JanakiKalaganaledu February 18th: జ్ఞానాంబ పెళ్లి రోజు సర్‌ప్రైజ్..స్పెషల్ గెస్ట్ రావడంతో ఫన్నీ ఫ్లాష్ బ్యాక్
జానకి కలగనలేదు సీరియల్ మరింత ఆసక్తికరంగా ఆకట్టుకుంటోంది. పరిస్థితుల వలన కొంత విబేధాలు రావడంతో అఖిల్, విష్ణు విడిపోవాలని అనుకుంటారు. ఇక రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. అయితే అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు. ఇక జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది.
జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 507 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

పెళ్లి రోజు సెలబ్రేషన్స్
జానకి రామచంద్ర ఇద్దరు కూడా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇక జ్ఞానాంబ గోవిందరాజులు పెళ్లిరోజు కావడంతో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాలని అనుకుంటారు. కానీ జ్ఞానాంబ మాత్రం అందుకు మొదట ఒప్పుకోదు. కేవలం గుడికి వెళ్లి వస్తాము అని గోవిందరాజులు కూడా చెబుతాడు.
అయితే రామచంద్ర మాత్రం తన ఇద్దరు తమ్ముళ్లను ఒప్పించి అందరూ కలిసి సెలబ్రేట్ చేయాలి అని అంటాడు. దీంతో విష్ణు తో పాటు అఖిల్ కూడా డబ్బులు ఇస్తారు. ఇక మరుసటి రోజు పట్టుబట్టలు ఇచ్చి బలవంతంగా జ్ఞానాంబ, గోవిందరాజులు ఇద్దరినీ కూడా వేడుకలకు సిద్ధం కావాలి అని కొడుకు కోడళ్లు చెబుతారు.

పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ..
ఇక జ్ఞానాంబతో పాటు గోవిందరాజులు ఇద్దరు కూడా కొత్త బట్టలు కట్టుకొని చాలా అందంగా రెడీ అవుతారు. ఇద్దరు కూడా ఈ పెళ్లి రోజున కొత్త పెళ్లికొడుకు కొత్త పెళ్లికూతురు తరహాలో ఉన్నారు అని కొడుకులు ఎంతగానో మురిసిపోతారు. ఇక మొదటిసారి అత్తగారు సిగ్గుపడుతూ ఉండడంతో జానకి అలాగే మల్లిక కూడా చూసి ఆనంద పడుతూ ఉంటారు.
ఇక పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా మల్లిక మాత్రం వీరి కారణంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని తన మనసులో తప్పుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జ్ఞానాంబ గోవిందరాజులు ఇద్దరు కూడా దండలు మార్చుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు.

తల్లిదండ్రుల ఆశీర్వాదం
ఇక కొడుకు కోడళ్లు అందరూ కూడా వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇంకా వంటవాడు మలయాళం కూడా ప్రత్యేకంగా వారి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇక అందరూ కూడా ఇంట్లో సంతోషంగా ఉండడంతో జ్ఞానాంబ కొంత ఎమోషనల్ అవుతుంది.
ఇలా అందరినీ సంతోషంగా చూసి ఎన్ని రోజులు అయింది అని తల్లి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక అమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం రామచంద్ర చూడలేకపోతాడు. అయితే అవి కన్నీళ్లు కాదు అని ఆనందభాష్పాలు అంటూ ఈ ఆనందం చూస్తూ మరొక వందేళ్లు బ్రతకాలని ఉంది అని మాట్లాడుతుంది.

పెళ్లిరోజు స్పెషల్ గెస్ట్
ఇక దంపతుల బంధం గురించి తల్లి జ్ఞానాంబ ప్రత్యేకంగా చెబుతుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరిస్థితులను కలిసికట్టుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలి అని అప్పుడే వారి జీవితం ఆనందంగా ఉంటుంది అని ఆమె తెలియజేస్తుంది. ఇక అలా అందరూ ఎమోషన్ అవుతూ ఉన్న సమయంలో రామచంద్ర తన తండ్రికి ఒక ప్రత్యేకమైన గెస్ట్ రాబోతున్నారు ఎవరో ఊహించుకోండి అని చెబుతాడు.
ఎవరో తెలియట్లేదు అని చెప్పడంతో తిలోత్తమ పిన్ని అని రామచంద్ర చెబుతాడు. దీంతో గోవిందరాజులు ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళతాడు. అప్పట్లో ఆమెకు సైట్ కొట్టిన విషయాలను గురించి తెలుసుకుంటాడు. ఇక ఆమె గోవిందరాజులను రాజా అని సరదాగా పిలుస్తూ ఉంటుంది.

మల్లికా కూడా మట్టసంగా ఉంది
దుబాయ్ నుంచి ఇప్పుడే వచ్చాను అని మీ పెళ్లిరోజు కోసమే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను అని చెబుతుంది. ఇక తర్వాత జానకి కూడా ప్రత్యేకంగా ఆమె గురించి అడిగి తెలుసుకుంటుంది.
ఇక తిలోత్తమా అందరిని కూడా పరిచయం చేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా జానకి చక్కగా ఉంది అని అలాగే మల్లికా కూడా చాలా మట్టసంగా ఉంది అని సరదాగా చెబుతూ ఉంటుంది. ఇక ఈరోజు పెళ్లి రోజు కాబట్టి ఇలా సైలెంట్ గా ఉండకూడదు అని అందరూ డాన్స్ చేయాలి అని తిలోత్తమా చెపుతుంది.
కళ్ళు తిరిగి పడిపోయిన జానకి
ముందుగా మల్లికా ఆమె భర్త విష్ణు ఇద్దరు కూడా డాన్స్ చేయాలి అని అందరూ చెబుతారు. ఇక వారి కోరిక మేరకు ఆ దంపతులు డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక తర్వాత గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరూ కలిసి ఆనందంగా డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక డాన్స్ చేసిన అనంతరం అందరూ ఒకే దగ్గర కూర్చుని ఆనందంగా భోజనాలు చేస్తూ ఉంటారు.
ఇక భోజనాలు చేసిన తర్వాత జానకి చేయి కడుక్కోవడానికి వెళుతూ ఉండగా ఒక్కసారిగా ఆమె కళ్ళు తిరిగి పడిపోబోతుంది. అయితే వెనకాలే ఉన్న అత్తగారు ఆమెను పట్టుకుంటారు. అంతా హఠాత్తుగా జానకి ఎందుకు పడిపోతుంది. అసలు ఏం జరిగింది అనే వివరాలు తెలియాలి అంటే తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











