Janaki Kalaganaledu February 27th: నిజం తెలుసుకునేందుకు జ్ఞానాంబ ప్రయత్నం.. షాకింగ్ ట్విస్ట్!

జానకి కలగనలేదు సీరియల్ ఆసక్తికరమైన కథనంతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఆర్థిక సమస్యల వలన కొంత విబేధాలు రావడంతో అన్నదమ్ములు విడిపోవాలని అనుకుంటారు. కానీ పెద్ద కుమారుడు రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. ఇక జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది.

కానీ ఇంతలోనే జ్ఞానాంబ విషయంలో జానకికి ఒక ఊహించని విషయం తెలుస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 513 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

ఇంట్లో ఎవరికీ చెప్పకుండా

ఇంట్లో ఎవరికీ చెప్పకుండా

జ్ఞానాంబ ఆరోగ్యం బాగోలేకపోవడంతో కోడలు జానకి తీవ్రస్థాయిలో బాధకు లోనవుతుంది. ఆమె కిడ్నీ సమస్యతో ఉంది అని వెంటనే కిడ్నీ మార్పిడి జరగకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది అని వైద్యులు కూడా చెబుతారు. ఇక అదే విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తనలో తనే బాధపడుకుంటూ కనిపించేది.

అయితే ఆ సంగతి రామచంద్రకు తెలియడంతో అతను కూడా షాక్ కు గురవుతాడు. మళ్ళీ తన తల్లిని ఎలాగైనా బ్రతికించుకోవాలని అనుకుంటాడు. అయితే కిడ్నీని దానం చేయడానికి జానకి ఒప్పుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం అందుకు సముకంగా ఉండడు.

చదువుపై ఫోకస్

చదువుపై ఫోకస్

మీరు ఐపీఎస్ కావాలి అనేది ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న కల. ఇప్పుడు హఠాత్తుగా మీరు కిడ్నీ ఇస్తే మీ లక్ష్యాన్ని దూరం చేసుకున్న వాళ్లు అవుతారు. తప్పకుండా ఎవరో ఒకరు మ్యాచ్ అయ్యేవారు దొరుకుతారు అని అప్పటివరకు కాస్త ఓపిక పట్టండి అని రామచంద్ర తన భార్య జానకికి చెబుతాడు.

అయితే జానకి భర్త చెప్పిన మాటలకు కట్టుబడి తన చదువుపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జానకి ఇంట్లో చదువుకోవాలని అనుకుంటున్నాప్పటికీ కూడా ఇంట్లో పరిస్థితులు ఆమెకు సరిగా అనుకూలించవు. నిత్యం ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది.

తల్లి ఆరోగ్యం గురించి

తల్లి ఆరోగ్యం గురించి

ఇక మరోవైపు రామచంద్ర తల్లి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ బాధలో కనిపిస్తూ ఉంటాడు. ఇక అతని పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎందుకు రామచంద్ర అలా ఉన్నాడు అని అనుకుంటారు. ఇక వెంటనే గోవిందరాజులు వెళ్లి రామచంద్రను అడుగుతాడు.

ఎందుకు ఏదో బాధలో కనిపిస్తూ ఉన్నావు అని అడగడంతో రామచంద్ర అలాంటిది ఏమీ లేదు అని అంటాడు. ఇక ఆ తర్వాత జ్ఞానాంబ మొక్కలకు నీళ్లు పడుతూ ఉంటుంది. ఇక వెన్నెల వచ్చి నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అని తల్లికి చెబుతూ ఉంటుంది. నీ ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాలి అని అంటుంది.

జానకి సీరియస్

జానకి సీరియస్

అయితే ఇంతలోనే ఇంట్లో పనివాడు మలయాళం వచ్చి అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి అని అంటాడు. అయితే జానకి ఆ విషయంలో చాలా సీరియస్ అవుతుంది. నువ్వు ఇంట్లో పని చేయడానికి ఉన్నావు నువ్వు పని చేయకుండా అత్తయ్య గారితోటి ఎందుకు పనిచేయిస్తున్నావని అతన్ని తిడుతూ ఉంటుంది. నీకు పని చేయడం కుదరకపోతే వెంటనే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపో అని కూడా హెచ్చరిక చేయడంతో అందరూ కూడా ఒకసారి ఆశ్చర్యపోతాడు. అంత హఠాత్తుగా జానకి ఎందుకు సీరియస్ అవుతుందో అని అత్తగారితోపాటు గోవిందరాజులు కూడా అనుకుంటాడు.

తల్లిదండ్రులను గుర్తు చేసుకున్న జానకి

తల్లిదండ్రులను గుర్తు చేసుకున్న జానకి

ఇక జానకి అత్తమామలకు కూడా సేవలు చేస్తూనే తన చదువును కూడా కొనసాగిస్తూ ఉంటుంది. పరీక్షలకు సమయం దగ్గర పడుతూ ఉంది అని మొదట జానకి ఫోకస్ చేయండి అని రామచంద్ర కూడా అనుకుంటాడు. ఇక మరోవైపు జ్ఞానాంబ ఆరోగ్యం కూడా రోజురోజుకు క్షీణిస్తూ ఉంటుంది.

ఇక మొత్తానికి జానకి పరీక్షలు రాయడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఉదయాన్నే హాల్ టికెట్ మర్చిపోయినప్పటికీ జెస్సి వెంటనే గుర్తు చేస్తుంది. ఇక తర్వాత పరీక్ష హాల్లో కూర్చున్నప్పుడు జానకి తన తల్లిదండ్రుల గుర్తు చేసుకుంటుంది. అలాగే రామచంద్ర కోరిక కూడా నేను ఐపిఎస్ కావడమే అని ఆమె గ్రహిస్తుంది. ఇక వెంటనే ఆమె పరీక్ష పై ఫోకస్ పెడుతుంది.

నిజం కోసం జ్ఞానాంబ ప్రయత్నం

నిజం కోసం జ్ఞానాంబ ప్రయత్నం

ఇక మరోవైపు ఇంట్లో జానకి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇంతలోనే జ్ఞానాంబ కొంత నీరసంగా కనిపిస్తూ ఉంటుంది. వెంటనే టాబ్లెట్స్ వేసుకోమని భర్త గోవిందరాజులు అంటాడు. అయితే జానకి అసలు తనకు ఆ టాబ్లెట్స్ ఎందుకు ఇస్తుందో తెలుసుకోవాలి అని జ్ఞానాంబ హాస్పిటల్ కు వెళ్లాలని అనుకుంటుంది.

ఇక జానకి రాగానే అత్తగారు ఇంట్లో లేరు అని టాబ్లెట్స్ అయిపోతే తెచ్చుకోవడానికి బయటకు వెళ్లారని వెన్నెల చెబుతుంది. ఇక జానకి అత్తగారిని వెతుక్కుంటూ బయటికి వెళుతుంది. ఇక జ్ఞానాంబ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ తెలివిగా డాక్టర్ తో మాట్లాడి అసలు నిజం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

నాకు మొత్తం జానకి చెప్పేసింది అని అనడంతో డాక్టర్ కూడా ఆమెకు నిజం చెప్పారేమో అనుకొని కిడ్నీ సమస్య గురించి చెప్పాలని అనుకుంటుంది. మరి పూర్తిస్థాయిలో జ్ఞానాంబ నిజా నిజాలు తెలుసుకుంటుందో లేదో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X