Janaki Kalaganaledu February 23rd: అత్త ఆరోగ్యం కోసం జానకి ఆరాటం.. చికెన్ పకోడీ గొడవలో మల్లిక!
జానకి కలగనలేదు మరో ఆసక్తికరమైన ఎమోషన్స్ తో ముందుకు సాగుతోంది. ఆర్థిక ఇబ్బందుల వలన కొంత విబేధాలు రావడంతో అఖిల్, విష్ణు విడిపోవాలని అనుకుంటారు. ఇక రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. కానీ జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. కానీ ఇంతలోనే జ్ఞానాంబ విషయంలో జానకికి ఒక ఊహించని విషయం తెలుస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 511 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అసలు విషయం ఎవరికీ తెలియకూడదని..
జ్ఞానాంబకు ఆరోగ్యం బాగోలేదు అని జానకికి డాక్టర్లు చెబుతారు. ఆమె కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంది అని ఇప్పటికే ఒక కిడ్నీ పాడైపోయింది అని అలాగే మరొక కిడ్నీకి కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది అని వైద్యులు చెబుతారు. దీంతో షాక్ అయినా జానకి ఇంట్లో ఆ విషయం ఎవరికీ తెలియకూడదు అని జాగ్రత్త పడుతుంది. అంతేకాకుండా వైద్యులు కూడా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా విషయాన్ని చెప్పాలి అని అంటారు. కానీ జానకి మాత్రం అలా జరగకూడదు అని ఎందుకంటే ఎవరూ కూడా ఈ బాధను తట్టుకోలేరు అని జానకి చెబుతుంది.

ఆ బాధను నేనే భరిస్తాను
ఆ బాధను ఏదో నేనే భరిస్తాను ఎలాగైనా మా అత్తయ్య గారిని నేను బతికించుకుంటాను ఏదైనా మార్గం ఉంటే చెప్పమని జానకి వైద్యులను అడుగుతుంది. అయితే డాక్టర్స్ మాత్రం ఆమెతో మాట్లాడి ఎవరైనా కిడ్నీని దానం చేస్తారేమో అడగాల్సి ఉంటుంది అని కొంతమంది డబ్బులకు కూడా అమ్ముతూ ఉంటారు అని అయితే అది ఆ విషయం బయట తెలిస్తే మాత్రం చాలా సమస్యలు వస్తాయి అని డాక్టర్ చెబుతారు. అయితే మీ మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నీ దానం చేస్తే సరిపోతుందా అని అన్నప్పుడు కిడ్నీ దానం చేయడం అంటే అంత ఈజీ కాదు అని కరెక్ట్ మ్యాచ్ అయితేనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని చెబుతారు.

ఎలాంటి పనులు చేయకుండా
ఇక ముందుగా మీరు మరొక డాక్టర్ని కూడా కలవాల్సి ఉంటుంది అని డాక్టర్ చెబుతుంది. జానకి ఆమె సలహా మేరకు మరొక డాక్టర్ ని కలవడానికి వెళుతుంది. అయితే ఆమె నుంచి జానకి అన్ని విషయాలను అడిగి తెలుసుకుంటుంది. మరోవైపు మల్లిక ఇంట్లో ఎలాంటి పనులు చేయకుండా సమయానికి పకోడీ చేయించుకోవాలి అని అనుకుంటుంది. ఇక పనిమనిషి మలయాళం కు ఎవరికి తెలియకుండా చికెన్ పకోడీ చేయమని చెబుతుంది. ఇక అతను ఇంట్లో వాళ్లకి కాలి ఫ్లవర్ పకోడీ చేసి ఇంట్లో వాళ్ళకు మాత్రం చికెన్ పకోడీ చేశాను అని అంటాడు.

ఆ విషయం తెలిస్తే తిడతారేమో అని..
ఇక మల్లిక దాన్ని తింటూ ఉండే సమయంలో అప్పుడే తిలోత్తమ కూడా వస్తుంది. పకోడీ వాసన గుమగుమలాడిపోతుంది అని వెంటనే కాలిఫ్లవర్ పకోడీ తీసుకెళ్లి గోవిందరాజులు ఇస్తాను అని చెబుతుంది. అయితే ఇంట్లో ఎవరు చికెన్ పకోడీ తినరు కాబట్టి మళ్ళీ ఆ విషయం తెలిస్తే తిడతారేమో అని మల్లిక ఎలాగైనా ఆమె చేతి నుంచి చికెన్ పకోడీ లాక్కోవాలని అనుకుంటుంది. కానీ తిలోత్తమ మాత్రం దాన్ని తీసుకువెళ్తుంది. ఇక హాల్లో కూర్చున్న గోవిందరాజులు ఆమె ప్రత్యేకంగా పకోడీ ఇస్తుంది. ఇక వంటవాడు మలయాళం వచ్చి అది మీకోసం చేసింది కాదు అని చికెన్ పకోడీ ఉన్న గిన్నెను తీసుకొని క్యాలీఫ్లవర్ పకోడీ ఉన్న గిన్నెను ఇస్తాడు.

చికెన్ పకోడీ గోల
ఇక తిలోత్తమా మళ్లీ అతని చేతి నుంచి లాక్కొని గోవిందరాజులకు ఇస్తుంది. ఇక ఆ గడిబిడలో చివరికి గోవిందరాజులు తిలోత్తమ ఇచ్చింది తింటాను అని అంటాడు. ఇక అతను చేతిలోకి తీసుకోవడంతో అది చికెన్ పకోడీ అని తెలుస్తుంది. ఇక ఇంట్లో ఇలాంటివి చేయకూడదు అని తెలుసు కదా ఎందుకు చేసావు అని మలయాళం ను అడుగుతూ ఉండడంతో అప్పుడే మల్లిక వస్తుంది. తన పేరు ఎక్కడ చెబుతారో అని మల్లిక అతనిపై సీరియస్ అవుతూ ఉంటుంది. నువ్వు తినాలని అనుకొని ఇంట్లో వాళ్లకు ఎందుకు ఇచ్చావు అని అంటుంది.

తమ్ముడి గురించి నిజం తెలుసుకున్న రామ
ఇక జ్ఞానాంబకు మాత్రం ఆ విషయం చాలా క్లారిటీకి అర్థమవుతుంది. నువ్వు ఇష్టమొచ్చింది చేసుకొని తినవచ్చు అని ఇక్కడ నిన్ను ఎవరు ఏమీ అనరు అని అంటుంది. దీంతో మల్లిక వెళ్లి హ్యాపీగా దాన్ని తినాలని అనుకుంటుంది. కానీ తిలోత్తమ వచ్చి ఆమెను తిననీయకుండా చేస్తుంది. ఏదో ఒక పని చెప్పి తీవ్ర స్థాయిలో కష్టపెడుతూ ఉంటుంది. ఇక మరోవైపు రామచంద్ర తన స్వీట్ బండి దగ్గర ఉండగా ఒక బ్యాంక్ రికవరీ వ్యక్తి వచ్చి మీ తమ్ముడు ఇంకా షాప్ డబ్బులు కట్టలేదు అని చెబుతాడు. దీంతో రామచంద్ర ఆశ్చర్యపోతాడు. అసలు తమ్ముడికి షాపు లేదు కదా ఇప్పుడు ఉన్నది కూడా సొంతం కాదు అని చెప్పాడు. మరి బ్యాంక్ రికవరీ అతను ఇలా అంటాడు ఏమిటి అని ఆశ్చర్యపోతాడు. ఇక తర్వాత సొంతంగానే వాళ్ళు షాప్ పెట్టుకున్నట్లు గ్రహిస్తాడు. మరి ఈ విషయంలో రామచంద్ర తమ్ముడిని ఏ విధంగా ప్రశ్నిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











