Janaki Kalaganaledu February 22nd: భర్తకు నిజం చేప్పలేకపోయిన జానకి.. మల్లికకు మామగారి కౌంటర్!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వలన కొంత విబేధాలు రావడంతో అఖిల్, విష్ణు విడిపోవాలని అనుకుంటారు. ఇక రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. కానీ జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. కానీ ఇంతలోనే జ్ఞానాంబ విషయంలో జానకికి ఒక ఊహించని విషయం తెలుస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 510 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

జ్ఞానాంబకు అనారోగ్యం

జ్ఞానాంబకు అనారోగ్యం

జానకికి కాస్త అనారోగ్యంతో ఉండడంతో ఆమె అత్తగారు హఠాత్తుగా హాస్పిటల్ కు తీసుకువెళ్తారు. అయితే అక్కడే అత్తగారికి కూడా కాస్త అలసటగా ఉండడంతో జానకి వెంటనే కొన్ని పరీక్షలు చేయిస్తుంది. ఇక జ్ఞానాంబను ఆ తర్వాత ఇంటికి పంపించిన జానకి కాలేజీకి వెళుతుంది. ఇక కాలేజీకి వెళ్లిన తర్వాత ఆమె అత్తగారికి సంబంధించిన రిపోర్ట్స్ గురించి వైద్యులు ఫోన్ చేసి చెబుతారు. ఇక హాస్పిటల్ కి వచ్చి తెలుసుకున్న జానకి షాక్ అవుతుంది. అత్తగారి కిడ్నీలో ఒకటి పాడైపోయింది అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంటుంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే అందరూ బాధపడతారు అని ఆమె ఎవరికీ చెప్పకూడదు అని డాక్టర్ దగ్గర మాట తీసుకుంటుంది.

 మళ్ళీ నిజం దాచిన జానకి

మళ్ళీ నిజం దాచిన జానకి


ఇక తర్వాత రామచంద్ర కు చెప్పాలని కూడా జానకి అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం తన స్నేహితుడి తల్లి చనిపోయినందుకే చాలా బాధపడుతూ ఉంటాడు. అదే పరిస్థితి నాకు వస్తే నేను బ్రతకలేను అని చెబుతాడు. దీంతో జానకి భర్త మీద ప్రేమతో భయపడి ఆ విషయాన్ని చెప్పకుండా ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా సమయం చూసి చెప్పాలి అని అనుకుంటుంది. కానీ ఆమె అత్తగారి విషయంలో తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురి అవుతూనే ఉంటుంది. అంతేకాకుండా అత్తగారు ఏ పని చేసినా కూడా చేయనీయకుండా చూసుకుంటుంది. ఎందుకంటే డాక్టర్ ఆమెపై ఎలాంటి ఒత్తిడి పడకుండా చూసుకోవాలి అని చెబుతోంది. అందుకే జానకి ఇంట్లో పూజ పనులు అలాగే ఇంటి పని కూడా చేయకూడదు అని చెబుతుంది.

 నోరు మూయించిన తిలోత్తమ

నోరు మూయించిన తిలోత్తమ

ఈ క్రమంలో జానకి, జ్ఞానాంబకు కొన్ని టాబ్లెట్స్ కూడా ఇవ్వాలి అని అనుకుంటుంది. అయితే మల్లికా వాటిని చూసి ఎందుకు అంతా ఎక్కువ టాబ్లెట్స్ ఇస్తున్నావు అని అడుగుతుంది. దీంతో వెంటనే తిలోత్తమ వచ్చి మల్లికా నెత్తి మీద కొడుతుంది. నువ్వు ఏమైనా చదువుకున్నావా జానకి కంటే ఎక్కువగా తెలుసా? నీకు అని ఆమె నోరు మూయిస్తుంది. ఇక ఆ తర్వాత పరిస్థితి చూసి జానకి మరింత ఆందోళన చెందుతుంది. ఇక ఉదయాన్నే లేచి అందరికంటే ముందుగానే పూజ చేసి తులసి కోటకు కూడా పూజ చేస్తుంది. అయితే అవన్నీ ఎందుకు చేసావు అని జానకిని జ్ఞానాంబ అడుగుతుంది. మీరు ఇప్పుడు ఆరోగ్యంగా లేరు కాబట్టి కొన్ని రోజులు మీరు మళ్ళీ కుదుటపడే వరకు నేను చూసుకుంటాను అని చెబుతోంది.

వ్యాపారం గురించి మాట్లాడుతుండగా

వ్యాపారం గురించి మాట్లాడుతుండగా


కానీ జ్ఞానాంబ మాత్రం నాకు ఇప్పుడు శక్తి ఉంది అని నాకు కుదిరినన్ని రోజులు నేను నా పనులు చేసుకొనివ్వండి అని మెల్లగానే చెబుతుంది. ఇక ఇలాంటి కోడలు ఉండడం మీ అదృష్టం అంటూ చెబుతుంది. ఇక మరోవైపు రామచంద్ర తన తండ్రితో వ్యాపారం గురించి మాట్లాడుతుండగా అప్పుడే వంటవాడు మలయాళం వచ్చి ఒక మూడు వేలు కావాలని అంటాడు. అయితే అప్పుడు రామచంద్ర దగ్గర కేవలం 1500 మాత్రమే ఉంటాయి. నువ్వు మాత్రమే ఎందుకు ఇస్తావు ఈ ఇంట్లో మరో ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళను కూడా ఇవ్వమని చెప్పాలి అని గోవిందరాజులు తన ఇద్దరు చిన్న కొడుకులను కూడా పిలుస్తాడు.

మామ దెబ్బకు మల్లికకు షాక్

మామ దెబ్బకు మల్లికకు షాక్

ఇంట్లో మలయాళం అందరికీ పనిచేస్తున్నాడు కాబట్టి అతడికి డబ్బులు మీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని చెబుతాడు. కానీ మల్లిక మాత్రం మేము అతన్ని తీసుకురాలేదు అని మీరే తీసుకువచ్చారు అని అయినా మా పనులు మేమే చేసుకుంటున్నాము అన్నట్లుగా మాట్లాడుతుంది. ఇక గోవిందరాజులు మాత్రం ఈ ఇంట్లో ప్రతి దాంట్లో కూడా అందరికీ భాగం ఉంది కాబట్టి ప్రతి నెల కూడా అందరూ కలిసి 20,000 ఇవ్వాల్సిందేనని గోవిందరాజులు చెబుతాడు. ఇక అఖిల్ విష్ణు మల్లికా అలోచిస్తారు. అలా కాకుంటే ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకుంటే మరింత ఎక్కువ ఖర్చు వస్తుంది అని గోవిందరాజులు భయపెట్టడంతో ఆ తర్వాత మళ్ళీ అతని మాటలకు ఒప్పుకుంటారు. ఇక రామచంద్ర మాత్రం మేము అప్పులు పంచుకోమని ప్రేమను మాత్రమే పంచుకుంటాము అని చెబుతాడు. దీంతో ఆ మాటలకు తల్లి ఎంతగానో ఆనందపడుతుంది. ఇక ఆ తర్వాత జానకి రామచంద్ర తో కలిసి బయటకు వెళుతూ ఉండగా డాక్టర్ ను కలవాలని అనుకుంటుంది. మరి ఈసారి జానకి ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X