Janaki Kalaganaledu February 28th: మరణం గురించి ముందే తెలుసుకున్న జ్ఞానాంబ.. మరింత బాధలో జానకి!
జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన కథనంతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. అప్పుల సమస్యల వలన విబేధాలు రావడంతో అన్నదమ్ములు విడిపోవాలని అనుకుంటారు. కానీ పెద్ద కుమారుడు రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. అయితే జానకి ఆ సమస్య నుంచి బయటపడేలా చేసి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది.
ఇక ఇంతలోనే జ్ఞానాంబ విషయంలో జానకికి ఒక ఊహించని విషయం తెలుస్తుంది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 7.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 513 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

జ్ఞానాంబ అనారోగ్యం గురించి..
జ్ఞానాంబ అనారోగ్యం గురించి కోడలు జానకి తీవ్రస్థాయిలో బాధకు లోనవుతుంది. కిడ్నీ సమస్యతో ఉన్న జ్ఞానాంబకు కిడ్నీ మార్పిడి జరగకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు చెబుతారు. అయితే జానకి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఉండాలని అనుకుంటుంది. ఇక ఆ సంగతి రామచంద్రకు కూడా తెలియడంతో షాక్ కు గురవుతాడు.
అలాగే తన తల్లిని ఎలాగైనా బ్రతికించుకోవాలని కూడా రామ అనుకుంటాడు. మొదట కిడ్నీని దానం చేయడానికి జానకి ఒప్పుకుంటుంది. ఇక రామచంద్ర మాత్రం అందుకు ఎంతమాత్రం ఒప్పుకొడు. మీరు ఐపీఎస్ అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నారు. ఎవరైనా దాతలు ఉంటే చూద్దామని అంటారు.

తెలివిగా మాట్లాడుతూ..
ఇక జానకీ అత్త ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆమెకు తరచుగా టాబ్లెట్స్ ఇస్తూ ఉండడంతో జ్ఞానంభకు అనుమానం వస్తుంది. అసలు తన ఆరోగ్యం గురించి నిజా నిజాలు తెలుసుకోవాలి అనే హాస్పిటల్ కి కూడా వెళుతుంది. ఇక అక్కడ డాక్టర్ దగ్గర మాట్లాడుతూ ఉన్న జ్ఞానాంబ నిజం తెలుసుకోవాలి అని తెలివిగా మాట్లాడుతూ ఉంటుంది.
జానకి నాకు ముందే అంత చెప్పింది అని అనడంతో డాక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. దీంతో మీరు చనిపోతారు అని తెలిసినా కూడా.. అంటూ నిజం చెప్పబోతుండగా జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది.

నిజం తెలుసుకున్న జ్ఞానాంబ
తాను చనిపోతున్నానా అని షాక్ అయినా జ్ఞానాంబ అందుకేనా ఇన్ని రోజులు జానకి తనలో బాధను దాచుకుంటూ నాతో అలా ప్రవర్తించింది అని అనుకుంటుంది. అయితే అప్పుడే జానకి వేగంగా హాస్పిటల్ కి వచ్చి అక్కడ జ్ఞానాంబ ఉండడాన్ని చూస్తుంది. అయితే ఇంకా అత్తగారికి అసలు విషయం తెలియదేమో అని మంచి టాబ్లెట్స్ ఇవ్వాలి అని డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటుంది. కానీ జ్ఞానాంబ మాత్రం అప్పుడే అసలు విషయం చెబుతుంది. ఇన్ని రోజులు నువ్వు దాచిన విషయం నాకు తెలిసిపోయింది అని అనడంతో జానకి ఆశ్చర్యపోతుంది.

ఎంతగానో కృంగిపోయావు
ఇక జానకితో ప్రత్యేకంగా మాట్లాడిన అత్తగారు నువ్వు ఇన్ని రోజులు నాతో అలా ప్రవర్తిస్తూ ఉంటే ఏదో అనుకున్నాను. కానీ ఎవరికి నిజం తెలియకుండా నీలో నువ్వే బాధను దాచుకొని ఎంతగానో కృంగిపోయావు. ఇప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని ప్రతి ఒక్కరికి కూడా వారి మరణం గురించి తెలియదని అయితే నాకు మాత్రం ఈ విషయం ముందుగానే తెలిసినందుకు సంతోషపడుతున్నాను అని అంటుంది.
అంతేకాకుండా నా కోసం ఎవరో బాధపడకూడదు అని ఉన్నన్ని రోజులు కూడా అందరి సంతోషాలను చూసి నేను కన్నుమూస్తాను అని జ్ఞానాంబ చెబుతుంది.

మాట తీసుకున్న జ్ఞానాంబ
అయితే అత్తగారు అలా మాట్లాడుతూ ఉండడంతో జానకి తట్టుకోలేక పోతుంది. మిమ్మల్ని ఎలాగైనా బ్రతికించుకుంటాను అత్తయ్య గారు అని అంటుంది. కానీ జ్ఞానాంబ మాత్రం నా కోసం ఎవరు సమయాన్ని సంతోషాన్ని వృధా చేసుకోకూడదు అని అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అని కూడా మాట తీసుకుంటుంది. ఇక ఆ తర్వాత మరోవైపు ఈ విషయం తెలియని ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సరదాగానే ఉంటారు.

జెస్సి తండ్రి ఫోన్ కాల్
ఇక గోవిందరాజులు, పనివాడు మలయాళం చేసిన తప్పుల కారణంగా అతన్ని కొట్టడానికి వెళుతూ ఉంటాడు. ఇక ఇంతలో కింద పడిపోతూ ఉంటే తిలోత్తమ వచ్చి అతని పట్టుకుంటుంది. ఇక వారిని చూసిన మల్లిక సెటైర్లు వేస్తూ ఉంటుంది. ఇక వారి మధ్య కొంత కామెడీగా ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లోకి రాగానే గోవిందరాజులకు ఫోన్ వస్తుంది. జెస్సి వాళ్ళ నాన్న ఫోన్ చేసి డెలివరీకి మా అమ్మాయిని ఇంటికి పంపించాలి అని అడుగుతాడు.
ఏమీ అర్థం కావడం లేదు
అయితే అందుకు గోవిందరాజులు జ్ఞానాంబ మాట్లాడి తప్పకుండా పంపిస్తాను అని అంటాడు. అయితే జ్ఞానాంబ మాత్రం అందుకు ఒప్పుకోదు. ఇంట్లో ఎవరూ కూడా బయటకు వెళ్లడానికి వీలులేదు అని జెస్సీ కడుపులో పెరుగబోయే బిడ్డ మన ఇంటికి మొదటి వారసుడు అని అయితే అతను ఇంట్లోనే జన్మించాలి అని జ్ఞానాంబ కండిషన్ పెడుతుంది.
ఇక జ్ఞానాంబ అలా ఎందుకు మాట్లాడుతుందో గోవిందరాజుకు అర్థం కాదు. ఇక జానకి బయటకు వెళ్లి అత్తగారి గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. అయితే అప్పుడు రామచంద్ర వస్తాడు. తనకు కూడా ఏమీ అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. ఇక జానకి ఎలాగైనా అత్తగారిని నేను బ్రతికించుకుంటాను అని నాకు ఆమె కంటే ఏది ఎక్కువ కాదు అని కిడ్నీ డొనేషన్ గురించి మాట్లాడుతుంది.
కానీ రామచంద్ర మాత్రం అందుకు ఒప్పుకోడు. మా అమ్మ కోసం మీ లక్ష్యాన్ని ప్రాణాలను పణంగా పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. మరి ఈ విషయంలో జానకి ఏ విధంగా అడుగులు వేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











