Janaki Kalaganaledu February 16th: జ్ఞానాంబ పెళ్లి రోజు రామ స్పెషల్ ప్లాన్.. జానకిపై అఖిల్ కోపం!
జానకి కలగనలేదు ఆసక్తికరమైన ఎమోషన్స్ తో మరింతగా ఆకట్టుకుంటోంది. ఇక కుటుంబ పరిస్థితుల వలన కొంత విబేధాలు రావడంతో అఖిల్, విష్ణు విడిపోవాలని అనుకుంటారు. ఇక రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. అయితే అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు.
ఇక జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 505 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

మంచి ఛాన్స్ మిస్ అంటూ..
ఇంట్లో నుంచి వెళ్లిపోయి బయట వేరే కాపురం పెట్టాలి అనుకున్న రెండో కోడలు మల్లిక ప్లాన్ ఒక్కసారిగా ఫెయిల్ అవుతుంది. జానకి మళ్ళీ సమస్యలు అన్నిటిని తొలగించి పాత ఇంటికి వెళ్లిపోయేలా చేస్తుంది. సరిగ్గా మల్లిక అద్దె ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉండగా మనం విడిపోవాల్సిన అవసరం లేదు అని మళ్లీ మన పాత ఇల్లు మనకు దక్కింది అని రామచంద్ర జానకి ఇద్దరు కూడా గుడ్ న్యూస్ చెబుతారు. ఇక అందరూ సంతోషంగా ఉండగా మల్లిక మాత్రం మంచి ఛాన్స్ మిస్ అయింది అని ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది.

అమ్మ అలా ఎందుకు చెప్పింది?
ఈ సమయంలో నవ్వాలో ఎడవాలో కూడా అర్థం కావడం లేదు అని తన భర్తకు చెప్పుకుంటుంది. ఇక ఎలాగు అత్తయ్య గారు ఎవరి కాపురాలు వారివే అని.. ఎవరి డబ్బులు వారివే అని చెప్పినందుకు కాస్త సంతోషిస్తుంది. ఇక అలా ఎందుకు చెప్పిందని కూడా ఆమె కొంత ఆశ్చర్య పోతుంది.
ఇక ఇంట్లో అందరూ ఎవరి కాపురాలు వారు చూసుకోవాలి అమ్మ ఎందుకు చెప్పింది? అందరం మళ్ళీ కలిసి ఉండాలని మనం అనుకున్నాము కదా అని తన భార్య జానకి తో రామా చెబుతాడు. ఇక అదే విషయాన్ని మళ్ళీ ఆమెను అడగాలని అనుకుంటారు.

వారి కష్టం గురించి తెలియాలి
కానీ జ్ఞానాంబ మాత్రం నేను ఆలోచించి గాని ఏ నిర్ణయం తీసుకోను అని అందుకే ఇంట్లో ఎవరికి వారే ఉండాలి అని చెప్పాను అని అంటుంది. అంతేకాకుండా ఇంట్లో అందరి బాధ్యతను నువ్వు మాత్రమే తీసుకున్నావు.. అందరికీ కూడా వారి కష్టం గురించి తెలియాలి కాబట్టి అందుకే ఇలా చెప్పాను అని ఇక ఈ విషయంలో నా నిర్ణయం మారదు అని జ్ఞానాంబ పెద్ద కొడుకు రామచంద్రకు చెబుతుంది. ఇక రామచంద్ర కూడా ఏమీ అనకుండా సైలెంట్ గా ఉండిపోతాడు.
అప్పటినుంచి నేను సంతోషంగా లేను
ఇక మరోవైపు మూడవ కొడుకు విష్ణు మళ్ళీ పాత ఇంట్లోకి వచ్చినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ సమయంలో బయటకు వెళ్లిపోతూ ఉండగా ఈ జానకి వదిన కారణంగా మళ్ళీ ఇంట్లో వచ్చి పడాల్సి వచ్చింది అని కోపంతో ఉంటాడు. ఇక అతని భార్య జెస్సి మాత్రం వదిన ఏం చేసినా కూడా మనం మంచి గురించి ఆలోచించి చేస్తుంది కదా ఎందుకు అలా మాట్లాడతావు అని అంటుంది. కానీ అఖిల్ మాత్రం మొదటినుంచి కూడా జానకి పై కోపం తెప్పించుకుంటూ ఉంటాడు.
ఆమె ఇంట్లో కాలు పెట్టినప్పుడు నుంచి కూడా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఇష్టం లేకపోయినా నాకు ఈ పెళ్లి చేసింది ఇక అప్పటినుంచి నేను సంతోషంగా లేను అని భార్యతో చెబుతాడు. నువ్వు చేసిన తప్పు కారణంగా అక్కను తిట్టడం కరెక్ట్ కాదు అని జెస్సి కూడా అంటుంది. కానీ అఖిల్ మాత్రం ఆ విషయాలు పట్టించుకోకుండా తన కోపాన్ని చూపిస్తూ ఉంటాడు.

జానకి రామ సరదాగా..
ఇక ఇంట్లో అందరూ మళ్ళీ సంతోషంగా ఉండాలి కలిసి ఉండాలి అని అనుకున్నా రామచంద్ర కు తల్లి చెప్పిన మాటలు ఏమాత్రం నచ్చవు. ఇక ఆ విషయాన్ని తలుచుకుంటూ కొంత బాధపడుతూ ఉండగా జానకి మళ్ళీ అతన్ని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావాలని అనుకుంటుంది. ఇక రామచంద్రను నవ్వించే విధంగా చక్కిలి గింతలు పెడుతూ ఉంటుంది. ఇక వాళ్ళు సరదాగా ఉన్న సమయంలో అప్పుడే వంటవాడు మలయాళం వచ్చి సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటాడు. మిమ్మల్ని అమ్మగారు భోజనం చేయడానికి రమ్మంటున్నారు అని నవ్వుతూ చెబుతాడు.

పెళ్లి రోజును సెలబ్రేట్ చేయాలని..
ఇక అందరూ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. మనందరం కలిసి ఈ విధంగా భోజనం చేసి చాలా రోజులు అయింది అని వెన్నెల అంటుంది. అయితే వారానికి ఒక్కసారి మాత్రమే ఇలా కూర్చొని తినే రూల్ ని తల్లి పెడుతుంది. ఇక వెన్నెల మాట్లాడుతూ రేపు ఒక ప్రత్యేకమైన రోజు ఉంది అని గుర్తు చేస్తుంది. అది ఏమిటి అని అందరూ అడుగుతారు. ఇక జానకి, అత్తయ్య గారి మామయ్య గారి పెళ్లి రోజు అని చెబుతుంది. దీంతో ఈ వేడుకను మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటారు.
కానీ తల్లి మాత్రం అవసరం లేదు అని చెబుతోంది. గోవిందరాజులు కూడా వద్దులే అని చెప్పి మేము ఇద్దరం గుడికి వెళ్లి వస్తాము అని అంటాడు. ఇక ఎలాగైనా తల్లిదండ్రుల పెళ్లిరోజు వేడుకలు చేయాలని రామచంద్ర అందరితో మాట్లాడుతాడు. ఇక రెండవ కొడుకు విష్ణు 5 వేల రూపాయలు ఇస్తాడు. అలాగే అఖిల్ కూడా డబ్బులు ఇచ్చే విధంగా జెస్సి మాట్లాడుతుంది. ఇక అందరూ కూడా పెళ్లి రోజులు సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. మరి ఈ విషయంలో వారి తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











