Janaki Kalaganaledu February 17th: మల్లెపూలతో టెంప్ట్ చేస్తూ రెచ్చగొట్టిన జానకి.. కంట్రోల్ చేసుకున్న రామ!

జానకి కలగనలేదు రోజురోజుకు మరింత మరింత ఆసక్తికరంగా ఆకట్టుకుంటోంది. కుటుంబ పరిస్థితుల వలన కొంత విబేధాలు రావడంతో అఖిల్, విష్ణు విడిపోవాలని అనుకుంటారు. ఇక రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. అయితే అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు. ఇక జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 506 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

మల్లిక హ్యాపీగా ఉన్నప్పటికీ

మల్లిక హ్యాపీగా ఉన్నప్పటికీ

మొత్తానికి పోగొట్టుకున్న ఇంటిని రామచంద్ర వచ్చేలా చేస్తాడు. ఇక ఇంటి పత్రాలను తల్లి చేతిలో పెట్టి చాలా ఆనందంగా వారందరినీ కూడా ఇంటికి తీసుకువెళ్తాడు. అయితే అక్కడ జ్ఞానాంబ మాత్రం మళ్ళీ ఎవరు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోకూడదు అని ఒక షరతు విధిస్తుంది. అంతేకాకుండా ఎవరి కాపురాలు వాళ్ళు చూసుకోవాలి అని చెప్పడంతో అందరూ కూడా మళ్లీ ఒకసారిగా షాక్ ఆవుతారు. ఆ విషయంలో మల్లికా హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా జానకి రామచంద్ర ఇద్దరు కూడా కొంత బాధపడతారు. అందరం కలిసి ఉండాలని అనుకున్నాము కదా మళ్లీ అమ్మ ఎందుకు ఇలా చెప్పింది అని సందేహిస్తూ ఉంటారు.

 అమ్మ నాన్నలకు పెళ్లిరోజు

అమ్మ నాన్నలకు పెళ్లిరోజు

ఇక మరుసటి రోజు తల్లిదండ్రుల పెళ్లిరోజు కావడంతో దాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ జ్ఞానాంబ మాత్రం ఇంట్లో పరిస్థితులను చూసి అసలు ఏమీ వద్దు అని నేను మీ నాన్నగారు గుడికి వెళ్లి వస్తాము అని చెబుతారు. అంతేకాకుండా గోవిందరాజులు కూడా అదే తరహాలో చెప్పడంతో రామచంద్ర జానకి మళ్ళీ ఆలోచనలో పడతారు. తన సోదరులతో మాట్లాడి ఎలాగైనా అమ్మ నాన్నలకు పెళ్లిరోజులు మనమే ఉన్నంతలో బాగా నిర్వహించాలి అని అనుకుంటారు. ఇక ఆ విషయంలో జానకి సపోర్ట్ చేయడంతో రామచంద్ర హ్యాపీగా ఉంటాడు.

సైలెంట్ గా పడుకుంటూ ఉండగా

సైలెంట్ గా పడుకుంటూ ఉండగా

అయితే జ్ఞానాంబ ఎందుకు కొడుకులను సపరేట్ గా ఎవరి కాపురాలు వాళ్లను చూసుకోవాలి అని చెప్పింది అని గోవిందరాజులు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అతను బయటికి వెళ్లి సైలెంట్ గా పడుకుంటూ ఉండగా జ్ఞానంభ వస్తుంది. ఎందుకు ఇక్కడ పడుకుంటున్నారు అని చెప్పడంతో నువ్వు మాట్లాడింది నాకు ఏమి నచ్చలేదు అని ఎందుకు ఎవరి దారి వారు చూసుకోవాలి అని చెప్పావు అని అడుగుతాడు. ఇక జ్ఞానాంబ మరొక విధంగా సమాధానం ఇస్తుంది.

అందుకే ఎవరి ఖర్చులు వారికి తెలియాలి

అందుకే ఎవరి ఖర్చులు వారికి తెలియాలి

అఖిల్ జీతం ఎక్కువగా ఉన్నా కూడా తక్కువగా వస్తుంది అని చెప్పాడు. అలాగే విష్ణు కి సొంతంగా షాప్ ఉంది కానీ ఆ విషయాన్ని మనకు చెప్పలేదు. ఇక రామచంద్ర ఒక్కడు ఇంటి కోసం కష్టపడుతున్నాడు. అందుకే ఎవరి ఖర్చులు వారికి తెలియాలి కాబట్టి ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అని అంటుంది. దీంతో గోవిందరాజులు ఆమెను కూడా అర్థం చేసుకుంటాడు.

మల్లెపూలతో రెచ్చగొట్టిన జానకి

మల్లెపూలతో రెచ్చగొట్టిన జానకి

అయితే మరో వైపు రామచంద్ర మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. ఇక జానకి అప్పుడే గదిలోకి మల్లెపూలు పెట్టుకుని వస్తుంది ఆమె చాలా అందంగా కనిపించడంతో అతను టెంప్ట్ అవుతూ ఉంటాడు. కానీ తొందరపడకూడదు అని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అయితే జానకి మాత్రం కావాలని రామచంద్ర పరిస్థితిని చూసి మల్లెపూలతో అతనిని మరింత రెచ్చగొడుతుంది. ఇక రామచంద్ర చాలా ఓపికగా కంట్రోల్ చేసుకుంటూ అటు తిరిగి పడుకుంటూ ఉంటాడు. ఇక మళ్ళీ జానకి అతని దగ్గరికి జరుగుతూ ఉంటుంది. ఎంత చెప్పినా కూడా జానకి భర్త ముందు సిగ్గుపడుతూ కావాలని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక రామచంద్ర తనని తాను కంట్రోల్ చేసుకుంటూ పక్కకు జరిగి పడుకుని ఉంటాడు.

తులసి పూజ చేస్తూ ఉండగా..

తులసి పూజ చేస్తూ ఉండగా..


ఇక ఉదయాన్నే లేవగానే జానకి వంట పనులు చేసుకుంటూనే చదువుకుంటూ ఉంటుంది. ఆ విషయాన్ని జ్ఞానాంబ గమనిస్తుంది. జానకి ఒక్కతే కష్టపడుతున్నా ఇంకా మల్లికా నిద్రలేవకుండా అలానే పడుకుని ఉంటుంది. ఇక తర్వాత జ్ఞానాంబ తులసి పూజ చేస్తూ ఉండగా ముగ్గురు కోడల్లు కలిసి ఆమెకు పట్టుచీర ఇచ్చి ఈరోజు మీ పెళ్లి రోజు కదా దీన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాము అని అంటారు. అయితే అందుకు జ్ఞానాంబ మాత్రం ఒప్పుకోదు.

 ఒప్పించిన కొడుకులు, కోడళ్ళు

ఒప్పించిన కొడుకులు, కోడళ్ళు

ఇప్పుడే మన కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఇప్పుడు మళ్ళీ అనవసరం ఖర్చులు ఉండకూడదు అని చెబుతతుంది. మనకు ఉన్నతలో బాగా చేసుకుందామని జానకి చెబుతుంది. అదే తరహాలో ముగ్గురు కొడుకులు కూడా తండ్రికి చెబుతూ ఉంటారు. ఇక మొత్తానికి ముగ్గురు మాటలతో ఒప్పిస్తుంటారు. తల్లిదండ్రులు పిల్లల ప్రేమకు ఎదురు సమాధానం చెప్పలేక మొత్తానికి ఒప్పుకుంటారు. ఇక ఆ విషయంలో మేమే గెలిచాము అంటూ జానకి తో పాటు మల్లికా కూడా వారి భర్తలపై నెగ్గేందుకు మాట్లాడుతూ ఉంటారు. విష్ణు తో పాటు అఖిల్ కూడా చెబుతూ ఉంటాడు. మొత్తానికి మళ్ళీ అందరూ సంతోషంగా ఉండడంతో రామచంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరి మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X