Janaki Kalaganaledu February 3rd: అఖిల్ జాబ్ విషయంలో జ్ఞానాంబ హ్యాపీ.. ఎంట్రీ ఇచ్చిన మరో న్యూ క్యారెక్టర్!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తికరమైన ఎమోషన్స్ తో ఆకట్టుకుంటోంది. కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా కూడా రామచంద్ర తన కష్టంతో అందరిని బాగా చూసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు. ఇక ఆ ఇబ్బందుల వలన ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది.

అయితే జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది. అయితే జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 494 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

అఖిల్ జాబ్ కోసం జెస్సి ఆలోచన

అఖిల్ జాబ్ కోసం జెస్సి ఆలోచన

ఇంట్లో రామచంద్ర కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించి మళ్లీ చక్రాల బండి మీద స్వీట్స్ అమ్ముతూ డబ్బులు సంపాదిస్తు ఉంటాడు. అయితే రామ ఒక్కడే కష్టపడుతూ ఉంటే అఖిల్ మాత్రం ఇంకా ఖాళీగానే తిరుగుతున్నాడు అని అతని భార్య జెస్సి జాబ్ వచ్చేలా చేయాలి అని అనుకుంటుంది. ప్రత్యేకంగా తన తండ్రితో మాట్లాడి అఖిల్ కు ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెబుతూ ఉంటుంది.

ఇక జెస్సి చెప్పినట్లుగానే అతని తండ్రి అఖిల్ కోసం జాబ్ ఇస్తాడు. అఖిల్ కు జాబ్ రావడంతో జెస్సి కూడా ఎంతగానో సంతోష పడుతూ ఉంటుంది ఆ విషయాన్ని ఆమె జానకితో చెప్పుకుంటూ ఉంటుంది.

జ్ఞానాంబ సంతోషం

జ్ఞానాంబ సంతోషం

ఇక అప్పుడే ఇంట్లోకి వచ్చిన అఖిల్ తనకు జాబ్ వచ్చింది అని తన తల్లిదండ్రులతో చెబుతాడు. అన్నయ్య మాత్రమే కష్టపడుతున్నాడు అని నేను కష్టపడడం లేదు అని ఇన్ని రోజులు అన్నారు కదా నాకు కూడా జాబ్ వచ్చింది అని చాలా కోపగా చెబుతూ ఉంటాడు. అయితే రామచంద్రుడు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని గోవిందరాజులు మరోసారి అతనికి కౌంటర్ ఇస్తాడు.

ఇక అఖిల్ కు జాబ్ వచ్చింది అని తల్లి జ్ఞానాంబ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే జీతం ఎంత అని గోవిందరాజులు అడుగుతాడు. అతను 15 వేలు మాత్రమే అని చెబుతాడు. అయితే నీ చదువుకు ఇంకా ఎక్కువ స్థాయిలో జీతం వస్తుంది ఏమో అనుకుంటే మరీ అంత తక్కువ అని తండ్రి అడుగుతాడు.

అబద్ధాలు చెప్పిన అఖిల్

అబద్ధాలు చెప్పిన అఖిల్

ముందుగానే అందరూ లక్షల్లో జీతాలు ఇవ్వరు అని అఖిల్ మళ్ళీ తన తండ్రితో కోపంగా చెబుతూ ఉంటాడు. ఇక ఏది ఏమైనా తన కొడుకుకు ఉద్యోగం వచ్చింది అని జ్ఞానాంబ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే అఖిల్ తన జీతం గురించి తప్పుగా చెప్పడంతో అతని భార్య వెళ్లి అడుగుతుంది. నీకు 30 వేలు జీతం కదా ఎందుకు అలా తక్కువ అని చెప్పావు అని అంటుంది. ఇంట్లో అలా చెప్పకూడదు అని ఇక జాబ్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోయి మరో సంసారం పెట్టాలి అని అఖిల్ మాట్లాడుతాడు.

అయితే జెస్సి మాత్రం అలా ఆలోచించడం తప్పు అని అనడంతో అఖిల్ మరింత కోపంగా ఉంటాడు. నాకు ఇంట్లో వాళ్లతో ఉండాలని ఇష్టం లేదు అని నువ్వు కూడా ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా లెక్క చేయను అని చెప్పడంతో జెస్సి ఏమీ అనకుండా ఉంటుంది.

ఎక్కువ మాట్లాడితే..

ఎక్కువ మాట్లాడితే..

మరోవైపు రెండవ కోడలు మల్లిక కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. అఖిల్ కు జాబ్ వచ్చింది కాబట్టి అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇక మనం కొత్తగా షాప్ పెట్టాము కాబట్టి మనం కూడా వెళ్ళిపోవచ్చు అని మల్లిక తన భర్త విష్ణుతో చెబుతూ ఉంటుంది. అయితే రామచంద్రతో పాటు కొడుకులిద్దరు కూడా సెటిల్ కావడంతో వారి తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు. మన అప్పులు వెంటనే తీరిపోతాయి అని కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు.

జానకి ఎమోషనల్

జానకి ఎమోషనల్

అయితే మరోవైపు రామచంద్ర తన భార్య ఐపీఎస్ డ్రీమ్ కోసం కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఆమెకు ప్రత్యేకంగా పుస్తకాలు కూడా తీసుకొస్తాడు. నేను ఐపీఎస్ ఆఫీసర్ కావాలని అనుకున్నాను కానీ కుటుంబ పరిస్థితుల వలన కాలేకపోయాను. ఇప్పుడు మీరు ఆ కలను నెరవేర్చాలి అని అందుకోసం నేను ఎంతగా కష్టమైనా భరిస్తాను అని రామచంద్ర చెబుతాడు. అందుకు జానకి ఎంతగానో ఎమోషనల్ అవుతుంది.

ఇంట్లో కొత్త పనివాడు

ఇంట్లో కొత్త పనివాడు

ఇక గోవిందరాజులు ఇంట్లో ఎవరైనా కాఫీ పెడతారేమో అని ఎదురుచూస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా మల్లికను కాఫీ తీసుకు రమ్మని అంటాడు. కానీ మల్లిక మాత్రం తన ఆరోగ్యం బాగోలేదు అని వంట గదిలోకి కూడా వెళ్ళవద్దు అని డాక్టర్లు చెప్పారు అని అబద్ధాలు చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడే బయట నుంచి ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించడంతో మల్లిక బయటకు వెళ్లి చూస్తోంది.

అయితే అతను నా పేరు మలయాళం అంటూ మీ ఇంట్లో పని చేయడానికి వచ్చిన వంట వాడిని అని చెబుతాడు. దీంతో మల్లిక అతని అవతారం చూసి షాక్ అవుతుంది. కానీ నిజానికి అతనికి వంట ఏమాత్రం రాదు. ఇక్కడికి నేర్చుకోవాలని ఆలోచనతో వస్తాడు. గోవిందరాజులు అప్పుడే తనకి మంచి కాఫీ పట్టుకురా అని చెబుతాడు.

ఇక మరోవైపు అఖిల్ తనకు జాబ్ వచ్చిన విషయాన్ని తన అన్నయ్యతో మాత్రం అసలు చెప్పడు. ఆ విషయంలో జానకి కొంత బాధపడుతూ ఉంటుంది. మరి ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X