి అని సరదాగా చెబుతూ ఉంటాడు. ఇక అందరూ కూడా ఇంటిని శుభ్రం చేసే పనిలో బిజీ అవుతుంటారు. ఇక జ్ఞానాంబ దేవుడు విగ్రహాలను ఎంతో ఆప్యాయంగా తుడుస్తూ ఉంటుంది.
ఇక మరోవైపు గోవిందరాజులు వంటవాడు మలయాళం అలాగే మల్లిక కూడా పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా మల్లికైతే చిరకుతో మరి బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో నుంచి సరిగ్గా వెళ్ళిపోయే టైమ్ లోనే జానకి వచ్చి మొత్తం ప్లాన్ మార్చేసింది అని బాధపడుతూ ఉంటుంది.

పనిలో రామ, జానకి రొమాన్స్
ఇక మరోవైపు రామచంద్ర జానకి ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. రామచంద్ర సరదాగా భార్యను చూస్తూ మీ వీపు వెనకాల రంగు అంటుకుంది అని చెబుతూ ఉంటాడు. ఇక తుడవండి అంటూ జానకి కూడా ప్రేమగా చెబుతూ ఉంటుంది. ఈ క్రమంలో రామచంద్ర ఎంతో సరదాగా ఆమెను చూస్తూ దాన్ని తుడుస్తూ ఉంటాడు. ఇక ఆ క్రమంలోనే జానకి తన ప్రేమ విషయం గురించి కూడా గుర్తు చేస్తుంది.
ముద్దు పెట్టాలని..
ప్రేమికుల రోజు సందర్భంగా మీకు రోజా పువ్వులు ఎంతో ప్రేమగా ఇచ్చాను అప్పుడే మనస్ఫూర్తిగా మొత్తం ప్రేమని చూపించాను. కానీ మీరు మాత్రం ఇంట్లో అత్తయ్య గారు సంతోషంగా లేరు అని దాని గురించి పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు నా కారణంగా అత్తయ్య గారు కూడా సంతోషపడ్డారు ఆ గిఫ్ట్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను అని జానకి చెబుతుంది.
దీంతో రామచంద్ర నిజమైన ప్రేమ అంటూ చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంతే కాకుండా ముద్దు పెట్టాలని ఉన్నట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అప్పుడే జ్ఞానాంబ వారిని పిలుస్తుంది.

ట్విస్ట్ ఇచ్చిన జ్ఞానాంబ
ఇక అందరూ పూజకు రావాలి అని తల్లి చెబుతుంది. అయితే అందరూ వచ్చిన తర్వాత పూజ ముగిసిన తర్వాత జ్ఞానాంబ ఊహించని విధంగా మాట్లాడుతుంది. కొందరు ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఉండాలని అనుకోవడం లేదు అని అర్థమైంది. అయితే అలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలి కాబట్టి అందరూ కూడా ఎవరి సంసారాలను వాళ్లే చూసుకోవాలి అని ఎవరి జీతం డబ్బులు వారివే అని చెబుతుంది.

నా నిర్ణయం మారదు
ఈ ఇంట్లో ఎవరు వెళ్ళిపోకుండా మా కళ్ళ ముందు ఉంటే చాలు అని ఆమె కోరుకుంటుంది. అయితే తల్లి అలా చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. అందరూ కలిసి ఉండాలని ముందు అనుకున్నాము కదా అని తల్లిని అడుగుతాడు. కానీ నా నిర్ణయం ఈ విషయంలో మారదు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. ఇక తల్లి ఆ విధంగా ఎందుకు మాట్లాడింది అని రామచంద్ర ఆలోచనలో పడతాడు. జానకి కూడా అత్తగారిని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని కోరుతుంది. కానీ ఆమె వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అత్తగారు ఇలా ఎందుకు చేశారు అనే విషయంలో జానకి ఆలోచిస్తుంది. మరి రాబోయే రోజుల్లో మల్లిక ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











