Janaki Kalaganaledu February 24th: జ్ఞానాంబ అనారోగ్యం విషయంలో అనుమానాలు.. నిజం దాస్తున్న జానకి

జానకి కలగనలేదు సీరియల్ విభిన్నమైన ఎమోషన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆర్థిక ఇబ్బందుల వలన కొంత విబేధాలు రావడంతో అన్నదమ్ములు విడిపోవాలని అనుకుంటారు. కానీ పెద్ద కుమారుడు రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. ఇక జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది.

కానీ ఇంతలోనే జ్ఞానాంబ విషయంలో జానకికి ఒక ఊహించని విషయం తెలుస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 512 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అసలు విషయం ఎవరికీ తెలియకూడదని..

అసలు విషయం ఎవరికీ తెలియకూడదని..

అత్త జ్ఞానాంబ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు చెబుతారు. ఆమె కిడ్నీ ఒకటి పాడైపోయింది అని తెలియడంతో జానకి ఎంతగానో మనోవేదనకు గురి అవుతుంది. అయితే ఆ విషయం ఇంట్లో తెలియనివ్వకుండా చేయాలని జానకి అనుకుంటుంది. మళ్ళీ ఇంట్లో తెలిస్తే అందరూ కంగారు పడతారు అని ముఖ్యంగా భర్త రామచంద్రకు తెలిస్తే తట్టుకోలేరు అని జానకి ఆలోచిస్తుంది. అలాగే ట్రీట్మెంట్ కోసం ప్రత్యేకంగా ఆమె వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటుంది.

వెన్నెల ద్వారా..

వెన్నెల ద్వారా..

అయితే జ్ఞానాంబ ఆరోగ్యం కుదురుగా ఉండాలి అంటే తప్పనిసరి మందులు వాడాలి అని డాక్టర్స్ చెబుతారు. అయితే అవి ఇంతకుముందు వేసుకున్న వాటి కంటే ఎక్కువ మోతాదులో ఉండడంతో జ్ఞానాంబ వేసుకోవడానికి ఒప్పుకోదు. ఇక జానకి తను చెప్పకుండా జ్ఞానాంబ కూతురు వెన్నలకు చెప్పి మీ అమ్మ చేత ఈ ముందులు వేయించు అని చెబుతుంది.

ఇక వెన్నెల కూడా మొదట ఇన్ని మందులు ఎందుకు అని అడుగుతుంది. అయితే నీరసంగా ఉన్నప్పుడు ఇలాంటి టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకోవాలి అని వైద్యులు చెప్పినట్లుగా జానకి చెప్పడంతో వెన్నెల కూడా జానకి మాటలు నమ్ముతుంది. ఆ తర్వాత జానకి చెప్పినట్లుగానే తల్లితో వెన్నెల టాబ్లెట్స్ వేయించాలి అనుకుంటుంది.

తెలిసిందిలే అంటూ మల్లిక రివెంజ్

తెలిసిందిలే అంటూ మల్లిక రివెంజ్

ఇక మరోవైపు గోవిందరాజులు తిలోత్తమ మీద ఉన్న ఒక రకమైన ప్రేమ పై మల్లిక కామెడీగా ఆట పట్టిస్తూ ఉంటుంది. మీ ప్రేమ గురించి తెలిసిందిలే అంటూ ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతుంటుంది. కానీ గోవిందరాజులు మాత్రం ఆ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా నిజంగా మల్లికకు నా రహస్యాలు ఎలా తెలుస్తాయి అని అనుకుంటుంది.

కానీ మల్లిక మాత్రం ఏదో ఒక విధంగా మామ గారిని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటుంది. ఇక మరోవైపు ఆమె తిలోత్తమ నుంచి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.

తమ్ముడిపై రామ నిరుత్సాహం

తమ్ముడిపై రామ నిరుత్సాహం

ఇక మరోవైపు రామచంద్ర తన తమ్ముడు విష్ణు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సొంతంగా అతను షాప్ పెట్టుకున్నప్పటికీ కూడా నిజం చెప్పకపోవడంతో అతను కాస్త బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా విష్ణు రాగానే అతనికి అసలు విషయం కూడా అర్థమయ్యేలా చెబుతాడు. ముందుగా నువ్వు స్వీట్స్ కోసం డబ్బులు ఎందుకు పంపించావు అని అడుగుతాడు.

అయితే ఒకప్పుడు అది మన షాప్ కాబట్టి డబ్బులు అడగలేదు ఇప్పుడు ఎవరి వ్యాపారం వారికి అయింది కాబట్టి డబ్బులు ఇవ్వాలి అని విష్ణు అంటాడు. ఇక రామచంద్రా కూడా ఆ విషయంలో ఏమీ అనకుండా బ్యాంకు వాళ్లకు డబ్బులు ఎందుకు కట్టలేదు అని అడుగుతూ.. లోన్ గురించి చెబుతాడు. అది జాగ్రత్తగా చూసుకో అని కూడా రామ వివరణ ఇస్తాడు.

రామ అనుమానం

రామ అనుమానం

ఇక జానకి అత్త గారి ఆరోగ్య విషయంలోనే కాస్త కంగారుగా ఉంటుంది. ఇక రామచంద్ర గదిలోకి వచ్చి జానకిని ఎందుకు అలా ఉన్నారు అని అనుమానిస్తాడు. మీరు కాలేజీకి కూడా వెళ్లకుండా హాస్పిటల్ కు ఎందుకు వెళ్లారు? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు? అని అంటాడు. కానీ జానకి మాత్రం అసలు విషయం చెప్పకుండా జెస్సి ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి కాబట్టి నేనే డాక్టర్ గారితో మాట్లాడాలని వెళ్లాను అని జానకి చెబుతుంది.

ఇక జానకి కోసం అఖిల్ ఉన్నాడు కదా అని రామచంద్ర చెప్పినప్పటికీ జానకి నాకు తెలిసినంతగా జెస్సి గురించి అతనికి తెలియదు అని అందుకే నేనే వెళ్లాల్సి వచ్చింది అని జానకి చెబుతుంది.

డాక్టర్ ద్వారా నిజం దాచిన జానకి

డాక్టర్ ద్వారా నిజం దాచిన జానకి

ఇక వెన్నెల జానకి చెప్పినట్లుగా తల్లికి టాబ్లెట్ ఇవ్వాలని అనుకుంటుంది. అయితే జ్ఞానాంబ మాత్రం ఇన్ని టాబ్లెట్లు నేను ఎందుకు వేసుకోవాలి అని నేను ఏమీ అనారోగ్యానికి గురికాలేదు అని చెబుతోంది. అయినప్పటికీ కూడా జానకి చెప్పింది కాబట్టి వేసుకోవాలి అని గోవిందరాజులు అంటాడు. అయినా కూడా ఎప్పుడు ఇన్ని టాబ్లెట్స్ వేసుకోలేదు అని కూడా అతను గ్రహిస్తాడు.

ఇక అప్పుడే ఇంట్లోకి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి వచ్చిన కొందరు సర్వేలో భాగంగా మీ కుటుంబం ఆరోగ్యంగా ఉందా లేదా అనే విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాట్లుగా చెబుతారు. దీంతో అప్పుడే జ్ఞానాంబ జానకి ఇచ్చిన టాబ్లెట్స్ ఎందుకో తెలుసుకోవాలి అని ఇంటికి వచ్చిన డాక్టర్ కు ఇస్తుంది. అయితే జానకి ఆ డాక్టర్ కు సైగ చేసి నిజం చెప్పవద్దు అని అంటుంది. ఇక అంతే కాకుండా తర్వాత జానకి డాక్టర్ తో మాట్లాడుతుండడం రామచంద్ర చూస్తాడు. మరి ఈ విషయంలో రామచంద్ర జానకిని ఏ విధంగా ప్రశ్నిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X