twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu February 2nd: దొంగచాటుగా మల్లిక వ్యాపారం.. భర్తతోనే మరోసారి అబద్ధాలు!

    |

    జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన అంశంతో ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. తమ్ముడు అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు. ఇక ఆ ఇబ్బందుల వలన కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది. అయితే జానకి గొడవలు రాకుండా ఎవరు విడిపోకుండా చూడాలని అనుకుంటుంది. అయితే జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 493 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

    మామ గారి ఆరోగ్యం కోసం

    మామ గారి ఆరోగ్యం కోసం

    ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం అలాగే మరోవైపు తండ్రికి పక్షవాతం వచ్చి నడవలేని పరిస్థితుల్లో ఉండడంతో రామచంద్ర ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. సరికొత్తగా మళ్ళీ చక్రాల బండి మీద స్వీట్ షాప్ మొదలుపెడతాడు. ఇక రామ భార్య జానకి ఎలాగైనా మామగారికి ఆరోగ్యం మెరుగుపడాలని మొత్తానికి తన స్నేహితురాలి ద్వారా హాస్పిటల్ కు తీసుకు వెళుతుంది. అక్కడ వైద్య పరీక్షల అనంతరం గోవిందరాజులు కొలుకుంటారు అని చెప్పడంలో అందరూ సంతోషిస్తారు. ఇక రామ జానకి గోవిందరాజులు ఆరోగ్యం మెరుగుపడాలి అని చాలా ప్రయత్నాలు చేస్తారు. దీంతో మొత్తానికి ఆయన సంతోషంగా లేచి నిలబడుతూ నడుస్తూ ఉంటారు. ఇక తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా ఎంతగానో ఆనందపడతారు.

     అత్తగారి ఆశీర్వాదం

    అత్తగారి ఆశీర్వాదం

    జానకి కూడా ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంటుంది అయితే అత్తగారు జ్ఞానాంబ మాత్రం ఇంకా జానకితో కాస్త కోపంగానే ఉంటుంది. కానీ జానకి మాత్రం ఆ కోపాన్ని కూడా తగ్గించేలా చేయాలని అనుకుంటుంది. ఇక జ్ఞానాంబ హాల్లో కూర్చుండగా జానకి కాలేజీ కి వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఇక పక్కనే ఉన్న దేవత ఫోటోకి మొక్కుతూ అత్తగారికి ప్రేమను కురిపిస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. మాతో మాట్లాడిన మాట్లాడకపోయినా ఎల్లప్పుడూ మీ దీవెనలు మాతో ఉంటే చాలు అత్త వినిపించేలా దేవతను కోరుకుంటూ ఉంటుంది. ఇక జ్ఞానాంబ కూడా జానకి తన గురించే మాట్లాడుతుంది అని అనుకుంటుంది. ఇక జానకి మాత్రం మరో ఆలోచన చేయకుండా అత్తగారి కాళ్లకు నమస్కారం పెడుతూ అక్కడి నుంచి బయటికి వెళుతుంది.

    ఎలాంటి ఇబ్బంది కలగదు..

    ఎలాంటి ఇబ్బంది కలగదు..

    అప్పుడే రామచంద్ర కూడా తన చక్రాల బండిని తీసుకువెళ్లి మార్కెట్లోకి వెళ్లాలని అనుకుంటాడు. అయితే జానకి కూడా అతని వెంటే వస్తానని చెబుతూ ఉంటుంది. మీరు పుస్తకాలు పట్టుకొని ఈ తరహాలో నా వెంట వస్తూ ఉంటే చూసే వాళ్లకు బాగుండదు అని రామచంద్ర అంటాడు. అయితే ఇది మన జీవితానికి ఎంతో ఉపయోగపడింది దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు అయినా దాన్ని మనం తక్కువగా చూడకూడదు అనే విధంగా జానకి మాట్లాడుతూ భర్తపై ఎంతో ప్రేమను చూపిస్తుంది. ఇక వారి ప్రేమను చూసిన అత్తగారు మామగారు కూడా ఎంతగానో ఆనందపడతారు. ఇక గోవిందరాజులు జ్ఞానాంబ దగ్గరికి వచ్చి కొడుకు కోడలి అనుబంధాన్ని చూసి ఆనంద పడుతున్నావు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇక మొత్తానికి ఆమె కోపం తగ్గిందని కూడా ఆయన అనుకుంటారు.

     మల్లిక కొత్త షాప్ ఓపెన్

    మల్లిక కొత్త షాప్ ఓపెన్

    ఇక గోవిందరాజులు తన భార్యతో కలిసి గుడికి వెళ్లాలని అనుకుంటారు. అయితే అప్పుడే మల్లిక ఇద్దరు కూడా గుడికి వెళుతున్నట్లు చెబుతారు. అయితే నిజానికి మల్లిక ఆమె భర్త విష్ణు గుడికి వెళ్లారు. కొత్త షాప్ ఓపెన్ చేయడానికి వెళతారు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా మల్లిక భర్త ద్వారా కొత్త షాప్ ను ఓపెన్ చేయిస్తుంది. ఇక ఆ హడావిడిలోనే ఆమె షాప్ లో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక అటువైపుగా వెళుతున్న జానకి రామచంద్ర ఇద్దరూ కూడా మల్లికా ఒక బట్టల షాప్ లో ఉండడం చూస్తు వీరు గుడికి వెళ్తానని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. అసలు విషయం తెలుసుకోవడానికి జానకిరామ ఇద్దరు కూడా బట్టల షాప్ లోకి వెళతారు.

    మల్లికకు మరో షాక్

    మల్లికకు మరో షాక్

    అయితే అక్కడ మల్లిక వారిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే విష్ణు అసలు నిజం చెప్పాలని అనుకున్నప్పటికీ కూడా మల్లిక మాత్రం చెప్పనివ్వదు. అయితే అప్పుడే గుడికి వచ్చిన గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరు కూడా ఒక జాకెట్ ముక్క కొనుక్కోవాలి అని పక్కనే ఉన్న షాప్ లోకి వెళతారు. అయితే అందులోనే మల్లిక విష్ణు ఇద్దరు కూడా ఉంటారు. అసలు మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతారు.

    అఖిల్ కు ఉద్యోగం

    అఖిల్ కు ఉద్యోగం

    ఇక భర్త విష్ణు మాట్లాడుతుండగా మల్లికా కలుగజేసుకొని ఇది వీరి స్నేహితుడి షాప్ అని ఆయనే పెట్టించారు అని మల్లిక అబద్ధాలు చెబుతుంది. దీంతో రామచంద్ర ఎవరు ఆ స్నేహితుడు అని అడుగుతాడు. ఇక పక్కనే ఉన్న మరో పని వారిని చూపించి మల్లిక అబద్ధం చెబుతుంది. ఇక జానకికి కాస్త అనుమానం కలిగినప్పటికీ ఏమాత్రం పట్టించుకోదు. ఇక మొత్తానికి అక్కడ తల్లి బోణీ చేయడంతో విష్ణు సంతోషిస్తాడు. ఇక మరోవైపు జెస్సీ భర్తకు మామ ఉద్యోగం ఇప్పిస్తాడు. అతనిపై కోపంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం తన కూతురి కోసం ఇచ్చానని చెబుతాడు. మరి ఈ విషయంలో అఖిల్ ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Serial 2023 February 2nd Episode on 494
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X