Janaki Kalaganaledu February 21st: అత్తకు వచ్చిన సమస్యతో షాక్ లో జానకి.. ఊహించని పరిస్థితి!
జానకి కలగనలేదు సీరియల్ కథ మరొక కీలక మలుపు తిరుగుతోంది. ఫ్యామిలీలో ఆర్థిక ఇబ్బందుల వలన కొంత విబేధాలు రావడంతో అఖిల్, విష్ణు విడిపోవాలని అనుకుంటారు. ఇక రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. కానీ జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది.
కానీ ఇంతలోనే జ్ఞానాంబ విషయంలో జానకికి ఒక ఊహించని విషయం తెలుస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 509 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

సమస్యలు ఉన్నా కూడా..
రామచంద్ర జానకి సమస్యలు ఉన్నా కూడా ఎల్లప్పుడూ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందరూ కూడా కలిసికట్టుగా సంతోషంగా ఉండాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మరోవైపు మల్లిక మాత్రం ఎప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోదామా అని చూస్తూ ఉంటుంది.
ఇక రామ జానకి ఇద్దరు కూడా జ్ఞానాంబ గోవిందరాజులు పెళ్లిరోజు వేడుకను ఇంట్లోనే సందడిగా నిర్వహిస్తారు. ఈ వేడుకకు జ్ఞానాంబ సోదరీ తిలోత్తమా కూడా వస్తుంది. ఇక ఆమెను చూసిన గోవిందరాజులు చిన్నప్పటి ప్రేమ సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ అల్లరిగా కనిపిస్తూ ఉంటాడు.

చదువుపై శ్రద్ధ పెట్టు
ఇక అందరూ సంతోషంగా ఉండగా జానకి కొంత అస్వస్థతకు గురి అవుతుంది. ఆమెను వెంటనే జ్ఞానాంబ తెలిసినా వైద్యుల దగ్గరికి తీసుకు వెళుతుంది. అక్కడ హాస్పిటల్ లో టెస్ట్ లు చేసిన తర్వాత కొంత ఒత్తిడి వల్ల ఆ విధంగా ఆమె అస్వస్థకు గురి అయింది అని డాక్టర్లు చెబుతారు. దీంతో జ్ఞానాంబ చదువుని అలాగే కుటుంబ పనులని అన్నిటిని కూడా చూసుకుంటున్నావు.
వీలైనంతవరకు నీ చదువుపై శ్రద్ధ పెట్టు అని అత్తగారు చెబుతారు. దీంతో అత్త ప్రేమకు జానకి ఎంతగానో సంతోషిస్తుంది. అయితే బయటకు వెళ్ళిపోతూ ఉండగా జ్ఞానాంబ ఒక్కసారిగా అస్వస్థతకు గురి అవుతుంది. ఇక ఆమెకు కూడా జానకి టెస్టులు చేయాలి అని వైద్యులకు చెబుతుంది.

మల్లికకు తిలోత్తమ సమస్య
ఆ విషయాన్ని జానకి రామచంద్ర కు కూడా చెబుతుంది. అయితే టెస్టులు నిర్వహించిన తర్వాత మళ్లీ ఒకసారి ఫోన్ చేయమని తనకు కంగారుగా ఉంది అని రామచంద్ర అంటాడు. అలాంటిదేమీ లేదు అని జానకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక మరోవైపు మళ్ళీకను తిలోత్తమ నాన తంటాలు పెడుతూ ఉంటుంది. ఆమె పొగరు అనచగొట్టేలా తీవ్రస్థాయిలో పనులన్నీ చెబుతుంది. ఇక ఆమె నుంచి తప్పించుకునేందుకు మల్లికా చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంది.

భయంతో దాక్కున్న మల్లిక
అయితే వంట గదిలో ఉండగా అప్పుడే తిలోత్తమా మల్లికను పిలుస్తూ ఉంటుంది. కానీ మల్లికా వంట మనిషి ద్వారా ఒక గోను సంచిలో దాక్కుంటుంది. ఇక అప్పుడే వంటగదిలోకి గోవిందరాజులు కూడా వస్తాడు. దిష్టి తీయడానికి గుమ్మడికాయ కావాలి ఆ బస్తలోనుంచి తీసి ఇవ్వమని మలయాళంకు చెబుతాడు. కానీ అతను వద్దు అని చెబుతాడు. ఇక కొద్దిసేపు తర్వాత గోవిందరాజులు సంచిని తీసి చూడడంతో అందులో మల్లి కనిపిస్తుంది. దీంతో అందరూ కూడా నవ్వుతూ ఉంటారు.

చదువు, కుటుంబం
మరో వైపు జానకి కాలేజీకు చేరుకోగా అక్కడ ప్రిన్సిపల్ ఆమెకు మరోసారి సలహాలు ఇస్తుంది. నువ్వు ఇటీవల పరీక్షల్లో మళ్ళీ బాగా రానిస్తున్నావు.. ఇలానే కొనసాగితే వచ్చే నెలలో జరిగే మెయిన్స్ లో కూడా నువ్వు విజయం సాధిస్తావు అని ప్రిన్సిపల్ సలహా ఇస్తుంది. అంతేకాకుండా కుటుంబ పరిస్థితుల గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించకూడదు అని ఈ నెల రోజులు మాత్రం నీ దృష్టి కేవలం చదువుపైనే ఉండాలి అని ఆమె చెబుతుంది. కానీ జానకి మాత్రం తన కుటుంబం కూడా చాలా ముఖ్యమని చదువును అలాగే కుటుంబాన్ని సక్రమంగా బ్యాలెన్స్ చేయగలను అని జానకి నమ్మకంతో చెబుతుంది.
జ్ఞానాంబకు ఆ సమస్య రావడంతో..
ఇక తర్వాత హాస్పిటల్ నుంచి జానకికి ఫోన్ వస్తుంది. మీరు వెంటనే హాస్పిటల్ కి రావాలి అని మీ అత్తయ్య గారి రిపోర్ట్స్ వచ్చాయి అని చెబుతుంది. ఇక జానకి వెంటనే డాక్టర్ తో మాట్లాడుతుండగా ఆమెకు ఊహించని చెడు వార్త తెలుస్తుంది. జ్ఞానాంబకు కిడ్నీ సమస్యలు తలెత్తేయని ఒక కిడ్నీ పాడైపోయింది అని డాక్టర్ చెప్పడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తీవ్రస్థాయిలో ఆమె మనోవేదనకు గురి అవుతుంది. ఈ సమస్యను పెద్దదే కానీ ఆమెను చాలా సంతోషంగా చూసుకోవాలి అని ఇలాంటి ఒత్తిడికి గురి కాకూడదు అని డాక్టర్ చెబుతుంది. దీంతో జానకి సరే అని అంటుంది.

మళ్ళీ వెనుకడుగు వేసిన జానకి
ఇక ఆ విషయాన్ని రామచంద్ర కు అలాగే ఇంట్లో ఎవరికి కూడా చెప్పకూడదని డాక్టర్ దగ్గర ను ఆమె బ్రతిమాలుతుంది. అయితే మీరే మెల్లగా చెప్పండి అని డాక్టర్ చెప్పడంతో జానకి ఈడ్చుకుంటూ ఇంటికి వెళుతుంది. అయితే అక్కడ ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఆ రిపోర్ట్స్ ఎవరి కంట పడకూడదు అని జానకి జాగ్రత్త పడుతుంది.
అత్తగారు రిపోర్ట్స్ గురించి అడిగినప్పటికీ కూడా ఏమీ లేదు అని అంత సవ్యంగానే ఉంది అని జానకి అబద్ధం చెబుతుంది. ఇక రామచంద్రను గదిలోకి తీసుకువచ్చి జానకి నిజం చెప్పాలని అనుకుంటుంది.
కానీ అతను తల్లి పై ఉన్న ప్రేమను ఎమోషనల్ గా చూపించడంతో జానకి మళ్ళీ వెనుకడుగు వేస్తుంది. తన స్నేహితుడి వాళ్ళ అమ్మ ఇటీవల చనిపోయింది అని అతని స్థానంలో నేను ఉంటే ఎప్పుడో చనిపోయే వాడిని అని చెబుతాడు. దీంతో జానకి ఆ విషయాన్ని చెప్పడానికి మళ్లీ వెనకడుగు వస్తుంది. మరి ఇది ఆ నిజం రామచంద్రకు ఎలా తెలుస్తుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











