Janaki Kalaganaledu February 6th: మలయాళం ఆలోచనతో మల్లిక న్యూ ప్లాన్.. మరో కౌంటర్ ఇచ్చిన జానకి!

జానకి కలగనలేదు విభిన్నమైన కథాంశంతో ఆకట్టుకుంటోంది. ఇక కుటుంబ పరిస్థితి కష్టాల్లో ఉన్న సమయంలో రామచంద్ర అందరిని బాగా చూసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. అఖిల్ జాబ్ కారణంగా అప్పు చేసిన రామ ఆస్తులు పోగొట్టుకొని కష్టాలపాలవుతాడు. అయితే ఆ ఇబ్బందుల వలన ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. అయితే జానకి గొడవలు రాకుండా చూడాలని అనుకుంటుంది.

ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ మరింత పెరిగాయి. 8.95 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 496 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

 బిల్డప్ ఇచ్చిన గోవిందరాజులు

బిల్డప్ ఇచ్చిన గోవిందరాజులు

పాత పనిమనిషి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో గోవిందరాజులు తనకు తెలిసిన ఒక స్నేహితుడు ద్వారా కొత్త పనిమనిషిని ఇంట్లో కుదుర్చుకోవాలి అని అనుకుంటాడు. అయితే అతని ద్వారా మలయాళం అనే పేరుతో ఒక వ్యక్తి వస్తాడు. అయితే అతనికి వంటలు రాకపోయినా కూడా వచ్చినట్లు అబద్దం చెబుతాడు. దీంతో ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది.

ఇక గోవిందరాజులు అతనికి వంట పనులు అన్నీ వచ్చు అనుకుని ఇంట్లో అందరితోనూ చాలా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అతను చాలా గొప్ప వడ్డవాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మలయాళం మాత్రం వంట గదిలో కూర్చుని ఇప్పుడు వంటలు ఎలా చేయాలి అని తన మామను తలుచుకుని తిడుతూ ఉంటాడు.

మలయాళం వంటల ఆలోచన

మలయాళం వంటల ఆలోచన

ఇక అప్పుడే మల్లికా అతడి దగ్గరికి వస్తుంది. మలయాళంకు కూడా గొప్పగా వంటలు వచ్చు అనుకొని మల్లికా ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అతనితోపాటు కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్లో పోస్ట్ చేసి డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తుంది. అయితే మలయాళ మాత్రం అప్పుడే ఒక ఆలోచనతో వంట పనులను చేయాలని అనుకుంటాడు.

మల్లిక ఎలాగూ విభిన్నమైన తరహాలో వంటలు చేస్తుంది కాబట్టి ఆమె తరహాలోని నేను ఫాలో అవుతాను అని అనుకుంటాడు. ఇక ఇద్దరు కూడా ఓకే గదిలో వంటలు పోటాపోటీగా చేస్తూ ఉంటారు. ఇక మల్లిక వారు వంటలు చేసే విధానాన్ని మొత్తం కూడా ఫోన్ ద్వారా రికార్డ్ చేస్తూ ఉంటుంది.

రామ వద్దకు పోలీస్ ఆఫీసర్

రామ వద్దకు పోలీస్ ఆఫీసర్

ఇక మరోవైపు రామచంద్ర మాత్రమే ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా సరిదిద్దేలా చేయాలని అనుకుంటాడు. ఇక అతను చక్రాల బండి మీద స్వీట్స్ అమ్ముతూ ఉంటాడు. అతను స్వీట్స్ అమ్ముతూ ఉండగా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి కొన్ని స్వీట్స్ కావాలని అంటాడు. మొన్న మా కానిస్టేబుల్ నీ దగ్గర నుంచి కొన్ని స్వీట్స్ తీసుకువచ్చాడు. అవి చాలా బాగున్నాయి.

మా పిల్లలు కూడా అవే కావాలని అంటున్నారు. అందుకే అన్ని రకాల స్వీట్స్ కలిపి ఇవ్వమని ఆ పోలీస్ ఆఫీసర్ చెబుతాడు. దీంతో రామచంద్ర అతన్ని అలానే చూస్తూ ఉంటాడు. మీరు ఈ పోలీస్ డ్రెస్ లో చాలా బాగున్నారు అని అంటాడు. ఇక ముందుకు పోలీస్ ఆఫీసర్ ఏ మనిషికైనా కూడా ముందుగా పోలీస్ అవ్వాలి అంటే ఫిట్నెస్ లో బలంగా ఉండాలి అని ఉంటాడు.

కష్టపడి చదివితే..

కష్టపడి చదివితే..

ఇక రామచంద్ర కూడా ఒకప్పుడు తాను కూడా పోలీస్ అవ్వాలని అనుకున్నాను అని అంటాడు. కష్టపడి చదివితే ఎవరైనా సరే పోలీస్ ఆఫీసర్ అవుతారు అని ఇదొక మంచి గౌరవమని అంటాడు. ఇంకా అందుకు రామచంద్ర ఆలోచించి జానకి కూడా పోలీస్ అవుతోంది కాబట్టే ఆమె కూడా ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచిస్తాడు.

ఇక జానకి సాయంత్రం కాగానే రామచంద్ర చక్రాల బండి దగ్గరకు వస్తుంది. కాలేజీలో ఫీజ్ కోసం డబ్బులు అడగాలని అనుకుంటుంది. ఇక రామచంద్ర ఆమెను చూసి మీరు ఎందుకు వచ్చారు అని ఇంటి దగ్గరే ఉండి చదువుకోవాల్సింది అని అంటాడు. మీకు ఇక్కడ ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అని వచ్చాను అని చెబుతోంది.

ఫీజ్ కోసం జానకి ఆలోచన

మీరు నా కోసం ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి అని మీ సమయాన్ని మొత్తం మీ చదువు కోసం కేటాయించాలని రామ చెబుతాడు. ఇక జానకి తన ఫీజ్ గురించి చెప్పడానికి కాస్త సందేహిస్తుంది. అయితే రామచంద్ర జానకిని చూసి ఓకే డబ్బులు కట్టాలి కదా కట్టేద్దాం లేండి అని అంటాడు.

ముందుగా జానకి కాస్త సంతోషిస్తుంది. కానీ నిజానికి రామచంద్ర జానకి ఫీజ్ కోసం కాకుండా కిరణం షాపులో డబ్బులు కట్టడం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక జానకి మళ్ళీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది.

మల్లికకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జానకి

మల్లికకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జానకి

మరోవైపు మల్లిక యూట్యూబ్లో వంటలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయగా వాటికి వచ్చిన కామెంట్స్ గురించి మలయాలంతో చెబుతూ ఉంటుంది. అయితే అతనికి అన్ని అబద్ధాలు చెబుతూ ఉండడంతో ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చక్రాల బండి తీసుకొని రామ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక మల్లిక, రామచంద్రను అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటుంది.

జానకి కూడా ఆమెకు కౌంటర్ గట్టిగానే ఇస్తుంది. ఇక రామచంద్ర ఇంట్లోకి రాగానే తండ్రిని ఒక ప్రశ్న అడుగుతాడు. మీరు మళ్ళీ గుమస్తాగా పనిచేయడానికి ఒప్పుకున్నారా అని అడుగుతాడు. ఖాళీగా ఉంటే ఏమి తోచడం లేదు అని అందుకే ఏదైనా ఒక పని చేద్దామని అనుకుంటున్నాట్లుగా చెబుతాడు. అందుకు జానకి మీరు ఏ పని చేయకూడదు అని మీ కష్టాలను తీర్చడంతో పాటు మిమ్మల్ని ఆనందంగా చూసుకోవడం కూడా మా బాధ్యతని జానకి మాట్లాడుతుంది. మరి ఈ విషయంలో జ్ఞానాంబ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X